జాతీయ కేలండర్
జాతీయ కేలండర్ శక, శకం మీద ఆధారపడి తయారుచేయబడింది. చైత్రం మొదటి నెలగా, 365 రోజులు ఒక సామాన్య సంవత్సరంగా పరిగణించి 22 మార్చి 1957 లో తయారుచేయబడింది. దీనితో పాటు గ్రిగోరియన్ కేలండర్ కూడ క్రింద పేర్కొనబడిన ప్రభుత్వ అవసరాల కోసం వినియోగిస్తారు.
- ఇండియా గజిట్ ( భారత ప్రభుత్వ పత్రిక)
- అఖిల భారత రేడియో ప్రసార కేంద్రాల నుండి వచ్చే వార్తలు
- భారతదేశ ప్రభుత్వం విడుదల చేసిన కేలండర్లు మరియు
- ప్రభుత్వం ప్రజలను ద్దేశించి చేసే ప్రసంగాలు
జాతీయ కేలండర్ లోని తేదీలు, గ్రిగోరియన్ కేలండర్ లోని తారీకులకు శాశ్వశంగా అనుగుణంగా ఉంటాయి. ఉదాహరణకు, సాధారణంగా 1 చైత్రం 22 మార్చిన మొదలవడం, లీపు సంవత్సరంలో 21 మార్చిన రావడం.


