|
|
గర్భ స్రావము
అందరి స్త్రీలలో, అన్ని గర్భిణీలు తొమ్మిది నెలలు (40 వారలు) నిండే
వరకు వుండి కాన్పు సంభవించదు. కొన్ని సందర్భాలలో గర్భస్రావం దానంతట అదే
జరిగి పోతుంది. దీనినే గర్భస్రావం లేదా ఆకస్మిక గర్భస్రావం అంటారు.
సాధారణంగా గర్భస్రావాలు 26 వారాలకు ముందు అవుతాయి. కొంత మంది మహిళలకు
శస్త్ర చికిత్స ద్వారా గర్భస్రావం చేయబడుతుంది. దీనినే ప్రేరేపించిన
గర్భస్రావం అంటారు.
-
|
నూటికి పది లేక 20 శాతం గర్భిణులు, గర్భస్రావంగా అంత మొందుతాయి. శిశువు
జీవం పొందక మునుపే గర్భస్రావం జరిగిపోతూ వుంటుంది. సాధారణంగా మొదటి 12
వారాలలో గర్భస్రావాలు జరుగుతూ వుంటాయి.
|
|
-
|
సర్వ సాధారణంగా ఫలదీకరింపబడిన అండంలోని లోపాలు గర్భస్రావానికి దారి
తీస్తూఉంటాయి ఒకవేళ ఇట్టి లోప భూహిష్టమైన అండాలు అభివృద్ధి చెంది ప్రసవం
వరకు పొడగింపబడి శిశువు జన్మించినచో వారిలో తీవ్రమైన అంగవైకల్యాలు లేక
కొన్ని అంగాలు పూర్తిగా ఏర్పడకపోవడం వంటి సమస్యలు కనబడుతాయి. కావున
గర్భస్రావం అనేది కొన్ని సందర్భాలలో ప్రకృతి ప్రసాదించిన వరం తద్వారా
ఇటువంటి అసాదారణమైన పుట్టుకల అవరోధం గర్భస్రావం ఈ క్రింది కారణాలు వలన
కూడా జరగవచ్చు. గర్భిణీ స్త్రీలకు తీవ్రమైన సుఖవ్యాధులు ఎత్తయిన ప్రదేశం
నుంచి క్రింద పడడం, జననేంద్రియ వ్యవస్థ లో లోపాలు. కొన్ని సందర్భాలలో
ఫలధీకరణ చెందిన అండము గర్భాశయమునకు బదులు గర్భాశయంకు ఇరువైపులా వుండే
నాళాలలో నాటుకోవడం. ఇటువంటి సందర్భంలో కూడా సర్వ సాధారణంగా గర్భస్రావం
జరిగిపోతుంది. మరియు ఇది ప్రమాదకరమైనది.
|
|
-
|
ముఖ్యంగా రెండు సంకేతాలు
- యోని గుండా రక్తస్రావం.
- క్రింది కడుపు లేదా పొత్తి కడుపులో నొప్పి.
ఆ రంధ్రంలో కొద్దిగా వున్న రక్తస్రావం పోనుపోను అధికమవుతూ పెద్ద
గడ్డల్లాగా పడడం మొదలవుతుంది. మొదటి మూడు నెలలలోపు గర్భస్రావం
జరిగినపుడు సంభవించే రక్తస్రావం , పొత్తి కడుపులో నొప్పి వంటి లక్షణాలు,
బహిష్ఠుతను
పోలి వుంటాయి. కాబట్టి గర్భిణి నిర్ధారణ జరగని సందర్భాలలో
గర్భస్రావానికి, బహిష్ఠుకు తేడా తెలుసుకోవడం చాలా కష్టం.
సంపూర్ణ గర్భస్రావం : - ఎప్పుడైతే గర్భస్రావం
లో పిండము లేక భ్రూణము మరియు భ్రూణానికి సంభందిన కణజాలం, మాయ
మొత్తంగా యోని ద్వారా బయల్పడి పోతాయో దానిని సంపూర్ణ
గర్భస్రావం అంటారు. ఇట్టి పరిస్ధితిలో రక్తస్రావం కొద్ది రోజులలో
తగ్గిపోతుంది. రక్తస్రావం తరువాత స్త్రీ కొంతకాలం వరకూ విశ్రాంతి
తీసుకోవాలి. బరువులు ఎత్త కూడదు. మరియు శారీరక
పరిశుభ్రత పాటించాలి. కొంత కాలం సంభోగానికి దూరంగా
ఉండాలి.
అసంపూర్ణ గర్భస్రావం :-
కొన్ని మార్లు పిండంలో కొంత భాగం గర్భాశయంలో ఉండిపోతాయి.
దీనిని అసంపూర్ణ గర్భస్రావం అంటారు. సాధారణంగా ఈ విధంగా
గర్భస్రావం 10 నుండి 12 వారాల మధ్యలో జరిగిన సందర్భం లో జరుగుతుంది.
రక్తస్రావం ఆగకుండా కొంత కొంత అవుతూ వుంటుంది. గర్భాశయంలో వుండి పోయిన
కణజాలం, పిండం యొక్క మిగులు భాగాలు లేక మాయ వీటికి చీము పోసే అవకాశాలు
అధికంగా ఉంటాయి. తద్వారా రోగికి జ్వరం, పొత్తి కడుపులో నొప్పి
వంటి లక్షణాలు కనబడతాయి. ఈ విధంగా అసంపూర్ణ గర్భస్రావం జరిగి
రక్తస్రావం ఆగని పక్షంలో వెంటనే వైద్యులను సంప్రదించి వారి ద్వారా
గర్భసంచి శుభ్రం చేయించుకోవాలి. ఆరోగ్య కార్యకర్త తో గానీ, వైద్యులు తో
గానీ, ఏదైనా ఆసుపత్రిలో కానీ, (వైద్య శాల) లో గానీ చేయించు వచ్చును.
ఈ విధంగా చేయించుకోని పక్షంలో గర్భసంచిలో మిగిలిపోయిన కణజాలం, మాయ,
పిండం అవశేషాలకు చీము పోసి రోగికి జ్వరం కడుపులో నొప్పి, జననేంద్రియాలలో
వస్తాయి. తగు సమయములో చికిత్స చేయనిచో సూక్ష్మజీవుల జననేంద్రియాలను వీడి
పోవు. ఉన్న నాళాలు లోని కణజాలం దెబ్బతిని అవి మూసుకొని పోతాయి. తద్వారా
రోగిలో వంధ్యత్వము లేక సంతానప్రాప్తి లేకుండా పోతుంది. కాబట్టి
స్త్రీలు అసంపూర్ణ గర్భస్రావం తరువాత రక్తస్రావం, జ్వరం , పొత్తి కడుపులో
నొప్పి వంటి సంకేతాలు కనపడితే ఆలస్యం చేయక వెంటవెంటనే వైద్యుని
సంప్రదించాలి.
గర్భస్రావం తరువాత మళ్ళీ గర్భధారణ కోసం ప్రయత్నించే ముందు కొన్ని నెలలు
వేచి ఉండవలసి వుంటుంది. ఈ మధ్యకాలంలో కుటుంబ నియంత్రణ పాటించడం
శ్రేయస్కరం.
పలుమార్లు జరిగే గర్భస్రావం కొందరు స్త్రీలలో
గర్భస్రావం మరల మరల జరుగుతూ వుంటుంది. ఒకటికి రెండు సార్లు తొలి నెలల్లో
గర్భస్రావం జరిగినపుడు వారికి బెంగపడనవసరం లేదని ధైర్యం
చెప్పాలి. రెండవసారి మూడవ సారి కూడా 6 నెలలు దాటాక గర్భస్రావాలు
జరుగుతుంటే స్త్రీ వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
దీనిద్వారా కారణం తెలిసే అవకాశం తద్వారా చికిత్స పొందడం చేయవచ్చును.
ప్రేరేపిత గర్భస్రావం
:- కొన్ని సందర్భాలలో
గర్భస్రావాలు అనన్య ప్రేరేపితమవుతాయి. దీని అర్ధం అవివాటంతట అవే
మొదలవుతాయి. కొన్ని సందర్భాలలో గర్భిణీ స్త్రీలు ఇష్టాను పూర్వంగా
గర్భస్రావం చేయించుకుంటారు. ముఖ్యంగా ఇది మొదట 3 నెలలలోపు చేస్తారు.
దీనిని ప్రేరేపిత గర్భస్రావం అంటారు. గర్భిణి స్త్రీకి నొప్పి
నివారించడానికి, సూది ఇవ్వబడుతుంది. తరువాత పరిశుభ్రమైన వాతావరణంలో సరియైన
క్రిమిరాహిత్యమైన పరికరములతో యోని ద్వారా గర్భసంచిని శుభ్రపరుస్తారు. ఈ
విధంగా శిక్షణపొందిన వ్యక్తి చేసిన యెడల ఈ విధానము అపాయకరముకాదు. దీనికి
15 నిముషములు సమయం పడుతుంది.
గర్భస్రావమునకు అసురక్షితమైన పద్ధతులు వినియోగిస్తే గర్భిణి స్త్రీ
జననేంద్రియ వ్యవస్థలో సూక్ష్మక్రిములతో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొన
వలసి ఉంటుంది. గర్భిణి స్త్రీ ఏ కారణం గానైనా గర్భస్రావం
చేయించుకున్న తరువాత ఈ దిగువ చూపిన లక్షణాలు కనబడితే వెంటనే స్త్రీ వైద్య
నిపుణుల లేక వైద్యుని సంప్రదించాలి.
- జ్వరం
- చలి, వణుకుతో కూడిన జ్వరం
- పొత్తి కడుపులో నొప్పి
- పొత్తి కడుపు తొడ కండరాలు గుంజినట్టువడం
- నడుము నొప్పి
- యోని ద్వారా ఆగని రక్త స్రావం
- అధికంగా, గడ్డలు గడ్డలుగా పోయే రక్త స్రావం.
- యోని గుండా దుర్వాసన కూడిన మైల లేక చీము లేక మైలతో మిళితమైన
తెల్లబట్ట
- ఋతుక్రమం రావడంలో 6 వారాలకంటే అధిక సమయం పట్టడం.
అలక్ష్యం, అలస్యం చేసిన యొడల ఈ సమస్య ప్రాణాంతకం కావచ్చును.
|
|
-
|
స్వదేశీ జనాభా తంత్రము 2000 లో జనాభా నియంత్రణకు కొన్ని కార్యక్రమాలు
నిర్ధేశింపబడినవి. వీటిని నిర్భయంగా, సమర్ధవంతంగా అమలు చేయునట్టు కొన్ని
ముఖ్యమయిన, తగిన చట్టం వుండడం ఎంతో ముఖ్యమయిన విషయం. దీనిలో రెండు
ప్రత్యేకమయిన న్యాయశాసనములు ఉన్నాయి. ఇవి కొన్ని ప్రత్యేకమయిన పనులకు
ఉద్దేశింపబడతాయి. అవి
- గర్భస్థ శిశువుగా వున్నప్పుడే చేసే పరీక్షలు :
లోపాలను నిర్ధారించడానికి సవరించడం మరియు నివారించే
చట్టము.1994
- దీని కారకత నిర్దేశింపబడిన న్యాయశాసనము, మరియూ సూత్రాలు 1వ జనవరి 1996
నుంచి
అమలులోకి వచ్చినవి ఈ శాసనం గర్భస్ధ శిశువులో
వున్నలోపాలు పరీక్షలు చేయుటకు తగు
పరిస్ధితుల నిర్దేశిస్తుంది. గర్భస్ధ శిశువు
లింగ నిర్ధారణ నిషేధించడమైనది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికై
తగు చర్యలు తీసుకోవడం నిర్దేశించడమైనది.
శిశు మృత్య సంఖ్య వ్యాధి గ్రస్తమైన వ్యాధి
ప్రబలత వైద్య పరంగా అనుమతించిన గర్భస్రావం చట్టబధ్దమైన
గర్భస్రావం గర్భస్రావాలకు సంభంధించి శిశు మృత్యుల సంఖ్య మరియు
వ్యాధి ప్రబలతను నివారించడానికి నియంత్రించడానికి కొన్ని ప్రత్యేకమైన
పరిస్ధితులో వైద్యపరంగా గర్భస్రావాల అనుమతించే చట్టం 1971 న శాసన సభలో
ఆమోదించటం, 1972 ఏప్రిల్ నెలలో భారతదేశమంతటా అమలులోనికి వచ్చినది. జమ్మూ,
కాశ్మీరు లో మాత్రము 1976 నవంబరులో అమలులోనికి వచ్చినది.
చట్టబద్ధమైన గర్భస్రావ శాసనము తో కొన్ని నిబందనలు పొందు పరచడమైనది.
దీని ప్రకారము గర్భస్రావము చేయు స్ధలము, చేయు వారి అర్హతలు, చేయ వలసిన
పరిస్థితి పొందు పరచడమైనది. గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్ధితి,
గర్భిణీ స్త్రీకు శారీరిక లేక మానసిక సమస్యలున్నప్పుడు, ఒకవేళ
కాన్పుజరిగే లోపు గర్భిణీ స్త్రీకు ఏదైనా సమస్య తలెత్తే
ప్రమాదమున్నప్పుడు గర్భిణీ పొడిగించడం మూలాన తల్లికి ప్రాణానికి ముప్పు
అని తలచినప్పుడు లేక తల్లి శారీరిక మానసిక ఆరోగ్యానికి ముప్పు అని
తలచినప్పుడు చట్టబధ్ధమైన గర్భస్రావం చేయడం జరుగుతుంది.
మానవతా దృక్పధం :- మానభంగం తరువాత కలిగిన గర్భం.
గర్భం :గర్భధారణకు కారణం గర్భనీరోధక సాధనంలో లోపం వలన కలిగినప్పుడు
అటువంటి స్త్రీలు విన్నపము మీద గర్భస్రావం చేయబడుతుంది.
గర్భిణీ స్త్రీ యొక్క ఆర్ధిక పరిస్ధితి సరిగాలేని పక్షంలో పరోక్షంగా
ఇది తల్లి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్న పక్షంలో గర్భస్రావం విన్నపంపై
చేయడానికి అవకాశాలు ఎక్కువ వుంటాయి.
గర్భస్రావ చట్టం ప్రకారం కేవలం ఆమోదం పొందిన, అనుభవఘ్నలైన స్త్రీ వైద్య
నిపుణులు మాత్రమే చేయవలసి వుంటుంది. ఒకవేళ గుర్తించిన , గర్భం 12 వారముల
లోపలేవున్నచో తత్సంభంధమైన వైద్యులు నేరుగా గర్భస్రావం చేయవచ్చును.
ఒకవేళ గర్భం 12 వారాలకు మించి ఉన్నచో మరియొక వైద్యునితో గర్భస్రావం
చేయవలసిన అవసరాన్ని సంప్రదించ వలసి ఉంటుంది. వీరిరువురిలో గర్భస్రావం ఏ
ఒక్కరైననూ చేయవచ్చును.
అత్యవసర పరిస్ధితులలో గర్భం 20 వారాలు లేక మించి ఉన్నచో ఒక వైద్యుడే
స్వతంత్రంగా గర్భస్రావం గుర్తింపులేని లేక అనుమతి లేని ఆసుపత్రిలో గాని
నిర్వహించ వచ్చును.
గర్భణి స్త్రీ యొక్క అనుమతి రాత పూర్వకంగా తీసుకొనడం చాలా ముఖ్యం
కొన్ని పరిస్ధతిలలో ఒకవేళ గర్భిణీ స్త్రీ అఘాత పరిస్థితిలో వున్నా
లేక ఉన్యాదములో ఉన్నా లేక గర్భిణి వెంట వున్న ఆమె తరుపు పూచీ వహించే
వ్యక్తి సంతకం చాలా అవసరము. (గర్భిణి స్త్రీ మైనరైనచో తండ్రి యొక్క సంతకం
లేక రక్త సంబందీకులు) సంతకం అవసరం.
వైద్య పరమైన గర్భస్రావం
వైద్యులు నిర్దేశించిన గర్భస్రావ చట్టం 1971 స్వీయమైనదిగా లేక స్వవిషయంగా
పరిగణింపబడుతుంది.
కాబట్టి గర్భస్రావ నిర్వహించే వ్యక్తులు గర్భస్రావం చేయించుకునే
వ్యక్తుల పేరు మరియు వివరాలు గోప్యంగా ఉంచవలసిన బాధ్యత వహించాలి.
గర్భస్రావం నిర్వహించే సమయంలో ఏదైనా సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కాబట్టి
గర్భస్రావం నిర్వహించే సిబ్బంది అన్నీ విధాలైన జాగ్రత్తలు తీసుకోవలసి
ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకున్న తరువాత కూడా ఒకవేళ ఏవైనా సమస్యలు
తలెత్తుతే చట్టపరంగా కానీ లేక వైద్యపరంగా కానీ) దానికి ప్రభుత్వం రక్షణ
కల్పిస్తుంది.
సిబ్బంది ఒకవేళ పైన నిర్దేశించిన సిబ్బంది సూత్రాల ఉల్లంఘించి
పక్షంలో చట్ట ప్రకారం గర్భస్రావం నిర్వహించిన సిబ్బంది శిక్షార్హులవుతారు.
1000 రూ జరిమాన కూడా కట్టవలసి వుంటుంది.
గర్భిణి స్త్రీలకు వైద్యపరంగా సమస్యలు ఉన్నప్పుడు, శిశు సంభందమైన
జన్యు సమస్యలు ఉన్నప్పుడు గర్భస్రావం తల్లికీ బిడ్డకీ శ్రేయస్కరం. కానీ
వేరే కారణాల వల్ల శిశుజననం వద్ధనుకున్నప్పుడు లింగనిర్ధారణ
చేయించుకొని ఆడ శిశువు వద్ధనుకున్నప్పుడు గర్భస్రావం చేయించుకోవడం
అనైతికం, ఆసమాజకం కాబట్టి ఇలాంటివి జరగకుండా గర్భిణి స్త్రీలను నిరుత్సాహ
పరచాలి. గర్భస్రావ చట్టం 1975 వ సం. లో సవరించడమైనది. క్రింద చూపిన
సవరణను చేయడమైనది.
గర్భస్రావం చేసే సిబ్బందికి తగు అర్హతలు ఉన్నదీ లేనిదీ నిర్ధారించే
హక్కు జిల్లా ముఖ్య వైద్యాధికారి ఇవ్వబడ్డాయి. పూర్వము ఈ పని అర్హతా పత్ర
ఇచ్చే సంస్ధ చేతుల్లో ఉండేది.
గర్భస్రావం చేయుటకు ఉండవలసిన అర్హతలు
:
- 25 వరకు గర్భస్రావముల వరకు వైద్య సిబ్బంది చేయునప్పుడు వారకి సాయంగా
ఉన్నట్టయితే వారు వైద్యవృత్తి నడపడానికి అర్హత పొందిన వారై ఉండాలి.
- (RMP) వైద్యులు 6 నెలలు ప్రసూతి మరియు స్త్రీ వ్యాధుల విభాగంలో
నిపుణుల క్రింద పనిచేసి వుండాలి.
- గర్భస్రావం నిర్వహించే వైద్యులు ప్రసూతి మరియు - స్త్రీ వ్యాధులలో
నిపుణత పట్టభద్రులై వున్నచో
- 1971 సం. ముందు పట్టభద్రులైనవారు ( ఈ చట్టము రాక మునుపు) ప్రసూతి
మరియు స్త్రీ వ్యాధుల విభాగంలో 3 సం. పాటు పనిచేసి వుండాలి.
- ఈ చట్టం ఏర్పరిచిన తరువాత పట్టభద్దులైనవారు. ఈ విభాగంలో 1 సం. పాటు
పనిచేసి వుండాలి.
- జిల్లా ముఖ్య వైద్యాధికారి వద్ద అనుమతి పొందిన ప్రైవేటు
(ప్రభుత్వం).
సంస్థలు కూడా గర్భస్రావాలు నిర్వహించవచ్చును గర్భస్రావం సవరణ (1975)
జరిగిన పిమ్మట చట్టం 1971 లో ఏర్పరిచిన గర్భస్రావ చట్టం (సవరించిన 1975
చట్టం) మరియూ తద్వారా కూడా ఈ సేవలోంచే సౌకర్యం కల్పించిన పిదప కూడా
గర్భస్రావాలు నిపుణత లేక, అవగహాన కానీ అర్హత గానీ లేని వాళ్ళు
నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో కూడా ఈ విధంగా జరుతూ వున్నది.
ఈ విధంగా జరగడానికి ప్రధాన మైన కారణాలుగా ఈ దిగువ చూపిన అంశాలు
గుర్తించబడ్డాయి.
- గ్రామీణ మరియు సంచార కొండ చరియల్లో నివసించే గర్భిణీస్త్రీలు
గర్భస్రావం చేసే ఆసుప్రతులకు వెళ్ళే అవకాశం కానీ మార్గము గానీ
అరుదుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాలుకు వెళ్ళి గర్భస్రావం
చేయుంచుకొనడానికి ఆర్ధికంగా భరించలేరు.
- వీరికి సురక్షితమైన గర్భస్రావం జరిగే చికిత్సాలయాలు వున్నట్టు కూడా
అవగాహన వుండదు.
- గర్భస్రావం నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రులు లేక చికిత్సాలయాలలో రోగికి
సంభందించిన విషయం గోప్యంగా ఉంచే ప్రయత్నం సరిగా జరగదు.
- కన్యలు మరియు భర్త చనిపోయినవారు గర్భం ధరించిప్పుడు గర్భస్రావం
నలుగురుకి తెలిసేటట్టు చేయించకొనడానికి నిరాసక్తంగా ఉంటారు.
|
|
-
|
మొట్టమొదట గర్భస్రావం చేయవలసిన స్త్రీ గర్భిణి ఎన్ని నెలలు మరియు
గర్భధారణ గర్భ సంచిలోనే వున్నదా ? అన్న విషయం నిర్ధారించడం.
గర్భస్రావం నిర్వహించేప్పుడు మొదట ఉండే 3 నెలలో ప్రమాదాలు నెలలు పెరిగే
కొద్దీ పెరుగుతాయి.
గర్భస్రావం చేసేటప్పుడు మొదట మూడు నెలలలో సరియైన పద్ధతిలో చేసినప్పుడు
ప్రమాదాల కొద్దిగానే జరిగినా నెలలు పెరిగే కొద్దీ ఇవి అధికం అవుతూ
వుంటాయి. కాబట్టి గర్భస్రావం ఏ పద్ధతిలో చేయడం అన్నది. ఎన్ని నెలల
గర్భిణి ఎన్ని నెలలు అని నిర్దారించడమైనదే కీలకమైన అంశం అన్ని
ప్రసూతి కేంద్రాలలో గర్భిణి స్త్రీలయొక్క సమాచారం తీసుకోవడంలో మరియూ
లోపలి పరీక్ష చేయించడంలో తర్ఫీదు పొందిన సిబ్బంది మరియు అవసరమైన పరికరాలు
పరిసరాలు లేవో అటువంటి ఆరోగ్య కేంద్రాలు గర్భస్రావాలు చేయడానికి వెంటనే
తగు ఆసుపత్రులకు వారిని పంపించేయాలి. గర్భిణి స్త్రీ అవసరాల మేరకు
వీరికి తగు సలహా ఇవ్వగలిగే అనుభవజ్ఞులైన సిబ్బంది
వుండాలి.
గర్భిణి స్త్రీని పరీక్షించేటప్పుడు ఆరోగ్య కార్యకర్త - గర్భసంచి యొక్క
స్థానం (ముందుకు వున్నాదా ? వెనుకకు ఒరిగి ఉన్నదా లేక వేరొక రకంగా
వున్నాదా) నిర్ధారించుకోవాలి. ఇదికాక ఆమెకు లైంగిక సంబంధమైన
వ్యాధులు కానీ, జననేంద్రియ వ్యవస్ధ తో పాటు కానీ, జబ్బులు కానీ ఉన్నాదా
పరిక్షించవలసి వుంటుంది. రక్తహీనత, మలేరియా (చలిజ్వరం) వంటి జబ్బుల కోసం
కూడా చూడాలి. అటువంటి రోగులను నిపుణుల సలహాకోసం పెద్ద ఆసుపత్రికి పరీక్షల
నిమిత్తం వెంటనే పంపివేయాలి. గర్భసంచి సంబంధించిన జబ్బులు లేక అవయవలోపం
గమనించినట్టయితే వారిని తదుపరి పరీక్షల కోసం అటువంటి సౌకర్యాలు వున్న
ఆసుపత్రికి తరలించాలి.
సున్నితమైన అతిద్వని అలలు శరీరంలోని అవయవాలకు తాకి తనిఖీ చేసే
వాటి యొక్క ప్రతిధ్వనిని ఛాయా చిత్రము ద్వారా నయోదు చేయడం)
తక్కువ వారాల గర్భిణిలో గర్భస్రావం చేయడానికి ఈ పరీక్ష అవసరం లేదు. ఈ
సౌకర్యం వున్న చోట గర్భం గర్భ సంచిలో కాక వేరొక చోట ఏర్పడినప్పుడు
కనుగొనడానికి పనికి వస్తుంది. 6 వారాల కంటే పైబడ్డ గర్భంలో ఇది
పనిచేస్తుంది. కొద్దిగా ఎక్కువ వారాలు పై బడ్డ గర్భిణి స్త్రీలలో
గర్భస్రావం చేసేటప్పుడు ఈ విధానం సహాయకరంగా ఉంటుందని కొందరు గర్భస్రావం
నిర్వహించే సిబ్బంది అభిప్రాయం.
గర్భిణీ ఛాయాచిత్రం తీసే అవకాశం వున్న ఆసుపత్రులు లేక కేంద్రాలలో
గర్భస్రావం చేయుంచదలచునున్న స్త్రీలకు ప్రత్యేకంగా వేరొక చోటున, అంటే
సాధారణంగా గర్భిణి పరీక్ష చేయించుకొవడానికి, కాన్పు చేయించుకోడానికి
వచ్చిన వారితో పాటు కాకుండా , విడిగా వేరొక సౌకర్యంవంతమైన చోటు అందచేస్తే
అనువుగా వుంటుంది.
గర్భస్రావమునకు ముందు వుండవలసిన షరతులు
:-
గర్భం ఉన్నది లేనిది దరహత ఎన్ని నెలలు గర్భిణి అనే అంశాలు నిర్ధారించిన
పిదప ఆరోగ్య కార్యకర్త గర్భిణి స్త్రీ యొక్క వైద్యపరమైన సమాచారం.
సంపూర్ణంగా తీసుకొనవలసి వుంటుంది. గర్భిణి స్త్రీ ఏమైనా ఇతర జబ్బులతో
బాధపడుతున్నదా ? తద్వారా గర్భస్రావం ద్వారా ఆమెకు హాని కలిగే
అవకాశం వున్నదా మరియు గర్భిణి స్త్రీ ఉపయోగిస్తున్న మందు గర్భస్రావం
చేసేటప్పుడు ఉపయోగించే మందులకు సమస్య కాగలవా అన్న విషయం తెలుసుకోవాలి.
ఎయిడ్స్ వ్యాధి పీడితురాలైన స్త్రీ గర్భస్రావం చేయించుకున్నప్పుడు
వైద్య పరంగా, ఇతర గర్భిణీ స్త్రీలకు తీసుకొనే జాగ్రత్తలన్నీ అదే విధంగా
తీసుకోవాలి. వీరికి ఆరోగ్య కార్యకర్తచే తగు సలహా సూచనలు ఇప్పించ కలిగితే
మంచిది.
జననేంద్రియ వ్యవస్థ యొక్క క్రిమి సంపర్కము (జననేంద్రియ వ్యవస్థ దిగువ
భాగంలో ( సూక్ష్మజీవి సంపర్కము, (క్రిమి సంపర్కము) క్రిమి సంపర్కము
ఉన్నయెడల గర్భస్రావము చేయునప్పుడు మరియు చేసిన తరువాత గర్భిణీ
స్త్రీకు హాని కలుగవచ్చును. గర్భస్రావమే నిర్వహించునప్పుడు సూక్ష్మక్రిమి
సంహారక మందులు వాడడం మూలంగా గర్భస్రావం తరువాత వచ్చే సూక్ష్మక్రిమి
సంపర్కము వంటి జబ్బులకు సగం వరకూ నివారించవచ్చును. మందు జాగ్రత్తగా
ఉపయోగించే సూక్ష్మక్రిమి సంహారక మందులు లబించని చోట కూడా గర్భస్రావాలు
చేయవచ్చును. కానీ గర్భస్రావము చేయు పరికరాలు, పరిసరాలు, శుభ్రముగా
సుక్ష్మక్రిమి రాహిత్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇవి గర్భస్రావం చేసిన
పిమ్మట వచ్చే సూక్ష్మక్రిమి సంపర్కంన్ని చాలా శాతం వరకూ
నివారిస్తుంది.
వైద్యపరంగా గర్భస్రావం చేయవలసిన స్త్రీలో క్రిమి సంపర్కం యొక్క
లక్షణాలు కనబడితే వెంటనే చికిత్సచేసి ఆ తర్వాత గర్భస్రావం చేయాలి.
జననేంద్రియ వ్యవస్థ క్రిమి సంపర్కంలో సాధారణంగా చేయవలసిన పరీక్షలు
చేయించాలి. తీవ్రమైన లక్షణాలు లేకున్నచో గర్భస్రావం వెంటనే నిర్వహించాలి.
ప్రయోగశాల నివేదికల కోసం ఎదురు చూడనవసరం లేదు.
ఫలధీకరణం చెందిన అండము గర్భాశయంలో కాక గర్భాశయం బయట కటివలయంలో వేరొకచోట
పిండం పెరగడం ప్రారంభమవుతుంది. దీనిని గర్భాశయేతర గర్భం
అంటారు. సర్వసాధారణంగా ఇది గర్భకోశ నాళాలు అండాశయాలు, గర్భ సంచి
వెనుక ఉండే డగేలాస్ అను ఖాళీ సంచి వంటి ప్రదేశంలో పెరుగుతుంది.
గర్భాశయేతర గర్భం ఒక్కసారి ప్రాణాంతకం అవుతుంది. గర్భాశయేతర గర్భిణిలో
క్రింది లక్షణాలు గోచరించవచ్చును.
- ఉండ వలసిన దానికంతా గర్భసంచి యొక్క పరిమాణం చిన్నగా
ఉండడం. (బహిష్ఠు రాని నెలలకు తగ్గట్టుగా ఉండక పోవడం)
- క్రింద లేక పొత్తి కడుపు నొప్పి
- పొత్తి కడుపులో నొప్పితో పాటు యోని ద్వారా రక్తస్రావం లేక రక్తం
చుక్కలుగా కనబడడం.
- తల త్రిప్పడం, పాలిపోవడం, కళ్ళు తిరగడం, గర్భసంచికి ఇరువైపులా
గడ్డలు.
గర్భాశయేతర గర్భం అని అనుమానం కలిగినప్పుడు దానిని అత్యవసరంగా
నిర్దారించడం వెంటనే చికిత్స మొదట పెట్టడం చాలా ముఖ్యం. చికిత్స చేయలేని
పక్షంలో అటువంటి గర్భిణి స్త్రీని ఎంత త్వరగా వీలయితే అంత
త్వరగా ఇటువంటి వసతులు వున్న ఆసుపత్రికి తరలించాలి.
|
|
-
|
గర్భస్రావం కొసం వచ్చిన గర్భిణి స్త్రీలకు ఇదొక అవకాశంగా తీసుకొని
వారియొక్క గర్భాశయ బహిర్ఘ ద్వారం యొక్క కణజాల పరిస్థితి గురించి పరీక్షలు
చేయ వచ్చును. దీనివల్ల ఆ స్త్రీకు మునుముందు క్యాన్సరు వచ్చే
అవకాశం వున్నదీ, లేనిదీ నిర్ధారించవచ్చును. కానీ ఈ పరీక్ష చేయించుకోమని
వారికి బలవంత పెట్టకూడదు. గర్భాస్రావం చేయించుకోవడానికి ఈ పరీక్ష
అవసరం లేదు.
సమాచారం మరియు సలహా సంప్రదింపులు :-
గర్భాస్రావం చేయించుకోవడానికి వచ్చిన స్త్రీకు ఆమె పరిస్థితి
గురించి పూర్తి సమాచారం, అవగాహన, గర్భాస్రావం చేసే పధ్ధతి అందులో
కూడుకున్న సమస్యలు వారికి అర్ధమయ్యేలా గోప్యంగా ఉంచే బాధ్యత వహిస్తూ ఆ
విధంగా నమ్మకం కలిగిస్తూ సలహా ఇవ్వాలి.
తీర్మానించుకునే విధంగా సలహా ఇవ్వడం :-
గర్భాస్రావం చేయించుకోవాలనుకున్న స్త్రీకు సలహా సంప్రదింపులు చాలా
ముఖ్యం. ఆమె వీలు ను బట్టి, ఆమెపై ఏ ఒత్తిడులు తేకుండా నిర్ణయం
తీసుకునేటట్టు సాయపడాలి. ఈ సలహా సంప్రదింపులనేవి తమంతటతాము లేక, స్వతహాగా
ఇవ్వవచ్చును లేదా తర్ఫీదు పొందిన సిబ్బందితో ఇప్పించవచ్చును.
గర్భిణీ స్త్రీ గర్భస్రావం చేయించుకోడానికే
నిర్దారించుకున్నప్పుడు ఆరోగ్య కార్యకర్త ఆమెకు
న్యాయపరమైన సమ్మతికి అవసరమైన అంశాలు విశదీకరించాలి. ఆమెకు నిర్ణయం
తీసుకొనడానికి తగిన వ్యవధిని ఇవ్వాలి. తక్షణ నిర్ణయం తీసుకోలేక
పోయినా ఇంటికి పోయి ఆలోచించుకొని తిరిగి రావడానికి
అనుమతినివ్వాలి.
అదే సమయములో నెలలు మించి పోకుండా గర్భస్రావం చేయించుకోవడం వల్ల ఉన్న
లాభాలు మరియు సౌకర్యం గురించి తెలియచెప్పాలి.
ఒకవేళ గర్భిణి స్త్రీ కాన్పువరకూ ఆగడానికి నిశ్చయించు కొన్న పక్షంలో
శిశువును పెంపకానికి ఇచ్చే వసతి గురించి మరియు దత్తు తీసుకునే సంస్థల
సమాచారం తగిన విధంగా ఇవ్వాలి.
కొన్ని సందర్భాలలో గర్భిణి స్త్రీ పై గర్భస్రావం కోసం ఆమె
భాగస్వామి మరియు తల్లిదండ్రుల ఒత్తిడి ఉండవచ్చును. అవివాహిత కన్యలు
మరియు సుఖవ్యాధుల బారిన పడినవారి పై ముఖ్యంగా ఇటువంటి ఒత్తిడి
వుంటుంది.
ఎయిడ్స్ వ్యాధి సోకిన అందరు స్త్రీలకు కూడా ఒకవేళ గర్భం కాన్పు
వరకూ పొడిగించబడితే ఆమె ఆరోగ్యానికి కలిగే హాని ముందు ఎయిడ్స్
వ్యాధి బిడ్డకు సోకే ప్రమాదం ఆమెకు తెలియజేయాలి. తరువాత కాన్పు వరకూ వారు
తీసుకోవలసిన మందుల గురించి, ఈ విధంగా పుట్టే బిడ్డకు వ్యాధి తెలియపరచాలి.
దీని తరువాత వారు ఏ విధంగా గర్భిణీ కాన్పు వరకూ పొడిగించడమే లేక
గర్భస్రావం చేయించు కొవటమా చట్ట సమస్యమైన నిర్ణయం తీసుకొనవలసి ఉంటుంది.
వారు అధిక సమాచారం కోసం అర్ధించ వచ్చను. ఆరోగ్య కార్యకర్త లేక
సిబ్బంది గర్భిణి స్త్రీ లైంగిక వేధింపులకు గురియై ఉండవచ్చునని అనుమాన
పడినప్పుడు అటువంటి స్త్రీలను మరికొంత సలహా సంప్రదింపులు
మరియు మానసిక చికిత్సకోసం అటువంటి వసతులు వున్న చోటుకు పంపవలసి వుంటుంది.
ఆసుపత్రివోని కార్యనిర్వాహకులు అక్కడి సిబ్బందికి సమాజంలో ఆరోగ్య సంస్థలలో
ఇటువంటి సౌకర్యముల గురించి అవగాహన వుండేటట్టు చూపాలి.
|
|
-
- గర్భస్రావం చేసేటప్పుడు, పిదప ఏం జరుగుతుంది.
- గర్భస్రావం జరుపుతున్నపుడు కలిగే అనుభవం (ఉదా:- బహిష్ఠు సమయంలో వచ్చే
ఈడుపు నొప్పుడు నొప్పుల, రక్తస్రావం)
- గర్భస్రావం చేయడానికి పట్టే సమయం
- నొప్పి కలగకుండా తీసుకునే చర్యలు
- గర్భస్రావం చేయించుకోవడంలో కలిగే పరిణామాలు మరియు అపాయాలు.
- గర్భస్రావనంతరం తనపనుల తాను చేసుకోవడానికి పట్టే సమయం. మరియు
సంభోగంలోపాల్గొనడానికి ఎంత వ్యవధి అవసరం.
- గర్భస్రావానంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు.
గర్భస్రావం చేసే పద్ధతులలో ఒకటికన్నా ఎక్కువ పద్ధతులు అందుబాటులో వున్న
యెడల ఆరోగ్య కార్యకర్త గర్భిణి స్త్రీకు వాటి సమాచారం, వాటి యోగ్యత,
ఎన్ని నెలలు గర్భిణీకి ఏ పద్ధతైతే శ్రేయస్కరమో తెలియచెప్పాలి. పద్ధతి
నిర్ధారించే ముందు గర్భిణికి ఎన్ని నెలలో, గర్భిణి స్త్రీ యొక్క ఆరోగ్య
పరిస్థితి, తదుపరి జరగడానికి అవకాశం వుండే ప్రమాదాలు విశదంగా
తెలియపరచాలి.
గర్భనిరోధక సాధనాలు మరియు వాటి సమాచారం :-
గర్భస్రావం చేయించుకునే స్త్రీకు గర్భనిరోధక సాధనాల సమాచారం అందించడం
చాలా ముఖ్యం. దీనివల్ల ఇక మీదట అవాంఛిత గర్భం రాకుండా వారు జాగ్రత్తపడే
అవకాశం వుంటుంది.
గర్భస్రావం చేయించుకున్న ప్రతి స్త్రీకి గర్భస్రావం చేసిన రెండు వారాల
తరువాత అండం విడుదలయ్యే అవకాశం తద్వారా వెంటనే గర్భం వచ్చే అవకాశం
వుంటుందని తెలియపరచాలి. అందుకని సరియైన గర్భనిరోధక పద్ధతులు పాటించాలి.
గర్భస్రావం చేయించుకునే స్త్రీకి గర్భనిరోధక సాధనాల గురించి ఖచ్చితమైన
సమాచారం మరియు ఏ పద్ధతైతే ఆవిడ అవసరాలకు తదనుగుణంగా పని
చేస్తాయో వివరించాలి. గర్భధారణకు కారణం గర్భ నిరోధక సాధనం వైఫల్యం వలన
కలిగినవైతే ఆమేకు గర్భం రావడానికి కారణం గర్భ నిరోధక సాధనం సరియైన
పద్ధతిలో వాడక పోవడం వలన వచ్చివుండవచ్చునని వివరించాలి. వాటికి సరియైన
పద్ధతిలో వాడే విధానం వివరించాలి. గర్భనిరోధక సాధనం మార్చడం గురించి ఆమెతో
సంప్రదించాలి.
ఏ గర్భనిరోధక సాధనం ఉపయోగించుకోవాలి. అనే తుది నిర్ణయం ఆమెకే
వదినివేయాలి.
|
|
-
|
తగురీతిగా తర్ఫీదు పొందిన సిబ్బంది గర్భస్రావం చేసిన చిక్కులు కలగడం
చాలా అరుదు. ప్రతీ ప్రసూతి కేంద్రాలలో మరియు ఆరోగ్య కేంద్రాలలో గర్భస్రావం
వల్ల కలిగే అపాయాలను గుర్తించడానికి, వెంటనే తగు చికిత్స
అందించగలిగి లేక రోగిని అటువంటి చికిత్స లభ్యమయే కేంద్రాలకు
తరలించడానికి తగిన తర్ఫీదు పొందిన సిబ్బంది. ఉపకరాలు, వాహనాలు 24 గంటలు
అందుబాటులో ఉండాలి. గర్భస్రావం వల్ల ఉత్పన్నమయే చిక్కులు లేదా
అపాయాలు లేదా ప్రమాదాలు తమంతటతామే అయిపోయే లేక అనన్య ప్రేరేపితమైన
గర్భస్రావంలో ఉత్పన్నమయే ప్రమాదాలను పోలి ఉంటాయి. కాబట్టి దీనిని
అదుపుచేయడానికి ఉండలసిన ఉపకరణాలు, తర్ఫీదు పొందిన సిబ్బంది ఉంటే
సరిపోతుంది.
అసంపూర్ణ గర్భస్రావం :-
నిపుణులైన లేక తర్ఫీదు పొందిన సిబ్బంది గర్భసంచి లోన కింది
గర్భానికి సంబందించి కణజాలాన్నంతటనే బయటకీ గుంజి మేసే వంటి ఉపకరణం
ఉపయోగించి చేసినట్టయితే చిక్కులు రావడం చాలా అరుదు. ఇవి సాధారణంగా
వైద్యపరంగా చేసే గర్భస్రావంలో ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. సంకేతాలు
లక్షణాలు క్రింది విధంగా వుంటాయి.
- యోని ద్వారా రక్తస్రావం
- పొత్తి కడుపు నొప్పి
- చీముపోసినట్టు సంకేతాలు ఉదా,, జ్వరం, వాసనతో కూడిన ద్రవాలు యోని గుండా
స్రవించడం, నొప్పి వంటివి.
శస్త్ర చికిత్స ద్వారా గర్భస్రావం చేసిన తరువాత సంగ్రహించిన గర్భిణికి
సంబంధించిన కణజాలం ఒకవేళ గర్భిణి నెలలకు సరితూగకపోతే గర్భస్రావం అసంపూర్ణ
మయిందని అనుమాన పడవలసి వుంటుంది.
ప్రతి ఆరోగ్య కేంద్రాలలోని సిబ్బందికి సంపూర్ణ గర్భస్రావాలకు
చికిత్స చేయడం తర్ఫీదు పొంది ఉండాలి. వీటిలో గర్భసంచిని మరలా
శుభ్రపరచడం. రక్తస్రావం మరియు చీము పోయడం వంటి అంశాలను నియంత్రించ గలిగి
వుండాలి. లేదా ఇటుంవంటి వసతులు మరియు నిపుణులు వున్న కేంద్రానికి రోగిని
తరలించే వసతులు కలిగి వుండాలి.
విఫలమైన గర్భస్రావం :- గర్భిణీ స్త్రీలో ఇటువంటి
పరిస్థితి గర్భస్రావం శస్త్ర చికిత్స లేక వైద్య పరంగా చేసినప్పుడు
రావచ్చును.
ఏ పద్ధతిలో చేసినా గర్భస్రావం చేయుంచుకున్న స్త్రీ మారు పరీక్షకు
వచ్చినప్పుడు పరీక్షలో గర్భం సాగుతున్నట్టు తెలిస్తే మరల శస్త్ర చికిత్స
(గర్భసంచి కుహరంలోకి గొట్టాన్ని పంపి శూన్యత ఏర్పరచి పీడనం ద్వారా
శుభ్రపరచడం) లేదా గర్భసంచి ద్వారాన్ని వెడల్పుచేసి తగు పరికరాలు
వినియోగించి శుభ్రపరచడం. దీనిని సాధారణంగా రెండవ త్రైమాసిక భాగం లో
ఉపయోగిస్తారు.
రక్తస్రావానికి కారణాలు క్రింది విధంగా ఉండవచ్చును.
- పిండము దాని చుట్టు ఉన్న కణజాలం గర్భసంచిలో మిగిలి ఉండి
పోయినప్పుడు
- గర్భసంచికి లేక గర్భసంచి మూతికి గాయం అయినప్పుడు లేదా
చిల్లుపడినప్పుడు.
కారణానుసారంగా గర్భసంచిని తిరిగి శుభ్ర పరచడం. మరియు రక్తస్రావాన్ని
నియంత్రించేటట్టు సంచిపై పనిచేసే మందులు ఇవ్వడం. రక్తస్రావం
రక్తనాళాల ద్వారా ద్రవాలు ఎక్కించడం, రక్త ప్రవేశనము చేయడం, ఉదర కుహరములో
ఉన్న అవయవములను క్షుణ్ణంగా పరిశీలించడం రక్తస్రావాన్ని నిరోధించడానికి
ఆక్సిటోసిన్స్ అను మందులు తరుచుగా వాడడం మంచిది. రక్తస్రావం తీవ్రంగా
ఉన్నయెడల దీనిని అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. కాబట్టి ప్రతి
ఆరోగ్య లేక ప్రసూతి కేంద్రంలో రోగిని అటువంటి పరిస్థితిలో చికిత్స
అందించడానికి తరువాత రోగిని నిపుణులున్న కేంద్రానికి వీలయినంత త్వరగా
తరలించడానికి తగిన వసతులు కలిగి ఉండాలి.
సూక్ష్మజీవి సంపర్కము :- తగురీతిగా గర్భస్రావం
చేసినప్పుడు ఈ సమస్య అరుదుగా కలుగుతుంది. సాధారణంగా జర్వం, చలి, యోని
గుండా లేక గర్భసంచి ముఖం ద్వారా దుర్గంధపూరిత స్రావాలు రావడం, కడుపులేక
పొత్తి కడుపు నొప్పి చాలా రోజుల వరకూ రక్తస్రావం జరగడం, రక్తం చుక్కలుగా
కనబడుతూ ఉండడం. గర్భసంచి పచ్చిగా ముట్టుకుంటే నొప్పిచేయడం, తెల్ల రక్తకణాల
సంఖ్య పెరగడం వంటి లక్షణాలు కనబడుతాయి.
సూక్ష్మజీవి సంపర్కము వున్నదని అనుమానం కలిగినా, నిర్ధారింపబడినా వెంటనే
ఆరోగ్య కార్యకర్తల సూక్ష్మజీవి నాశకములను ఇవ్వడం, సూక్ష్మజీవి
సంపర్కమునకు కారణం గర్భసంచిలో మిగిలిపోయిన పిండము దానికి సంబంధించిన
కణజాలం అయినచో గర్భసంచిని తిరిగి శుభ్రపరచాలి. సూక్ష్మజీవి
సంపర్కము తీవ్రంగా ఉన్నచో రోగిని ఆసుపత్రిలో చేర్పించాలి. గర్భస్రావానికి
ముందే సూక్ష్మజీవి నాశక ముందులు ఇచ్చినచో గర్భస్రావం తరువాత
సూక్ష్మజీవి సంపర్కము వంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా వరకూ
తగ్గుతాయి. కాబట్టి వీటిని ముందే ఇవ్వడం శ్రేయస్కరం.
గర్భసంచికి చిల్లుపడుట :-
సాధారణంగా ఇది గుర్తించకుండానే దానంతట అవే మాని పోతాయి. మొదటి త్రైమాస
గర్భంలో గర్భస్రావం మరియు లాప్రోస్కోప్ పద్ధతి ద్వారా పిల్లలు
పుట్టకుండా శస్త్ర చికిత్స చేసినప్పుడు.
700 మంది మొదట త్రైమాస గర్భంతో వున్న వారికి గర్భస్రావం మరియు పిల్లలు
కలగకుండా చేసే శస్త్ర చికిత్స సమయంలో 14 మంది స్త్రీలలో 15, 12, మంది
స్త్రీలలోనే గర్భసంచికి చిల్లు పడడం గమనించడం జరిగింది. ఈ చిల్లుల
ఉదరకుహరం నేరుగా చూస్తూ ఉండడం వల్ల గమనించడం జరిగింది. లేకపోతే తెలిపే
అవకాశం లేకుండానే అవి వాటంతట అవే మానిపోతాయి. గర్భసంచికి చిల్లు
పట్టలేదని కనుగొనడానికి ఈ పద్ధతి సరియైనది. ఈ విధానంలో ఒకవేళ పేగులకు
గానీ, రక్తనాళాలకు గానీ లేక ఇతర అవయవాలకు గానీ చిల్లు
పడ్డట్టు అనుమానం కలిగితే లేదా రోగి పరిస్థితి విషమిస్తున్నట్టు అనుమానం
కలిగినా అంత్ర వేష్టన కుహరాంత దర్శిని తో చిల్లిపడిన భాగాన్ని మర్మత్తు
చేయవలసి వుంటుంది.
మత్తు మందుకు సంభందించిన సమస్యలు లేదా చిక్కులు శస్త్ర చికిత్సలో
మత్తు కలిగించడం వల్ల తలెత్తే సమస్యలు
రోగికి స్ప్రహ లేకుండా చేయడం కన్నా స్థానికంగా నొప్పితెలియకుండా మొద్దు
బారేటట్లు చేయడం శ్రేయస్కరం. ఇది మొదటి త్రైమాస గర్భంలో చేసే శూన్యత
ఏర్పరిచి పిండ భాగాలకు సంచి వేసే పద్ధతి మరియు రెండవ త్రైమాస
గర్భంలో ఉపయోగించే గర్భం కోసం పదార్థాలను తీసివేసే శస్త్ర చికిత్సకు
కూడా వర్తిస్తుంది. రోగికి పూర్తి మత్తు ఇచ్చినప్పుడు అక్కడ పనిచేసే
సిబ్బంది రోగి పరిస్థితి స్థిరంగా ఉంచడం, గుండె ఊపిరితిత్తుల
పనితీరులో మార్పులు లేక దిగజారే పరిస్థితి, మూర్ఛవంటి పరిస్థితుల
ఉత్పన్నమయితే వాటిని నియంత్రించగలిగే తర్ఫీదు పొంది వుండాలి.
వీలుంటే తిరిగి మార్చే ముందుల కూడా అక్కడ లభించేటట్టు
చూడాలి.
|
|
-
|
ఎక్కువ శాతం వరకూ సరియైన పద్ధతిలా గర్భస్రావం చేయించుకున్న
స్త్రీ అలా వారి శారీరక లేక జననేంద్రియ వ్యవస్థపై సమస్యలు తలెత్తవు.
చాలా తక్కువ మంది స్త్రీలలో ఎవరిలో నైతే గర్భస్రావ సమయంలో తీవ్రమైన
సమస్యలు తలెత్తి వున్నచో వారిలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం
వుంటుంది.
మొదట త్రైమాస గర్భం అన్ని జాగ్రత్తలలో నిపుణులైన వారితో గర్భస్రావం
చేయించుకున్నప్పుడు దీని ప్రభావం తరువాత గర్భిణుల మీద ఎంత వరకూ
ఉండదు స్థనాల క్యాన్సరుకు గర్భస్రావాలకు ఎటువంట సంబంధం లేదని నిరూపించడం
జరిగింది. వారు గర్భస్రావానికి ముందు నుంచే ఈ జబ్బులతో భాధ పడుతూ వుండి
వుంటారు. గర్భస్రావం తరువాత కూడా అవి పొడిగింపబడుతూ ఉంటాయి.
గర్భస్రావం తరువాత తీసుకోవలసిన
జాగ్రత్తలు
గర్భస్రావం చేయించుకోబోయే స్త్రీలకు గర్భస్రావం తరువాత వారు
తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం వుండేది,
వాటిని గుర్తించడం ఎలా అనే అంశాలు వారికి అర్ధమయ్యే వాడుక భాషలో లేక వ్రాత
పూర్వకంగా తెలియచేయాలి. గర్భస్రావం పూర్తి అయ్యే లోపు గర్భిణీ స్త్రీకి
అవసరమైతే తాను కలువ వలసి న వైద్యుడు లేక ఆరోగ్య కార్యకర్త ఎవరు అనే
సమాచారం తెలియాలి. వారి ద్వారా తను ఏ ప్రశ్నలకైనా సమాధానం మరియు
సహకారం పొందవచ్చును.
ప్రస్తుత పరిస్థితి అంచనా వేయగలగడం :-
కొన్ని సందర్భాలలో గర్భిణీ స్త్రీ మనవి తరువాత గర్భస్రావం చేయడం చట్ట
సమ్మతమైనా కూడా కొంత మంది ఆరోగ్య కార్యకర్తలే గర్భస్రావానికి వ్యతిరేకంగా
ప్రచారం చేస్తూ వుండవచ్చు. ఇటువంటి సమయంలో ఈ కార్యక్రమాలను అమలు
చేసేవారు ఎవరైతే సరియైన రీతిలో సేవలను అందించి అమలు చేయగలరో, అటువంటి
వారిని ఎంపిక చేసి వినియోగించుకోవాలి. కావున ఇటువంటి కార్యక్రమాల గురించి
ఎప్పుటికప్పుడు సమాచారం తీసుకోవడం ఎంతైనా అవసరం.
జాతీయ ప్రమాణాలను స్థాపించడం పరమైన :-
చట్ట సమ్మతమైన పరిధిలో నాణ్యమైన గర్భస్రావ సేవలు ఉపలభ్యమయ్యోటట్టు
అవసరమైన ప్రమాణాలను తయారు చేయాలి. ఈ ప్రమాణాలు గర్భస్రావానంతరం
అందించే సేవలు నాణ్యమైనవి అత్యవసరమైన ప్రధాన అంశాలతో కూడా ఉండాలి.
ఈ ప్రమాణాలు ప్రభ్యుత్వ, ప్రభుత్వేతర మరియు ప్రజలు
అందించగలిగేట్టు వుండాలి. ఈ ప్రమాణాలలో ఈ క్రింది అంశాలు కూడా జత
పరచాలి.
- గర్భస్రావాలలో రకాలు, వీటిని ఏయే ప్రదేశాలలో నిర్వహించ వచ్చును.
- అవసరమైన పరికరాలు, సామాగ్రి, మందులు సదుపాయాలు.
- అవసరమైన పరిస్థితులలో రోగిని నిపుణుల వద్దకు చికిత్సకై తరలించుటకు
అవసరమయ్యే ఏర్పాట్లు.
- గర్భిణీ స్త్రీ యొక్క గర్భస్రావం గురించి ఆమె తీసుకునే
నిర్ణయాన్ని గౌరవించడం రహస్యంగావుంచడం. ముఖ్యంగా కౌమార దశలో (యౌవ్వనం) లో
వున్న అమ్మాయిల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించడం.
- మానభంగం వల్లకలిగిన గర్భవతి యైన స్త్రీల గురించి ప్రత్యేక
సదుపాయాలు.
|
|
-
|
మొదటి త్రైమాస గర్భంలోనే గర్భస్రావ సదుపాయాలు అందించగలిగితే అమ్మలైన
వారికి చాలా సౌకర్యంగా వుంటుంది.
ప్రాధమిక కేంద్రాలలో గణనీయమైన (శ్రేష్ఠమైన) ప్రసూతి ఆరోగ్య వసతులు లేని
పక్షంలో కనీసం అవసరం మేరకు వారిని నిపుణుల వద్దకు తరలించగలిగే వసతులైనా
కల్పించాలి.
సంఘపరమైన :- చిన్నచిన్న సంఘాలలో వుండే ఆరోగ్య
కార్యకర్తలు స్త్రీలకు అవాంఛనీయ గర్భాల గురించి, గర్భనిరోధక సాధనాల
గురించి మరియూ అసురక్షితమైన గర్భస్రావాలు మరియు గురించి సమాచారం
అందించాలి.
ఆరోగ్య కార్యకర్తలు గర్భిణి స్త్రీలకు ఏ విధంగా ఆలస్యం చేయకుండా
సురక్షితమైన, చట్టబద్ధమైన గర్భస్రావం చేయించుకొనవచ్చునో మరియు, ఒకవేళ అను
రక్షిత గర్భస్రావం వలన అపాయాలు దుష్పరిణామాలు తలెత్తి వుంటే వాటిని
తగురీతిలో చికిత్స పొందేందుకు నిపుణుల వద్దకు బదిలీ చేయించగలగాలి.
ప్రాధమిక ఆరోగ్య సదుపాయం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణంగా తర్ఫీదు
పొందిన ఆరోగ్య కార్యకర్తలు, మరియు కనీస సదుపాయాలు కల్పించబడి ఉంటాయి. గర్భ
కుహరం నుంచి గొట్టాల ద్వారా గర్భస్థ పిండం మరియు తత్సంభంధమైన పదార్థాలు
శూన్యత ఏర్పరిచి గుంజి వేసే పద్ధతి, మరియు వైద్యపరంగా గర్భస్రావం చేసే
పద్ధతులు ఈ ఆసుపత్రిలనీ నిర్వహించవచ్చును. వీటికి రోగి ఆసుపత్రిలో చేరి
ఉండ వలసిన అవసరం రాదు.
జాతీయ ప్రమాణాలు, నియమాలు ఏర్పరచ
డం
ఆరోగ్య సిబ్బందిలో దాది, దాయాలు, ఆరోగ్య సహాయ కార్యకర్తలు, వైద్య
నిపుణులు ఉండాలి. ముందు నుంచి తర్ఫీదు పొందిన ఆరోగ్య కార్యకర్తలు గర్భిణీ
స్త్రీలను యోని ద్వారా పరీక్ష చేసి గర్భిణీ నిర్ధారించగలిగి వుండి మరియు
లూపు వంటి గర్భనిరోధక సాధనాలను వేయగలిగి ఉంటే వారికి మొదట త్రైమాస
గర్భిణీలలో చేసే శూన్యత ఏర్పడి గర్భకుహరం నుంచి గర్భానికి సంబంధించిన
పదార్దాలు గొట్టం ద్వారా గుంజి వేసే పద్ధతిని చేయగలిగేటట్టు తర్ఫీదు
ఇవ్వవచ్చును. వైద్య పద్దతి (మాత్రల ద్వారా) గర్భస్రావం
చట్టపరంగా అనుమతిపొందిన, మరియు ఉపలభ్ధమైన చోటకూడా సిబ్బంది గర్భస్రావం
మాత్రలు ఇవ్వడం మరియు పరిణామాలు తనిఖీ చేస్తూ చికిత్స చేయ వచ్చును.
సాధారణంగా జరిగే కాన్పులు మరియు ఆకస్మిక గర్భస్రావాలకు చికిత్సఇచ్చే
చోట అత్యవసర పరిస్థితులలో రోగిని నిపుణుల వరకు వెంటనే తరలించడానికి వసతులు
కలిగి ఉండాలి. అవసరానుసారం ఆరోగ్య కేంద్రాలు పనిచేయు వేళల అనంతరం కూడా
తర్ఫీదు పొందిన సిబ్బంది పిలిచిన వెంటనే పలికేటట్టు అందుబాటులో
ఉండాలి.
జిల్లా ఆసుపత్రి ప్రాధమిక పరిధి
జిల్లా ఆరోగ్య కేంద్రాలలో కూడా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో
గర్భస్రావాలకు నిబందనముల అనుసారం ఆరోగ్య సేవలదించే అన్ని వసతులు
కలిగి ఉండాలి. నిపుణులచే అందించవలసిన సేవల అవసరం చాలా అరుదుగా అవసరం మేరకు
వినియోగించుకోవాలి తప్పితే అన్ని సమయాలలో కాదు. ఉదాహరణకు స్కానింగు (
అల్ట్రా సౌండ్ పద్దతి లోపలి అవయవాలకు తనిఖీచేసి ఫోటో తీయాలి స్కానింగు
చేయు అవయమును అడ్డముగా విభజించు తువక ఫోటోలు) అనే ప్రత్యేకమైన పరికరాలు
ప్రాధమిక త్రైమాసపు గర్భస్రావములకు అనవసరం లేదా దీనివలన ఆరోగ్య కేంద్రాలపై
ఆర్ధిక భారం పడుతుంది. రోగికి పూర్తిగా మత్తు కలిగించే పద్ధతి అన్ని
వేళలా వాడరాదు. దీనివలన ఆర్ధికంగా భారం మరియు రోగికి హాని
కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గర్భస్రావాలు (ముఖ్యంగా
ప్రాధమిక త్తైమాసపు గర్భంలో) ఆసుపత్రిలో వుండే అసవసరం లేకుండా
గర్భస్రావానంతరం అదే రోజు ఇంటికి వెళ్ళిపోయేలా చేయడం శ్రేయస్కరం.
దీనిమూలాన గర్భిణి స్త్రీలకు సౌకర్యంగా వుండడమేకాకుండా ఆర్ధికపరంగా కూడా
అనుకూలంగా వుంటుంది.
ద్వితీయ మరియు తృతీయ పరిధి ఆసుపత్రులు
ఈ ఆసుపత్రులు అన్ని సంధర్బాలలో చట్టపరిధిలో వున్న అన్ని
గర్భస్రావాలు చేయగలిగే సదుపాయాలు వుండాలి. అసురక్షితమైన గర్భస్రావానంతరం
తలెత్తే అన్ని రకాలైన ఊహించని సమస్యలు అపాయాలకు చికిత్స చేయగలిగి
వుండాలి.
వైద్యకళాశాలలో గర్భస్రావం గర్భస్రావానంతరం తీసుకోవలసిన జాగ్రత్తల
అపాయాలకు గుర్తించే అంశాల వంటి వాటిలో ఆరోగ్యసిబ్బందికి తర్ఫీదు. వీటిలో
నిపుణత సాధించే విధంగా ఏర్పాట్లు ఉండాలి. ఆరోగ్యసిబ్బందికి నిపుణులు
తర్ఫీదునివ్వాలి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వారికి తలెత్తే సమస్యలు
వాటినెలా ఎదుర్కోవాలి ఏ విధంగా చికిత్స చేయాలి వంటి అంశాలలో క్షుణ్ణంగా
అవగాహన కలిగించాలి. అవసరం మేరకు ఏవిధంగా రోగిని నిపుణులు వరకు
తరలించాలి.
|
|
|
|