జాతీయ గేయం
వందేమాతరం అను గేయాన్ని సంస్కృతంలో బకించంద్ర ఛటర్జీ రచించారు. ఈ గేయం, స్వాతంత్ర సమర కాలంలో ప్రజలకు ప్రేరణ శక్తిగా నిలిచింది. ఈ గేయం, జన-గణ- మన జాతీయ గీతంతో సమానమైన హాదా కలిగి ఉంది. రాజకీయంగా ఈ గేయం మొదటిసారిగా, భారత జాతీయ కాంగ్రెస్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) 1896 నాటి సమావేశంలో పాడబడింది. దిగువ వ్రాసినది గేయం యొక్క మొదటి నాలుగు పంక్తుల పాఠం
వందేమాతరం! సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం, సస్యశ్యామాలాం మాతరం! వందేమాతరం! శుభ్రజ్యోత్స్నా, పులకిత యామినిమ్ ఫుల్లకు సుమితా ద్రుమదళ శోభినిమ్ సుహాసీనిమ్ సుమధుర భాషిణీమ్ సుఖదాం వరదాం మాతరం
శ్రీ అరబిందో వ్రాసిన గద్యభాగం 1 లో నుంచి ఆంగ్లంలో ఈ పంక్తుల అనువాదం తీసుకొనబడింది.


