జాతీయపక్షి

భారతజాతి నెమలి,
పావాక్రిస్టాటస్ వర్ణరంజితమైన, హంస పరిమాణంలో ఉండే పక్షి ఇది భారతదేశం
యొక్క జాతీయపక్షి. ఇది విసనకర్రలా ఉండే ఈకలతో, కంటి క్రింద ఒకతెల్లని
మచ్చతో పొడవైన నాజూకైన మెడతో ఉంటుంది. మగజాతి నెమలి, ఆడజాతి నెమలి కంటే
అందంగా, మెరిసే నీలం రంగు ఛాతీ, మెడ కలిగి, కంటికి యింపైన కంచు- ఆకుపచ్చ
రంగులో దాదాపు రెండువందల పొడవైన ఈకలతో ఉండే పింఛం తో ఉంటుంది. ఆడ నెమలి
గోధుమ రంగులో మగ నెమలి కంటే చిన్నగా ఉండి, తోక లేనిదై ఉంటుంది. మగ నెమలి
సర్వాంగ సుందరమైన ప్రణయనృత్యంతో తన తోకను విసనకర్రలా విప్పి ఈకలను
సవరించుకునే విధానం ఒక కమనీయమైన దృశ్యం.
వెనుకకు: జాతీయ
చిహ్నలు