పెద్ద సమస్యకు సాధారణమైన చికిత్స

మా బామ్మకు షుగర్ వ్యాధి ఉంది, డాక్టర్ ను సంప్రదించి ...............

మా బామ్మకు షుగర్ వ్యాధి ఉంది, డాక్టర్ ను సంప్రదించి మందులు వాడాము, కానీ దాని వల్ల ఆవిడకు అలర్జీ వచ్చింది.
అశ్వినీ సెంటర్ (గ్రామ సమాచార కేంద్రం) లో నేను  కంప్యూటర్స్ నేర్చుకోవడానికి వెళ్ళే దానిని, అక్కడ నాతో కలిపి కొంత మంది ఆడవాళ్ళకు ఇన్ డీజి పోర్టల్ ను గురించి  చెప్పారు.  అప్పుడు నేను  అందులోని ఆరోగ్య సంబంధిత విషయాలు గుంరించి తెలుసుకొని, మెంతులు వాడటం వల్ల షుగర్ వ్యాధిని అదుపు చేసుకోవచ్చ ని తెలుసుకొన్నాను. వెంటనే మా అవ్వకు, మెంతులను పొడి చేసి రోజు తీసుకోమని చెప్పాను.  ఈ చిట్కా మా అవ్వకు బాగా పనిచేసింది, ఆవిడ షుగర్ వ్యాధి అదుపులోకి వచ్చింది.

ఇటువంటి ప్రయెజనకరమైన సమాచారాన్ని అందిస్తున్న ఇన్ డీజి పోర్టల్ కు నా కృతజ్ఞతలు. ఇన్ డీజి పోర్టల్ ఇటువంటి మరిన్ని ఉపయొగకరకైన విషయాలను గూర్చి సమాచారాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను.

లక్ష్మీ, పొడగట్లపల్లి  గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్


Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: