జాతీయ చిహ్నం
రాష్ట్ర చిహ్నం అశోకుడి సారనాధ్ సింహస్థూపం నుండి గ్రహించబడినది మాతృకలో నాలుగు సింహాలు, వాటి వెనుక వైపులు ఎదురెదురుగా ఉండి ఒక స్తంభాగ్రాన నిలిచి ఉండి, వాటికి ఉపరితలానికి మధ్య ఉబ్బెత్తు శిల్పాలుగా ఒక ఏనుగు, ఒక కదం తొక్కుతున్న గుర్రం, ఒక ఎద్దు మరియు, ఒక సింహం, వాటి మధ్యలో చక్రాలు, ఒక ఘంటాకారపు పద్మం మీదనిలచి ఉంటాయి. ఒకే ఒక్క నున్నగా చేయబడిన ఇటుకరాయి మీద యివన్నీ చెక్కబడి స్తంభాగ్రం, ధర్మచక్రంతో శిఖరంగా నిలబడి ఉంటుంది. రాష్ట్ర చిహ్నంలో 1950 జనవరి 26న భారతదేశపు ప్రభుత్వం స్వీకరించిన ప్రకారం, మూడు సింహాలు మాత్రమే కనబడతాయి.నాల్గవ సింహం దృష్టికి అందకుండా ఉంటుంది. చక్రం స్తంభాగ్రాన మధ్యలో కుడివైపు ఒక ఎద్దు, ఎడమ వైపు ఒక గుర్రంతో ఉబ్బెత్తు శిల్పంగా చెక్కబడినవి ఉండి, మిగిలిన చక్రాలు కుడివైపు, ఎడమ వైపు చివరలలో రేఖా మాత్రంగా ఉంటాయి. ఘంటాకారపు పద్మం మాత్రం వదిలివేయబడింది. సత్యమేవ జయతే అనే ఉపనిషత్తు నుండి తీసుకున్న పదాలు, వాటి అర్థం నిజమే గెలుస్తుంది. అన్నవి స్తంభాగ్రం క్రింది వైపు దేవనాగరిలిపి లో వ్రాయబడి ఉన్నాయి.


