ఒక తల్లి సమాచార అవసరాన్ని తీరుస్తూ

మా పాప వయసు 1 ½ సంవత్సరాలు, ఒక తల్లిగా ................

మా పాప వయసు 1 ½ సంవత్సరాలు, ఒక తల్లిగా మా పాప ఎదుగుదల సరిగా ఉందా లేదా అనే చింత, నన్ను ఎప్పుడూ వేధిస్తూ ఉండేది. ఒక ఆరోగ్యకార్యకర్త  మాత్రమే నాకీ సమాచారాన్ని అందించగలరన్న భావన ఉండేది నాకు. ఐతే ఒక గ్రామం లో ఉంటూ ఆరోగ్య కార్యకర్తల నుండి ఎప్పుడు పడితే అప్పుడు సలహాలు అడిగి తెలుసుకోవడం అనేది సులభమైన పని కాదు.
అశ్వినీ సెంటర్ (గ్రామ సమాచార కేంద్రం) లో నేను  కంప్యూటర్స్ నేర్చుకోవడానికి వెళ్ళేదానిని. అక్కడ నాకు ఇన్ డీజి పోర్టల్ గురించి తెలిసింది. ఈ పోర్టల్ నాకు ఎంతో ఉపయొగ కరమైనదిగా అనిపించింది. తెలుగు భాషలో ఇన్ని చక్కటి విషయాలు అందించే పోర్టల్ ను చూడటం నాకు అదే మెదటిసారి. వెంటనే నేను అశ్వినీ సెంటర్ ఆపరేటర్ ను ‘ఇందులో మా పాప ఎదుగుదల గురించిన సమాచారం తెలుసుకోవచ్చునా ’  అని అడిగాను, అప్పుడు తను నాకు ఇందులోని ‘ పిల్లల ఆరోగ్యం’ అనే అంశం చూపింది.  దీనిలో  నేను పిల్లల ఎదుగుదల వారి వయసుకు తగ్గట్టుగా ఉండవలసిని ఎత్తు బరువు చూపబడి ఉండటం చూసి, ఎంతో సంతోషపడ్డాను.  ఇప్పుడు మా పాప ఎదుగుదలను నేను స్వయంగా పర్యవేక్షించవచ్చు.  అంతే కాకుండా మా పాపకు ఎటువంటి పౌష్టికాహారం ఇవ్వాలో అన్న విషయం కూడా ఇందులో నుంచి చూసి తెలుసుకున్నాను.

www.indg.in వెబ్ పోర్టల్  సహకారం తో  నేను నా బిడ్డ ఆరోగ్యం  సరైన పధ్ధతిలో చూసుకోగల  తెలివైన తల్లిగా మారాను.

సుభాషిని, పొన్నమండ గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్


Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: