సామాజిక సంక్షేమము
భారత ప్రభుత్వం విస్తృతమైన సామాజిక సంక్షేమ పద్ధతులను ఏర్పరచింది. వాటిలో భాగంగా షెడ్యూల్ కులాల వారికి, షెడ్యూల్ తెగల వారికి , వెనుకబడిన వర్గాలకు , మైనారిటీలకు , మహిళలకు, మరియు ఆయా వర్గాలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి అనేక పథ కాలు కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. మనకు గల ఈ పథకాలలో
- కనీస అవసరాల కార్యక్రమాలు ( ఆహారం, దుస్తులు, ఇండ్లు, అందుబాటులోకి విద్య,ఆరోగ్యం, మరియు మంచినీరు) మరియు సామాజిక భద్రతకు గల కార్యక్రమాలు.
- అంధులకు, బధిరులకు, బుద్ధిమాంద్యంగల వారికి, శారీరక అంగ వైకల్యం గల వారికి సేవలందించడం. నిర్వాసితులకు, గ్రామీణ ప్రజల కొరకు కార్యక్రమాలు అమలు చేయడం
- సంక్షేమ నిధుల వినియోగం, మహిళలకు వయోజన విద్య, మహిళా ఉద్యోగినులకు వసతి గృహాలు కల్పించడం, కుటుంబ నియంత్రణ, ప్రసూతి భద్రత మొదలగు మహిళల కొరకు చేసే కార్యక్రమాలు ఉన్నాయి.
- బాల నేరస్తులకు, సెక్స్ వర్కర్లకు , నేరారోపణ గలవారికి పునరావాసాన్ని ఏర్పరచడానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
- కరువు కాటకాలు, వరదలు, భూకంపాలు మొదలగు ప్రకృతి వైపరీత్యాల వంటి అత్యవసర సహాయ కార్యక్రమాలు, మరియు అస్పృశ్యతను రూపుమాపటం మొదలగు వాటికి ఇతర సామాజిక భద్రతా కార్యక్రమాలు రూపోందించి అమలు చేయబడుతున్నాయి.
- పైన తెల్పిన కార్యక్రమాలే గాక ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు ( స్వచ్చంద సంస్థలు ) వివిధ అంశాలపై ప్రజలను జాగృతిపరుస్తున్నారు.
- సామాజిక దురాచారాలు, మూడనమ్మకాలపై (మహిళా సాధికారత, బాల్య వివాహాలు, ఆడ శిశువుల హత్య, స్త్రీ వివక్ష, వరకట్నం, దాసి పద్ధతి, మద్యపానం, పొగత్రాగడం మరియు క్షుద్ర విద్య ప్రయోగాల) పై వివిధ స్థాయిలలో అవగాహన ఉద్యమాలను నిర్వహించడం,
- అసహాయ స్థితిలో ఉన్న వారికి ( వైకల్యం గలవారు, వయో వృధ్ధులు, అనాధ మరియు వీధి పిల్లలు, గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణ ప్రాంతాలకి వలసపోవడం) పునరావాసిత కేంద్రాలను ఏర్పరచడం.
- సామాజిక భద్రతా పథకాలను (గృహనిర్మాణం, పించను సౌకర్యం, ఆహార హక్కు, ఉపాధికల్పన) అమలు జేయడం. మొ దలైనవి.
పై వాటిని దృష్టిలో పెట్టుకుని చేసిన దృఢ ప్రయత్నంలో ఇదే లక్ష్యాలతో భారత ప్రగతి ద్వారం వారు సమాచారాన్ని, విషయాన్ని, ఉత్పత్తులను రూపొందించి, వివిధ అంశాలపై అవగాహనకల్పించడం, గ్రామీణ ప్రజలకు సులభంగా తెలియ జేయడానికి ఈ సేవలను అందుబాటులో ఉంచడం చేస్తున్నారు .






