|
1971 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అవడం; భారత-పాక్
యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పడడం
1972 సిమ్లా ఒప్పందం; సి.రాజగోపాలాచారి మరణం
1973 మైసూర్ రాష్ట్రాన్ని కర్ణాటకగా తిరిగి నామకరణం
చేయడం
1974 భారతదేశం పరమాణు పరికరాన్ని పేల్చింది;
ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఐదవ భారత రాష్ట్రపతిగా ఎన్నికవడం, సిక్కిం భారతదేశ
సహ రాష్ట్రమవ్వడం
1975 భారతదేశం ‘ఆర్యభట్ట’ని పంపింది; సిక్కిం భారత
యూనియన్ 22వ రాష్ట్రం అయ్యింది; అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది
1976 భారతదేశం మరియు చైనా దౌత్య సంబంధాల స్థాపన
1977 ఆరవ సాధారణ ఎన్నికలు; లోక్ సభలో జనతా పార్టీకి
మెజారిటీ పొందింది; నీలం సంజీవ రెడ్డి ఆరవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు
1979 మొరార్జీ దేశాయి ప్రధాన మంత్రిగా రాజీనామా
చేసారు, చరణ్ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు; చరణ్ సింగ్ (20వ తేదీ ఆగస్టున)
రాజీనామా చేసారు, ఆరవ లోక్ సభని చాలించారు
1980 ఏడవ సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ ఐ
వచ్చింది; శ్రీమతి ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు;
విమాన ప్రమాదంలో సంజయ్ గాంధి మరణించారు, భారతదేశం ఎస్ ఎల్ వి – 3 ని
రోహిణి సేటెలైట్ తోపాటు అంతరిక్షంలోకి పంపింది
1982 ఆసియాలోనే అతి పొడవైన బ్రిడ్జిని (మార్చి 2వ
తేదీన) ప్రారంభంచారు; ఆచార్య జె. బి. క్రిపలాని (మార్చి 19వ తేదీన)
మరణించారు, ఇన్సాట్ – 1ఎ ని పంపారు; జ్ఞాని జెయిల్ సింగ్ భారత
రాష్ట్రపతిగా (జూలై 15వ తేదీన) ఎన్నికయ్యారు, గుజరాత్ తుఫాన్లో ( నవంబరు
5న) 500 కన్నా ఎక్కువమంది మరణించారు; ఆచార్య వినోభా ( నవంబరు 15న)
మరణించారు; తొమ్మిదవ ఆసియా ఆటల పోటీలు ( నవంబరు 19న) ప్రారంభించారు
1983 కొత్త ఢిల్లీలో సి ఎచ్ ఒ జి ఎమ్
నిర్వహించబడింది
1984 పంజాబ్ లో ఆపరేషన్ బ్లూ స్టార్; రాకేష్
అంతరిక్షంలోకి వెళ్ళారు; శ్రీమతి ఇందిరా గాంధి హత్యగావిచబడింది; రాజీవ్
గాంధి ప్రధాన మంత్రి అయ్యారు
1985 రాజీవ్ – లోంగోవాల్ ఒప్పందం సంతకం చేసారు;
పంజాబ్ ఎన్నికలలో సంత్ హెచ్.ఎస్. లోంగోవాల్ ని చంపివేశారు; అస్సాం
ఒప్పందం; ఏడవ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభించారు
1986 మిజోరం ఒప్పందం.
1987 ఆర్. వెంకటరాఘవన్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు;
శంకర్ దయాళ్ శర్మ భారత ఉప - రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు; బోఫోర్స్ తుపాకి
మరియు ఫెయిర్ పేక్స్ వివాదాలు
1989 అయోధ్య వద్ద రామ శిలల పూజ; భారతదేశ మొదటి ఐ ఆర్
బి ఎమ్, ఒరిస్సా నుండి ‘అగ్ని’ ని విజయవంతంగా (మే 22 తేదీన) ప్రయోగించారు;
త్రిశూల్ క్షిపణి (జూన్ 5 వ తేదీన) పరీక్షించారు; పృథ్వి రెండవసారి
విజయవంతంగా (సెప్టెంబరు 27 తేదీన) ప్రయోగించారు; రాజీవ్ ప్రభుత్వం
ఎన్నికలలో ఓడిపోయింది మరియు రాజీవ్ (నవంబరు 29 తేదీన)రాజీనామా చేసారు;
జవాహర్ రోజ్ గార్ పథకం (నవంబరు 29 తేదీన) ప్రారంభించారు; నేషనల్ ఫ్రంట్
నాయకుడు వి.పి. సింగ్ ఏడవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసారు, (డిసెంబరు2
తేదీన) కొత్త కేబినెట్ మంత్రుల ప్రమాణము, తొమ్మిదవ లోక్ సభ
నియమించబడింది
1990 (మార్చి 25 తేదీన) చివరి భారతదేశ శాంతి భద్రతలను
కాపాడే దళం (ఐ పి కె ఎఫ్) తిరిగి రావడం; ఇండియన్ ఎయిర్ లైన్స్ ఏ-320 ఎయిర్
బస్ దుర్ఘటన (ఫిబ్రవరి 14 తేదీన); జనతా దళ్ విడిపోయింది; ప్రభుత్వానికి
బిజెపి మద్దతు విరమించుకుంది; అద్వానీ రధ యాత్ర చేసినందుకు పట్టుకున్నారు,
మండల్ నివేదిక అమలు చేసినట్లు వి.పి. సింగ్ ప్రకటించారు; రామ
జన్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం వలన అయోధ్య లో జరిగిన హింసాకాండ
1991 (జనవరి, 17 తేదీన) గల్ఫ్ యుద్ధం ప్రారంభం; (మే
21వ తేదీన)రాజీవ్ గాంధీని హత్య చేయబడటం; పదవ లోక్ సభ (జూన్ 20వ తేదీన)
నియమించబడింది; పి.వి. నరసంహరావు ప్రధాన మంత్రి అయ్యారు.
1992 (జనవరి 29వ తేదీన)భారతదేశం పూర్తి దౌత్య
సంబంధాలు ఇజ్రాయిల్ తో స్థాపించుకుంది; (ఏప్రిల్, 23వ తేదీన)భారతరత్న
మరియు ఆస్కార్ విజేత సత్యజిత్ రే మరణం; (జులై 25 తేదీన)ఎస్.డి.శర్మ
రాష్ట్రప్రతిగా ఎన్నికయ్యారు; ఫిబ్రవరి 7న తేదీన మొదట స్వదేశీయంగా
నిర్మించిన ఐ ఎన్ ఎస్ శక్తి సబ్ మెరీన్ పంపారు.
1993 (జనవరి 7వ తేదీన) అయోధ్యలో 67.33 ఎకరాలు
పొందడానికి ఆర్డినెన్స్; బిజెపి ర్యాలీలో, పెద్దమొత్తంలో సురక్ష విఫలం;
బొంబాయిలో వరుస బాంబుల వలన 300 మంది చనిపోయారు; ఇన్సాట్-2బి పూర్తిగా
ఆపరేషన్ లోకి వచ్చింది; మహారాష్ట్రంలో భూకంపం.
1994 పౌర విమాన సేవల మీద ప్రభుత్వం యొక్క మోనోపొలి
ముగిసింది. ధరలు మరియు వ్యాపారం మీద సాధారణ (జి ఏ టి టి) ఒప్పందం మీద
దుమారం, ప్లేగు వ్యాధి ప్రారంభం, మీద విశ్వ సుందరి సుష్మితా సేన్, ప్రపంచ
సుందరి ఐశ్వర్య రాయ్ అయ్యారు.
1995 మాయావతి ఉత్తరప్రదేశ్ కి మొదటి హరిజన
ముఖ్యమంత్రి; గుజరాత్ మరియు మహారాష్ట్రలలో బిజెపి కర్ణాటకలో జనతాదళ్ మరియు
ఒరిస్సాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయి;ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (టి)
ఏర్పాటు, మాయావతి దిగిపోయేక ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి పరిపాలన; ఇన్సాట్
2సి మరియు ఐ ఆర్ ఎస్ ఐ- సి పంపారు.
1996 అనేక కేంద్ర మంత్రులు మరియు ప్రతిపక్ష నాయుకులు
హవాలాలో దెబ్బ తిన్నారు; మార్చ్21 తేదీన ఐ ఆర్ ఎస్ పి తో పి ఎస్ ఎల్ వి డి
3 ని అంతరిక్షంలోకి పంపి, భారత దేశ అంతరిక్ష కార్యక్రమాలలో కొత్త యుగంలోకి
అడుగు పెట్టారు ప్రవేశపెట్టుడం; ఏప్రిల్ 12వ తేదీన పదకొండవ లోక్ సభ
ఎన్నికలు జరిగాయి, బిజెపి ఒక అతి పెద్ద పార్టీగా వెలువరించింది
1997 ఆగస్టు 15వ తేదీన, భారతదేశం తన 50వ స్వతంత్రం
సంవత్సరం జరుపుకుంది.
1998 మదర్ తెరిసా మరణం; వాజ్ పాయి ప్రధాన మంత్రి
అయ్యారు; భారతదేశం తన రెండవ పరమాణు పరికరాన్ని (పోక్రాన్ II)
పేల్చింది.
1999 ఇండియా ఎయిర్ లైన్స్ ఐసి – 814 విమానం
తీవ్రవాదులచేత హైజాక్ చేయబడి, డిసెంబర్ 24న, 1999 న కాందహార్ ,
ఆఫ్ఘానిస్తాన్ కి తీసుకుని వెళ్ళారు. బంధీలుగా ఉంచిన ప్రయాణికుల స్వేచ్ఛ
కొరకు భారత ప్రభుత్వం ముగ్గురు తీవ్రవాదులను విడిచిపెట్టారు. జూన్ 1999లో,
పట్టుకొనబడిన లెఫ్టినెంట్ కె. నచికేత, భారతదేశపు పైలట్ , బందించి ఉంచిన
ఎనిమిది రోజుల తరువాత పాకిస్తాన్ విడిచి పెట్టింది. జమ్మూ & కాశ్మీర్
లోని కార్గిల్ సెక్టరులో చొరబడిన పాకిస్తాన్లను పంపివేయడానికి భారత సేన
ఆపరేషన్ విజయ్ ని ప్రారంభించింది. భారతదేశం విజయం సాధించింది.
2000 మార్చ్ 2000 లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంటు
భారతదేశానికి సందర్శించారు. మూడు కొత్త రాష్ట్రాలు ఛత్తీస్ గఢ్,
ఉత్తారాంచల్, జార్ఖండ్ ఏర్పాటయ్యాయి. భారత దేశం జనాభా ఒక బిలియన్ ని
మించింది
2001 జులై 2001 లో భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య
‘ఆగ్ర శిఖరాగ్ర సమావేశం’; భారతదేశంలో ఘోరమైన ప్రకృతిసిద్ధమైన ఆపద, జనవరి
2001 లో గుజరాత్ భూకంపం; మార్చ్ 2001లో ఆయుధాల చీకటి వ్యాపారం మరియు భారత
ఆర్మీ ఆఫీసర్లకు, మంత్రులకు, మరియు రాజకీయవేత్తలకు ముడుపులు గురించి
తెలిపే వీడియో టేపులను తెహల్కా.కామ్ చిత్రీకరణ (screening) చేసింది;
మార్చి 2001 న నాలుగవ భారత దేశపు జనాభా లెక్కలు (స్వతంత్రం నుండి)
ముగిసాయి; ఆగస్టు 2001లో ఎన్రాన్ భారతదేశ శక్తి వర్గానికి వీడ్కోలు
చెప్పింది; ఏప్రిల్ 2001న జి ఎస్ ఎల్ వి ని విజయవంతంగా పంపించారు మరియు
అక్టోబరు 2001న పి ఎస్ ఎల్ సి - సి3 ని పంపడానికి నిర్వహణ చేసారు.
2002 71-సంవత్సరాల వయస్సుగల క్షిపణి శాస్త్రవేత్త,
అవుల్ పకీర్ జైనుల్బదీన్ అబ్దుల్ కలామ్, భారత దేశ రాష్ట్రపతిగా
ఎన్నికయ్యారు; ఇటీవల చరిత్రలో అతి భయంకరమైన కులాల దాడులలో ఒకటి, గోద్ర
సంఘటన; 2002 ఫిబ్రవరి 27వ తేదీన,గుజరాత్ లో జరిగింది; కావలసినంత మరియు
నిరంతరం ఉండేలా వాడడానికి నీటి వనరుల వికాసం మరియు యాజమాన్యం సమన్వయ
పరిచేలా లక్ష్యంగా పెట్టే, జాతీయ నీటి పోలసీని ఏప్రిల్ లో
ప్రకటించారు.
2003 ఇండియాలో స్ట్రేటెజిక్ కమాండ్ దళాలు (ఎస్ ఎఫ్
సి) మరియు పరమాణు కమాండ్ ఆథారిటీ (ఎన్ సి ఏ) ఏర్పాటు; ఎస్ ఎఫ్ సి కి మొదటి
ముఖ్య కమాండర్ గా ఎయిర్ మార్షల్ తేజా మోహన్ ఆస్తానాని నియమించారు;
అభివృద్ధి చేసిన వివిధ ఉపయోగాలు కలిగిన సేటెలైట్, ఇన్సాట్ – 3ఏ ని ఫ్రెంచ్
గయానా లోని కొరో నుండి విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు; జూన్ లో వైట్
కాలర్ నేరాలని నిరోధించడానికి, సిబిఐ ఒక అర్ధశాస్త్ర నేరపరిశోధన విభాగం (
economic intelligence wing ) ని ఏర్పరిచింది; డిసెంబరులో ఫ్రెంచ్ గయానా
లోని కొరో స్పేస్ పోర్ట్ నుండి ఒక యూరోపియన్ రాకెట్ ద్వారా ఇండియా
అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ సేటెలైట్ ఇన్సాట్ – 3ఇ ని పంపారు.
2004 సాధారణ ఎన్నికలో కాంగ్రెస్ మరియు దాని
మిత్రమండలాలు, ఎన్ డి ఏ ప్రభుత్వాన్ని తీసివేశాయి; కాంగ్రెస్ అధినేత
శ్రీమతి సోనియా గాంధి బలమైన స్థానములో ఉన్నప్పటికి భారతదేశ ప్రధానమంత్రి
అవడానికి నిరాకరించారు; కాంగ్రెస్ మరియు దాని మిత్రమండలాలు, ప్రధాన మంత్రి
డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్వర్యంలో, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేసాయి.
|