స్త్రీ ఆరోగ్య సమస్యలు – వధ్యత్వము / సంతాన ప్రాప్తి లేకుండుట.

1. వంధ్యత్వము అనగా నేమి ?

వంధ్యత్వము అనేది జననేంద్రియ వ్యవస్ధకు వచ్చే వ్యాధి దీనివల్ల మానవ శరీరము యొక్క ముఖ్యమైన కార్యమైన గర్భధారణ బలహీనపడుతుంది.

గర్భధారణ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ  మరియు ఇది చాలా అంశాలపై ఆధారపడి వుంటుంది. ఇది పురుషుని ఉత్పత్తి చేయబడిన ఆరోగ్యమైన శుక్రకణము (బీజకణము) మరియు స్త్రీ చే ఉత్పత్తి చేయబడు ఆరోగ్యకారమైన అండము పై ఆధారపడి ఉంటుంది. శుక్రకణము అండమును చేరుటకు అండనాళములు (గర్భాశయానికి ఇరువైపులా వుండే నాళములు) తెరుచుకుని వుండాలి. శుక్రకణము అండమును కలిసినప్పుడు దానిని ఫలదీకరించే యోగ్యత కలిగి వుండాలి. ఫలదీకరణం చెందిన అండము స్త్రీ యొక్క గర్భాశయంలో నాటుకొనగలుగుట ఫలదీకరణం చెందిన అండము నాణ్యత కలిగి వుండడం పురుషునకు సంభోగ దుర్భలత్వము లేకుండుట తుదిగా గర్భము సంపూర్ణంగా ప్రసూతి వరకూ వృద్ధి చెందడానికి , పిండము ఆరోగ్యంగా వుండాలి. మరియు స్త్రీ యొక్క జననేంద్రియ హార్మానులు  పిండము అభివృద్ధి చెందడానికి సరిపడే వాతావరణాన్ని కల్పించడానికి సరిపడా వుండాలి. వీటిలో ఏ ఒక్క అంశంలో నైనా లోపాలు వున్నట్టయితే వంధ్యత్వము కలుగవచ్చును.



2. వంధ్యత్వము కలుగడానికి కారణాలు ఏవి ?

పురుషులలో వంధ్యత్వానికి కారణం శుక్రకణాలు అంత తక్కువగా లేక పూర్తిగా ఉత్పత్తి కాక పోవడమే. కొన్ని సందర్భాలలో శుక్రకణాలు వైకల్యంతో ఉంటాయి. ఇవి అండాన్ని చేరేలోపే మృతి పొందుతాయి. స్త్రీలలో వంధ్యత్వానికి ముఖ్య కారణం అండోత్పత్తి కి సంబంధించిన సమస్యలు.

ఇతరకారణాలు అండాశయ నాళీలు ఇతర కారణాల వలన మూసుకొని పోవడం. పుట్టుకతో వచ్చే గర్భసంచి నిర్మాణ లోపాలు గర్భ సంచికి వచ్చే గడ్డలు,  పదేపదే కలిగే గర్భస్రావాలు.



3. విట్రో ఫలధీకరణం లేదా టెస్ట్ ట్యుబ్ ద్వారా పిల్లలు పుట్టడం అంటే ఎమిటి ?

జ. స్త్రీ గర్భకుహరంలో కాక అండం వేరొక చోట ఫలధీకరణం చెందడాన్ని విట్రో ఫలధీకరణం అంటారు.
ఈ విట్రో ఫలధీకరణం లో శస్త్ర చికిత్స ద్వారా అండాలను అండాశయం నుంచి వేరు చేసి శుక్రకణంతో శరీరం వెలుపల వేరే పాత్రలో కలుపుతారు. 40 గంటల తరువాత, అండము శుక్రకణంతో ఫరదీకరణం విభజన చెందుతూ వుందా లేదా పరీక్షించుతారు. ఈ ఫలదీకరణం చెందిన అండాన్ని యొక్క గర్భకుహరంలో నాటుతారు. దీనిలో అండాశయ నాళాల పాత్ర వుండదు. ఈ పక్రియ ముఖ్యంగా ఏ ఇతర కారణాల వల్లనైనా అండాశయ నాళాలు చెడిపోయినప్పుడు పని చేస్తుంది.






Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: