జాతీయ జెండా
జాతీయ జెండా సమాంతరంగా (అడ్డంగా) విస్తరించి ఉండే మూడు రంగుల సమ్మేళనం. పైన కాషాయ వర్ణంలోనూ, మధ్యలో తెలుపు వర్ణంలోనూ, క్రింద ముదురాకు పచ్చలోనూ సమానమైన ప్రమాణంతో ఉంటుంది. జెండా యొక్క వెడల్పు, దాని పొడవులో 2. : 3 నిష్పత్తిలో ఉంటుంది. జెండాలోని తెలుపు పట్టీలో ముదురు నీలం రంగు చక్రం ఉండి, అది దేశభక్తి కి ప్రతీకగా ఉంటుంది. ఈ చక్రం యొక్క నమూనా అశోకుడి సార్వనాధే సింహస్ధూపం (సార్వనాధే లియన్ కేపిటల్) యొక్క స్తంభ ఫలకం పై నున్న చక్రం నుండి తీసుకొనబడింది. దీని యొక్క వ్యాసం, జెండాలోని తెల్లభాగం యొక్క వెడల్పుతో దాదాపు సమానంగా ఉండి 24 కమ్మీలు ( ఆకులు) కలిగి ఉంటుంది. జాతీయ జెండా యొక్క నమూనాను, భారత సంవిధాన సభ (కాన్స్టిట్యూటియన్ట్ అసెంబ్లీ ) 22 జూలై 1947లో ఆమోదించింది. ప్రభుత్వం శాసనాలు కాని నిబంధనలు ఎప్పటి కప్పుడు సవరించబడి, వాటి కనుగుణంగా, జాతీయ జెండా ప్రదర్శన నియంత్రిచబడింది. (చట్టం) నియమావళి, 1950 ( నవంబరు 12, 1950) మరియు జాతీయ గౌరవం ఎడల అవమానాలను నిరోధించే చట్టం, 1971 ( 1971 యొక్క నంబరు 69) లకు లోబడి జెండా ప్రదర్శన ఉంటుంది. భారత జెండా నిబంధనలను, రివాజులను ఒకే చోటికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఈ విషయం సంబంధించిన వారందరికీ సూచించడానికి ఇది ఉపయోగపడుతుంది.
భారత జెండా నిబంధనలన (ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా), 2002 జనవరి 26, నుండి అమలులోకి వచ్చి, అప్పటి వరకూ ఆచరణలో ఉన్న జెండా నిబంధన – భారత్ యొక్క (ఫ్లాగ్ కోడ్- ఇండియా) ను రద్దు చేసింది. భారత జెండా నిబంధన 2002 లోని నియమాల ప్రకారం, సామాన్య ప్రజానీకం, ప్రైవేట్ సంస్ధలు, భారత జెండా ను ప్రదర్శించడానికి ఎటువంటి పరిమితులూ లేవు కాని, చిహ్నలు మరియు నామాలు (ద ఎంబ్లెమ్స్ అండ్ నేమ్స్ ) అనుచితమైన వాడకాన్ని నిరోధించే చట్టం 1950ప్రకారం మరియు జాతీయ గౌరవానికి జరిగే అవమాన నిరోధక చట్టం 1971, లేక యింకా ఏదైనా ఈ విషయానికి సంబంధించి తీసుకుని వచ్చిన చట్టానికి లోబడి ఈ అవకాశం ఉంటుంది. ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా (భారత జెండా నిబంధన) గురించి మరింత తెలుసుకొనండి.
ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా (భారత జెండా నిబంధన) గురించి మరింత తెలుసుకొనండి.


