లాభదాయకమైన ఉపాధికి దొహదపడే నైపుణ్యం
నా పేరు పైల సన్యాసిరావు. నా వయస్సు 24 ఏళ్ళు , మా ఊరు కేశవరం. నేను ఒక రైతుకూలి కుటుంబం లో పుట్టాను. బి.కామ్ డిగ్రీ తో నేను నా చదువును, ఆర్ధిక ఇబ్బందుల పరిస్థితుల వలన ఆపివేయవలసి వచ్చింది. ప్రస్తుతం నేను బైర్రాజు పౌంఢేషన్ వారి నిర్విహిస్తున్నా అశ్వినీ సెంటర్ లో పనిచేస్తున్నాను
ఇన్ డీజి – భారత ప్రగతి ద్వారం సభ్యులు అశ్వినీ సెంటర్ ఆపరేటర్ల కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ద్వారా, మేము కంప్యుటర్లలో ప్రాంతీయ భాషల వాడుక గురించి నేర్చుకున్నాము. ఇదే కార్యక్రమం లో www.indg.in పోర్టల్ గురించి తెలుసుకున్నాము. ఆ తరువాత నుండి శిక్షణ లో క్రొత్తగా నేర్చుకున్న ప్రజ్ఞ నైపుణ్యాల వల్ల, తెలుగులో డీటిపి పనులు చేయడం ఆరంభించాను. ఇప్పుడు నేను మరికొన్ని సంస్ధలను కూడా చేరగలుగుతున్నాను. ప్రస్తుతం నేను నెలకు రూ. 1000/- దాకా సంపాదించగలుగుతున్నాను. ఏ అదనపు ఖర్చు లేకుండా మా ఊరిలోనే ఉంటూ అదనపు ఆదాయం సంపాదించుగోగలుతున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది.
ఇన్ డీజి – భారత ప్రగతి ద్వారం వారి చొరవతో మాకు వ్యవసాయం, ప్రాధమిక విద్య, ఆరోగ్యం,ఇంధన వనరులు, ఇ-పాలన వంటి రంగాలలో ప్రయొజకరమైన సమాచారం అందటమే కాకుండా, అదనపు ఉపాధి ఆదాయం కోసం ఉపయొగపడే ప్రజ్ఞ నైపుణ్యాలను కూడా కూడగట్టుకోగలుగుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది.










