Document Actions


జాతీయ బయోగ్యాస్‌, సేంద్రియ ఎరువుల నిర్వహణా కార్యక్రమం(ఎన్‌బిఎంఎంపి)

ఈ జాతీయ బయోగ్యాస్ అభివృద్ధి పథకం అనేది 1981-82లో ఆరంభం అయ్యింది.

లక్ష్యాలు
  • కుటుంబాలకోసం  ఉద్దేశించిన బయోగ్యాస్ ప్లాంట్లద్వారా గ్రామీణ కుటుంబాలకు వంటగ్యాసును, సేంద్రియ ఎరువులనుఅందించడం.
  • గ్రామీణ మహిళల వంటచెరకుకోసం పడే కష్టాలను తొలగించడం. అడవులలో చెట్లనునరికే పనుల  తగ్గించడం, సామాజిక లాభాలుపెంచడం.
  • గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్యతను మెరుగుపరచడం. దానికి సురక్షిత మరుగుదొడ్లనునిర్మంచి వాటిని బయోగ్యాస్ ప్లాంట్లతో అనుసంధించడం.


విడి భాగాలు
  • పూర్తిస్వదేశీయంగా అభివృద్ధి చేసిన బయోగ్యాస్ ప్లాంట్ నమూనాలనిప్రోత్సాహించడం జరుగుతుంది.
  • వీటిని అమలు చేయడానికి రాష్టాలు కొన్నినోడల్ శాఖలను, నోడల్ ఏజన్సీలను ఏర్పాటు చేసింది. ఖాదీ గ్రామపరిశ్రమల కమీషన్,  ముంబై జాతీయ పాల సేకరణ అభివృధ్ధి, ఆనంద్(గుజరాత్)తోబాటు పలు జాతీయ, ప్రాంతీయప్రభుత్వేతర సంస్థలు అమలుచేయడంలో నిమగ్నమైఉన్నాయి.
  • ఈ ప్రాజెక్ట్  కింద  పలురకాలైన ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. వీటిలోకేంద్ర ఆర్ధిక సాయం, వినియోగ దారులకు టర్న్ కీ పనుల ఫీజు, రాష్ట్ర నోడల్ శాఖలకు. ఏజన్సీలకు  సేవా ఛార్జీలు, ఇంకా శిక్షణ, ప్రచారాలకు తగిన సాయం ఉన్నాయి.
  • వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలనుసమర్థించడం జరుగుతుంది. బయోగ్యాస్ అభివృద్ధి, శిక్షణాకేంద్రాలు 9 ప్రధాన రాష్ట్రాలలోనిర్వహించడం జరుగుతోంది. ఇవి రాష్ట్ర నోడల్ శాఖలకు, సంస్థలకు  సాంకేతికతను, శిక్షణా సాయాన్నిస్తాయి.
  • వ్యవసాయ ప్రాధాన్యతగల ప్రాంతాల్లోబయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు వ్యాపార, సహకార బ్యాంకులు అప్పులుఇస్తున్నాయి.నాబార్డు(నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) వివిధబ్యాంకులకుఆటోమేటిక్ రీఫైనాన్సింగ్  సౌకర్యాన్ని అందిస్తోంది.


ఆమోదించిన గృహరకమైన బయోగ్యాస్ ఎరువు కర్మాగారముల నమూనాలు

1. ముందుగా అమర్చి, సిద్ధంచేసిన బయోగ్యాస్ కర్మాగారాల నమూనా

  • రి ఇన్‌ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ (ఆర్ సి సి)తో తయారుచేసి,ముందుగా అమర్చి, సిద్ధంచేసిన , స్థిరంగా ఉండే పైకప్పు నమూనా
  • ముందుగా అమర్చి, సిద్ధంచేసిన, ఆర్ సి సి డైజెస్టర్ కె వి ఐ సి రకం బయోగ్యాస్ కర్మాగారం
  • ఎక్కువ సాంద్రతగల పోలి ఎథిలీన్ (హెచ్ డి పి ఇ) తో తయారుచేసి, ముందుగా అమర్చి, సిద్ధంచేసిన, పూర్తిగా దీనబంధు బయోగ్యాస్ కర్మాగారాన్ని పోలిన, నమూనా.
  • ఫైబర్ గ్లాస్ రి ఇన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్ (ఎఫ్ ఆర్ పి) తో చేసిన, ముందుగా అమర్చి, సిద్ధంచేసిన, బయోటెక్ తయారీ బయోగ్యాస్ కర్మాగారం
  • ఎక్కువ సాంద్రతగల పోలి ఎథిలీన్ (హెచ్ డి పి ఇ) తో తయారుచేసి, ముందుగా అమర్చి సిద్ధం చేసిన , కె వి ఐ సి రకం , కదిలే పై కప్పు బయోగ్యాస్ కర్మాగారం
  • శక్తి - సురభి - ఎఫ్. ఆర్. పి. ఆధారంగా గల బయోగ్యాస్ వ్యవస్ధ. వివేకానంద కేంద్రం, కన్యాకుమారి, వారిచే అభివృద్ధి పరచబడిన.ముందే నిర్మించబడిన, ఎక్కడికైనా తీసికెళ్ళగల కదులుతూ ఉండే డోమ్ గల కే. వి. ఐ. సి. నమూనా.
  • సింటెక్స్ వాడి తయారు చేసిన, ప్లాస్టిక్ ఆధారంగా గల, కదిలే డోమ్ తో కే. వి. ఐ. సి. రకం బయోగ్యాస్ వ్యవస్ధ. సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కలోల్ (గుజరాత్) వారిచే అభివృద్ధి పరచబడినది

2. కదిలే పైకప్పు బయోగ్యాస్ కర్మాగారాలు

  • లోహంతో తయారుచేసిన, కదిలే పైకప్పుగల, కె వి ఐ సి రకం బయోగ్యాస్ కర్మాగారం
  • ఫెర్రో సిమెంట్ డైజెస్టర్, ఎఫ్ ఆర్ పి గ్యాస్ హోల్డర్ కలిగిన కె వి ఐ సి రకం కర్మాగారం
  • ప్రగతి రకం బయోగ్యాస్ కర్మాగారం

3. సంచి లాంటి బయోగ్యాస్ కర్మాగారం (ఫ్లెక్సి మోడల్)

4. స్థిరమైన పైకప్పుగల బయోగ్యాస్ కర్మాగారాలు

  • ఇటుకల నిర్మాణంతో దీనబంధు నమూనా.
  • సహజసిద్ధమైన ప్రదేశ పద్ధతితో దీనబంధు ఫెర్రోసిమెంట్ నమూనా.
  • ముందుగా తయారుచేసిన హెచ్ డి పి ఇ మెటీరియల్ ఆధారితమైన, దీనబంధు నమూనా కుటుంబ పరిమాణ బయోగ్యాస్ కర్మాగారములకి ముందుగా తయారుచేసిన కప్పు.
  • సాలిడ్ - స్టేట్ దీనబంధు డిజైన్ స్ధిరమైన డోమ్ గల నమూనా, ఐ.సి.ఎ ఆర్. వారిచే అభివృద్ధి పరచబడినది.


ఆమోదం పొందిన బయోగ్యాస్ ప్లాంట్స్ - అభివృధ్ధి పరచడానికి అనుమతి పొందినవి

నమూనా

ఆమోదం పొందినసామర్థ్యం(ఘన మీటర్లలో రోజువారీ  గ్యాస్ ఉత్పత్తి)

తేలియాడే డ్రమ్ము రకపు బయోగ్యాస్ ప్లాంట్ -కేవిఐసి మాడల్

1 నుంచి 10

కేవిఐసి నమూనా ఫెర్రో సిమెంట్ జీర్ణకారితో / లేదా ఫైబర్ గ్లాస్ తో రీఇన్ఫోర్స్ చేసిన ప్లాస్టిక్(ఎఫ్ఆర్పి) గ్యాస్ హోల్డర్స్

1 నుంచి 10

దీనబంధునమూనా

1 నుంచి 6

దీనబంధునమూనా ఇన్-సిటు నమూనా ఫెర్రో సిమెంటుతో-1

1 నుంచి 6

ప్రగతినమూనా-1

1నుంచి 6

రబ్బరైజ్డ్ నైలానుగుడ్డతో తయారైన  సంచీజీర్ణకారి - బాగ్ డైజిస్టర్

1నుంచి 6



గ్రామీణ శక్తి కార్యక్రమాలను అమలుచేయడానికి నోడల్ శాఖలు, నోడల్ ఏజెన్సీలు

ప్రాంతాల్లొ ఈ ఎన్ బి ఎంఎంపి కింద ఇచ్చిన ఆర్థిక ప్రోత్సాహకాలు

 

 

తరగతి

ఒక ప్లాంటుకు ఇచ్చేకేంద్ర సబ్సిడీ

ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, సిక్కిం(అస్సాం మైదాన ప్రాంతాలుమినహా)

 రు.14,700/- 

 

అస్సాం సాధారణప్రాంతాలు

రు.9,000/- (  2-4 ఘ.మీ.కిరు. 10,000/-  పరిమితం చేయబడింది. స్థిరమైన డోమ్ రకం

 

జమ్మూ కాశ్మీర్,  హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్(కొండలోతట్టుప్రాంతాలు మినహా), తమిళనాడు లోని నీలగిరి, సదర్  కుర్సూండ్, కలింపాంగ్, డార్జిలింగ్ జిల్లా ఉపమండలాలు(పశ్చిమ బెంగాల్), సుందర్బన్స్, అండమాన్ నికోబార్ ద్వీపాలు

రు. 4,000/-
(  2-4 ఘ.మీ.కిరు. 10,000/-  పరిమితం చేయబడింది. స్థిరమైన డోమ్ రకం

 

 

మిగిలిన ప్రాంతాలు

రు.4,000/-
(  2-4 ఘ. మీ.కిరు. 8,000/-  పరిమితం చేయబడింది. స్థిరమైన డోమ్ రకం

 

 

(ii)  బయోగ్యాస్‌ ప్లాంట్‌లతోఅనుసంధించిన సురక్షిత మరుగుదొడ్లు  : సురక్షితమరుగుదొడ్లను అనుసంధించడానికోసం ప్లాంటుకు 1000 రు.చొప్పునకేంద్ర రాయితి లభిస్తుంది.   

(iii) 5 ఏళ్ల ఉచిత నిర్వహణా వారంటీతో టర్న్‌ కీ జాబ్‌ ఫీజు: 1500 రు.  

(iv) పాతవి పని చేయనిప్లాంట్ల రిపేరుకు ఆర్థిక సాయం  :  కేంద్ర సబ్సిడీలో 50 శాతానికి పరిమితమైన ఆర్థికసాయాన్ని  వివిధ వర్గాలలబ్దిదారులకుప్రాంతాలకు అందివ్వడం జరుగుతుంది.  కుటుంబాల్లోవాడే కనీసం5 ఏళ్లు దాటిన ప్లాంటులు ఏవైతే సరిగ్గాపనిచేయకుండా మూలన పడ్డాయో, వాటి రిపేరీలకు ఈసాయాన్నివ్వడం జరుగుతుంది. 




Powered by Plone CMS, the Open Source Content Management System

ఈ సైట్ ప్రమాణాలకు తగినట్లుగా ఉంది