మహిళా సాధికారత
ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా స్త్రీలను బలోపేతం చేయడమనే విషయాలు మహిళాసాధికారతలో ప్రస్తావింపబడ్డాయి . స్వశక్తి పై విశ్వాసాన్ని ఆభివృద్ధిపరచడం కూడ సాధికారతలో కలిసి ఉంటుంది.సాధికారత దాదాపుగా కింది అంశాలతో లేదా అదే సామర్ధ్యాలతో ఉంటుంది. అవి
* స్వయం నిర్ణ యాత్మక శక్తిని కల్గి ఉండడం.
* తగిన సమయంలో తగిన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవసరమైన సమాచారం మరియు వనరులు అందుబాటులోకి తెచ్చుకోవడం.
* అవును/కాదు, ఇదిగాని/ అదిగాని వంటి మాటలు గాక తమ పరిధి మేరకు ఇష్టాలను ఎంచుకోవడం.
* సాముదాయిక నిర్ణయంలో నిస్సందేహమైన ఖచ్చితత్వాన్ని కల్గి ఉండడం.
* మార్పుకనుగుణమైన సానుకూల దృక్పథా న్ని పొందకల్గడం.
* వ్యక్తిగతంగాను లేదా సామూహికశక్తిగాగల నైపుణ్యాల సామర్ద్యాలను మెరుగు పరచుకోవడం.
* ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా ఇతరుల గ్రహణశక్తిని మార్చే సామర్ధ్యాన్ని కల్గి ఉండడం.
* ఎదుగుదల ప్రక్రియలో, నిరంతర మార్పులకు, స్వయం ప్రేరకంగా కలిసిపోవడం.
* అనుకూల వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం, అపవాదాల నుంచి అధిగమించడం.
-
|
భారతదేశపు మహిళలు ఇప్పుడు విద్య, రాజకీయం, ప్రసారమాద్యమం (మీడియా) కళా సాంస్కృతిక , సేవా విభాగాలలోను, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక విషయాలు మొదలగు వాటి కార్యకలాపాలన్నింటిలోను పాల్గొంటున్నారు.
భారతీయ మహిళలందరికిని సమానత్వం( నిబంధన14), వివక్షలేకుండుట (నిబంధన 15(1), సమానావకాశాలు కల్పించడం (నిబంధన16), సమాన పనికి సమాన వేతనం (నిబంధన 39(డి),వీటితో బాటు స్త్రీలకు పిల్లలకు అనుకూలంగా ప్రత్యేక నిబంధనలను అనుమతించడం(నిబంధన 15(3) , మహిళల గౌరవానికి భంగం కల్గించే ఆచారాలను లేకుండా చేయడం(నిబంధన 51(ఎ) (ఇ), అంతేగాక మహిళలు చేసేపనులలో న్యాయపరమైన, మానవోచిత పరిస్థితులలో రక్షణ కల్పించడం, ప్రసూతి సమయంలోఉపశమనానికి (నిబంధన 42) సదుపాయాలను అనుమతించడం వంటి హామీలను భారత రాజ్యాంగం కల్పించింది.
1970 వ సంవత్సరం తర్వాత స్త్రీవాద ఉద్యమం శీఘ్రగతిని పుంజుకుంది. మహిళా సమూహాలన్నీ ఒక్కటిగా కలిసి మథుర లో జరిగిన అత్యాచార కేసును జాతీయ స్థాయి లోనే మొట్ట మొదటి అంశంగా ముందుకు తెచ్చాయి.మథుర పోలీసు స్టేషన్‌లో జరిగిన బాలికపై అత్యాచారం చేసిన పోలీసులనూ, నిర్దోషులు గా విడిచిపెట్ట బడిన వారినీ ముద్దాయిలుగా నిలబెట్టడంలో విస్తృతమైన నిరస నోద్యమాలను 1979-1980 సంవత్సరాలలో చేపట్టారు. ఈ నిరసనలు జాతీయస్థాయిలో బహుళ వ్యాప్తి చెందాయి. దీనితో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగడంతో నేర విచారణ స్మృతి, భారత శిక్షా స్మృతిలోగల సాక్ష్య చట్టానికి సవరణలు చేయడం, పోలీసు అధీనంలో అత్యాచారమనేది కూడ ఒక శ్రేణిగా ప్రవేశ పెట్టడం జరిగింది.
ఆడ శిశువుల హత్యలు, లింగ వివక్ష, స్త్రీ ఆరోగ్యం, మరియు మహిళా అక్షరాస్యత వంటి అంశాలలో స్త్రీవాద ఉద్యమకారులు కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. భారతీయ స్త్రీలపై తరచుగా జరిగే హింసాత్మక ఘటనలు మద్యపానం సేవించడం ద్వారా జరగడంతో ఆంధ్ర ప్రదేశ్ , హిమాచల ప్రదేశ్, హర్యానా, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఇంకను ఇతర రాష్ట్రాలలో చాలా మహిళా సమూహాలు మద్యపాన వ్యతిరేక ఉద్యమాలు ఆరంభించాయి . చాలా మంది భారతీయ ముస్లిమ్ మహిళలు ప్రాధమిక ( మౌలిక) నాయకులను షరియత్ చట్టంలో గల స్త్రీల హక్కులపై వివరణకై ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా మూడు సార్లు తలాక్ చెప్పే విధానాన్ని విమర్శిస్తున్నారు. 1990వ సంవత్సరంలో విదేశీ సంస్థల విరాళాల నుంచి పొందిన నిధులద్వారా మహిళల దృష్ట్యా పనిచేసే నూతన స్వచ్చంద సంస్థ ఏర్పరచబడింది. స్వయం ఉపాధి మహిళా సంఘాలు(ఎస్ ఇ డబ్ల్యు ఎ- సేవా) వంటి స్వయం సహాయక బృందాలు, స్వచ్చంద సేవాసంస్థలు భారత దేశపు స్త్రీల హక్కులపై ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. నర్మదా బచావో ఆందోళనలో మేధా పాట్కర్ లాగా స్థానిక ఉద్యమాలలో చాలా మందిమహిళా నాయకురాళ్ళు ఉద్భవించారు.
2001 సంవత్సరాన్ని భారతదేశం మహిళా సాధికారతాసంవత్సరం (స్వశక్తి) గా ప్రకటించింది. స్త్రీ స్వశక్తి పై జాతీయ విధానం (పాలసీ) 2001 సంవత్సరంలో జారీ అయింది. |
|
మహిళా సంక్షేమ పధకాలు (ఆంధ్రప్రదేశ్ )
అభయహస్తం
గృహహింస నిరోధక చట్టం 2005
ఉచిత న్యాయ సహాయం
జన శిక్షణ సంస్థాన్
సబల పథకం
స్వాధార్, షార్ట్ స్టే వసతి గృహాలు , స్టేట్ హోం, ఉజ్వల వసతి గృహాలు
స్వయం సిద్ధ
ఆంధ్ర ప్రదేశ్ మహిళ ఆర్ధిక సహకార సంస్థ
పనిచేసే చోట లైంగిక వేధింపులు