బయో ఇంధనాలు
జట్రోపా
జట్రోపా కర్కాస్ అనేది బహుళ వంటలకు ఉపయోగపడని నూనె నిచ్చే ఒక రకమైన ఎడతెగక పెరిగే పొద. దీని పుట్టుక అమెరికా, పశ్చిమాసియాల నుంచి వచ్చింది. దీనికి రబ్బరు పాలను ఉత్పత్తిచేసే గుణం ఉంది. అందువల్ల జంతువులు వీటి జోలికి పోవు. ఇది చాలా కరువుకాటకాలనూ తట్టుకొని జీవించే పంట. సాగుచేయడానికి కష్టమైన భూమిలో సైతం పెరుగుతుంది. తక్కువ వ్యయమౌతుంది. ఈ పంటను 30ఏళ్ల వరకు ఆర్థిక భారం ఎక్కువలేకుండా పండించవచ్చు. జట్రోపా నుంచి తీసిన నూనెను బయో డీజిల్ మిశ్రమంగా 20% దాకా వాడొచ్చు ఐతే, రీఫైన్డ్ ఆయిల్ మరింత శుభ్రమైన బయోడీజిల్గా పనిచేస్తుంది. మరిన్ని వినరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
చక్కెర దుంప
చక్కెర దుంప (Beta vulgaris Var. Saccharifera L.) అనేది ఉష్ణదేశాల్లో
రెండేళ్లకోసారి పండే పంట. ఇది నెమ్మదిగా ఉష్ణ మండల, ఉప ఉష్ణమండల దేశాల్లో
ప్రత్యామ్నాయ శక్తిపంటగా ఇథనాల్ ఉత్పత్తికై ప్రసిద్ధి పొందుతోంది.
ఇథనాల్ను పెట్రోల్తోగానీ, డీజిల్తోగానీ 10 శాతందాకా కలిపి బయో ఇంధనంగా
వాడుకోవచ్చు. చక్కెర దుంపయొక్క ఉప ఉత్పత్తులైన దుంపపైభాగం పచ్చని గడ్డిగా
, దాని పిప్పి, ఫిల్టర్ కేకులను పశువుల
దాణాగా వాడొచ్చు. మరిన్ని వినరాలకు ఇక్కడ క్లిక్
చేయండి
తియ్య జొన్న
తియ్య జొన్న అనేది వరి తర్వాత అంత ఎక్కువ స్థలంలో పండే అతి ముఖ్యమైన జొన్న
పంట. దీనిని ధాన్యానికి, పశువుల దాణాకోసం ఎక్కువగా పండిస్తారు. దీనిని
వ్యాపారాత్మకంగా ఆహార పరిశ్రమలో, విలువాధారిత పరిశ్రమలలో ఇథనాల్, సిరప్,
బెల్లం, పశువుల దాణా ఉత్పత్తికి కూడా వాడతారు. మరిన్ని వినరాలకు
ఇక్కడ క్లిక్
చేయండి
లామిగ (పొంగమియా)
అనేక రకాలైన ఆహారయోగ్యము కాని చెట్లను
జీవ రసాయన ఇంధనం (బయోఫ్యూయల్) ఉత్పత్తి చేయుట కొరకు పెంచవచ్చును. దీని
కొరకు కరాన్జ (లామిగ) అనే చెట్లు సరియైనవి. ఇవి దేశంలో వివిధ ప్రాంతాలలో
విస్తారంగా పెరుగుతాయి.మరిన్ని వినరాలకు ఇక్కడ క్లిక్
చేయండి



