వార్తా పత్రికను పొందండి

మీ ఇ–మొయిల్ అడ్రస్

మా పూర్వపు వార్తా ప్రతుల కొరకు సందర్సించండి
అభిప్రాయ సేకరణ
ప్రభుత్వ ఆసుపత్రులలో యూజరు చార్జీలు ప్రవేశపెట్టుట వల్ల కనీస వసతులు మెరుగుపడతాయా ?






Document Actions


భారత ప్రగతి ద్వారం

సమాచార, సాంకేతిక పరిజ్ఞాన శాఖ, భారత ప్రభుత్వం వారి సహకారంతో ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్, హైదరాబాద్ ) వారు భారత ప్రగతి ద్వారం అనే పధకం ద్వారా దేశ  వ్యాప్తంగా గ్రామీణ, సామాజిక అభివృద్ధికి దోహదంచేసే విధంగా బహుళ భాషా వెబ్ పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ  వెబ్ పోర్టల్ లో  వ్యవసాయం, ప్రాధమిక విద్య, ఆరోగ్యం, ఇ-పాలన, ఇంధన వనరుల రంగాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ భారత ప్రగతి ద్వారం  అని పిలిచే ఈ వెబ్ పోర్టల్ నిజ జీవితంలో అందరికీ అవసరమయ్యే , నమ్మకమైన సమాచార ఉత్పత్తులను, సేవలను గ్రామీణ భారతానికి వారి వారి స్థానిక భాషల్లో అందజేస్తుంది.  ఇంటర్నెట్ వాడకం, ఇతర సమాచార పరిజ్ఞాన ఉపకరణాల వాడకం, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ప్రజలు వారి జీవనోపాధులను  మెరుగుపరుచుకోవడానికి  ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తుంది.  

ప్రస్తుతానికి భారత ప్రగతి ద్వారం  కొన్ని ముఖ్యమైన అంశాలు - అంటే ఆరోగ్యం(నీరు, పారిశుధ్యంతో సహా), ప్రాథమిక విద్య, వ్యవసాయం, గ్రామీణ శక్తి వనరులు, పరిసరాలు, ఇంకా ఇ-గవర్నెన్స్ వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. ఈ వెబ్ పోర్టల్  వల్ల గ్రామీణ ప్రజలకూ, ప్రభుత్వానికీ, తదితర సంస్థలకు, ఇంకా విద్యా సంస్థలకు మధ్య ఉండే అంతరాన్ని బాగా తగ్గించవచ్చు అనేది భారత ప్రగతి ద్వారం భావన. గ్రామీణాభివృద్ధి ని సాధించడానికి ప్రజలు, సంస్థలు, అనుభవజ్ఞులు నలుమూలల నుంచి పరస్పర సహకారంతో అందరూ పాల్గొని పూర్తి ప్రజాస్వామిక, ప్రజామిత్ర సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపోందించడమే భారత ప్రగతి ద్వారం అంతిమ లక్ష్యం.

Powered by Plone CMS, the Open Source Content Management System

ఈ సైట్ ప్రమాణాలకు తగినట్లుగా ఉంది