మెరుగైన సేవలు అందించేందుకు ప్రజలకు సహకారం

నేను 4 ఏళ్ళ నుంచి సెకిపట్టి గ్రామం లో థాగవలగమ్ ........................

నేను 4 ఏళ్ళ నుంచి సెకిపట్టి గ్రామం లో థాగవలగమ్ (గ్రామ సమాచార కేంద్రం) లో అపరేటర్ గా  పనిచేస్తున్నాను.  నేను 10వ తరగతి పూర్తిచేసాను. నాకు మా గ్రామ ప్రజలకు సహాయ పడుతూ సేవలు అందిచాలంటే ఎంతో ఇష్టం, అందువలన నేను ఈ రంగంలో పనిచేస్తున్నాను. నాకు మా గ్రామ ప్రజలలో ఎన్నో రకాలైన విషయాల పై చైతన్యం తేవలని ఆశ. కానీ అది అవసరమైన సమాచారం స్వభాష-తమిళంలో లేకపోతే సాధ్యంకాదు.

ధాన్ ఫౌండేషన్ మరియు  ఇన్ డీజీ టీమ్ సభ్యులు మాకు www.indg.in  పోర్టల్ ను ఉపయొగించేందుకు శిక్షణను ఇచ్చారు. ఇందులో ఉన్న సమాచారం తమిళం లో ఉండటం చూసి నాకు చాలా సంతోషం కలిగింది.

శిక్షణ పూర్తియన తరువాత, నేను మా గ్రామ ప్రజలను మా కేంద్రానికి తీసుకువచ్చి ఈ వెబ్ సైట్ ను చూపించి,  అందులో    స్త్రీలు మరియు వ్యవసాయదారులు తెలుసుకోవలసిన ఎన్నో ఉపయొగకరమైన విషయాలను తెలియజెప్పాను.

ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారాన్ని వినియొగించడమే కాకుండా , ఇందులో మనము కూడా సమాచారాన్ని పొందుపరచవచ్చునన్న విషయాన్ని తెలుసుకుని, మా గ్రామానికి సంబంధించిన ప్రాంతీయ సమాచారాన్ని సేకరించి  ఈ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడం మెదలుపెట్టాను . నేను అప్ లోడ్ చేసిన సమాచారాన్ని ఈ వెబ్ సైట్ లో ఉండటం చూసి, నాకు ఎంతో ఆనందం కలిగి, మరిన్ని విషయాలను గూర్చి సమాచారాన్ని అందించాలన్న ప్రోత్సాహం కలిగింది.

ఈ సంవత్సరం జరిగిన స్త్రీల దినోత్సవ వేడుకలలో, నేను అందించిన సేవలను గుర్తించి మెచ్చుకోవడం జరిగింది. ఇది నాకు ఎంతో ఆనందాన్ని అందించింది.

థిలగవథి, సెకిపట్టి గ్రామం, మెలుర్ బ్లాక్, మధరై తమిళనాడు


Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: