సమాచారం సులభంగా అంది పుచ్చుకునేందుకు సామర్ధ్యాలను పెంపొందించడం

నేను పొనమండ గ్రామం లో అశ్వినీ సెంటర్ ఆపరేటర్ గా ...............

నేను పొనమండ గ్రామం లో అశ్వినీ సెంటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాను. నేను, చాలా మంది  అనేక రకాలైన వెబ్ సైట్లను రూపొందించదడం  చూసేదాన్ని. నేనూ మా గ్రామ ప్రజల కోసం తెలుగు లో ఒక వెబ్ సైట్ ను రూపొందించాలని అనుకొన్నాను, అయితే నాకు తెలుగు భాషను కంప్యుటర్స్ లో ఎలా వాడాలో తెలిసేదికాదు.

అప్పుడు అశ్వినీ సెంటర్ ఆపరేటర్ల కోసం,  భారత ప్రగతిద్వారం వారు (ఇన్ డీజి) ఒక కార్యక్రమాన్ని చేపట్టారు, అందులో వారు మాకు కంప్యుటర్లలో తెలుగు భాషను ఎలా వాడాకోవచ్చో , ఎలా టైపు చేయవచ్చో  నేర్పించారు .

అలా కంప్యుటర్లలో తెలుగు భాషను వాడడం నేర్చుకున్నతరువాత, మా ఊరు గురించి తెలుగు లో ఒక బ్లాగ్ స్పాట్ ను తయారు చేసాను. మెదట్లో ఈ పని చేపట్టినప్పుడు నేను చాలా సంసయించినా, రాను రాను నాకు ఇందిలో చాలా ఆశక్తి పెరిగింది. ఈ బ్లాగ్ స్పాట్ లో నేను మా ఊరి గురించి ఎన్నో విషయాలను పొందు పరిచాను.  ఇందులో నేను భారత ప్రగతిద్వారం (ఇన్ డీజి) వారి పెబ్ సైట్ కు లింక్ కూడా అందచేసాను.
మరిన్ని విషయాల ను గురించి తెలుసుకునేందుకు http://ponnamandagram.blogspot.com/ ను సందర్శించండి.

ఈ క్రొత్త నైపుణ్యం నేర్చుకునేందుకు సహకరించి తోడ్పడిన భారత ప్రగతిద్వారం (ఇన్ డీజి) వారికి  నా హృదయ పూర్వక  కృతజ్ఞతలు.   

సత్యలత , పొనమండ గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్


Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: