సున్నితమైన విషయాలపై సమాచార అవసరాలను తీరుస్తూ

ఒక యుక్త వయసులో ఉన్న అమ్మయికి తల్లిగా ..................

ఒక యుక్త వయసులో ఉన్న అమ్మయికి  తల్లిగా, తాను ఆ వయసు లో ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి తెలియచెప్పాలని అనుకొనేదానిని, కానీ ఒక మారు మూల గ్రామం లో ఉంటూ ఈ విషయాలను గురించి సమాచారం అడిగి తెలుసుకోవడం చాలా ఇబ్బందికరంగా  ఉండేది.
ఒక రోజున అశ్వినీ సెంటర్ (గ్రామ సమాచార కేంద్రం) లోని అపరేటర్ ద్వారా , ఇన్ డీజీ అనే వెబ్ పోర్టల్ గురంచి తెలిసింది. ఈ పొర్టల్ లో యుక్త వయసులో ఉన్న అమ్మాయిల ఆరోగ్య అవసరాలను గురించి ప్రత్యేకంగా సమాచారం ఇవ్వబడినది. నాకు ఈ పోర్టల్ లో  స్త్రీలు మరియు  యుక్త వయసు అమ్మాయులను గూర్చిన  సమాచారం చాలా చక్కగా అమర్చి పొందుపరిచినట్టు తోచింది.
గ్రామాలలో మాకు యుక్తవయసు లో ఉన్న అమ్మాయుల ఆరోగ్య విషయం లో ఎటువంటి  జాగ్రత్తలు తీసుకోవాలో అన్నవిషయం పై  సరైన అవగాహన తక్కువ, వ్యక్తిగత శుభ్రతకు సరైన ప్రాముఖ్యం ఇవ్వడం జరగదు.  ఈ పోర్టల్ లోని సమాచారం చదివిన తరువాత నాకు ఎన్నో విషయాలు తెలిసాయి, కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే    అపాయకరమైన ఎన్నో వ్యాధలను అడ్డుకోగలమన్న విషయం తెలుసుకొన్నాను.  నాలాంటి గ్రామ ప్రజలకు ఈ వెబ్ సైట్ ఎంతో ఉపయోగకరమైనది.

జయ, రామేశ్వరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్


Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: