ప్రాథమిక విద్య

వ్యక్తి ప్రగతికే కాదు, మొత్తం జాతి నిర్మాణానికి , పురోగతికి కూడా ప్రాథమిక విద్య పునాది వంటిది. ప్రాథమిక విద్యను నేర్చుకునే పిల్లలను మరింతమందిని చేర్చుకోవడంలో, వారు మధ్యలో మానకుండా కొనసాగేలా చూడడంలో, హాజరు శాతాన్ని మెరుగుపరచడంలో, దేశ జనాభాలో దాదాపుగా మూడింట రెండువంతులమందికి అక్షరాస్యతను విస్తరించడంలో ఇటీవలి సంవత్సరాలలో ఇండియా ఎంతో ప్రగతి సాధించింది. ఇండియా ఆర్ధిక ప్రగతికి ఒక ప్రధాన సాధనంగా మనదేశంలో విద్యా వ్యవస్థ మెరుగుదలను తరచు ప్రస్తావించడంకూడా జరుగుతున్నది. అయితే, అదేసమయంలో, మనదేశంలో ప్రాథమిక విద్య నాణ్యతాపరంగా ఇంకా ఆందోళన కలిగిస్తూనేవున్నది.

More

ఇండియాలో, 14 ఏళ్ళ వయస్సు వరకు బాలలందరికి ఉచిత నిర్బంధ విద్య కల్పిస్తామన్నది రాజ్యాంగ పరమైన హామీ. 6-14 ఏళ్ళ వయసు పిల్లలందరికి, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ భారత పార్లమెంటు ఇటీవలే విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించింది కూడా. అన్ని పల్లెలు, వాడలలో విద్యా వసతులు కల్పించడం, ప్రాథమిక విద్య నేర్చుకునే వయసున్న బాలబాలికలను నూటికి నూరు శాతం పాఠశాలలలో చేర్చుకోవడం, అందరూ కొనసాగేలా చూడడం అనే సార్వత్రిక ప్రాథమిక విద్యా లక్ష్యం (అందరికి ప్రాథమిక విద్య….యు ఇ ఇ) ఇంకా ఊరిస్తూనే వున్నది. ఈ అంతరాన్ని పూరించడంకోసమే , ప్రభుత్వం 2001 లో సర్వశిక్ష అభియాన్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రపంచంలోనే మిక్కిలి విస్తృతమైన కార్యక్రమాలలో ఇది ఒకటి.

ఈ సమాచార సాంకేతిక యుగంలో , విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో, వున్నవారికి-లేనివారికి మధ్య గల అంతరాన్ని తొలగించడానికి, ఐ సి టి ప్రశంసనీయమైన పాత్ర నిర్వహిస్తున్నది. ఇండియా డెవలప్‌మెంట్ గేట్‌వే అందిస్తున్న ప్రాథమిక విద్యా సమగ్ర సమాచార దర్శిని (వెర్టికల్), ఇండియాలో సార్వత్రిక ప్రాథమిక విద్య అనే లక్ష్యాన్ని సాధించడంలో, ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు అవసరమైన అన్ని సాధన సంపత్తులను సమకూర్చి, సాధికారత కల్పించే ఒక ప్రయత్నం.


thinimage
thinimage

thinimage

Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: