ఋతు సంబంధ రుగ్మతలు

స్త్రీలలో ఎన్నో రకాల ఋతు సంబంధ వ్యాధులుంటాయి. కొన్ని కొద్ది కాలం ఉండే చిన్నా చితకా సమస్యలైతే, కొన్ని రకాలు దీర్ఘకాలం బాధిస్తాయి. మరికొన్ని ప్రమాదకరమైనవి కూడా. వివిధ రకాల రుతు సంబంధ వ్యాధులను గుర్తించడానికి ఈ వ్యాధుల గురించి ఇచ్చిన వివరణ ఉపయోగపడుతుంది.


డిస్మెనోరియ (ఋతు శూల)

ఋతు సమయంలో ఉండేనొప్పిని ఋతు శూల అంటారు. ఇది రెండు రకాలు – ప్రైమరీ డిస్మెనోరియ, రెండవది సెకండరీ డిస్మెనోరియా. సాధారణంగా బహిష్టు సమయంలో వచ్చేది ప్రైమరీ డిస్మెనోరియా. ఇది స్త్రీలలో తరచుగా కనిపించే సమస్య.
పొత్తికడుపులో ఎలాంటి సమస్యాలేకుండా, బహిష్టు వచ్చేముందు పొత్తికడుపులో వచ్చేనొప్పిని ప్రైమిరీ డిస్మెనోరియాగా వ్యవహరిస్తారు. సెకండరీ దిస్మెనొరియా అంటే పొత్తికడుపులో ఎండోమెట్రియాసిస్ వంటి వ్యాధి కారణంగా వచ్చే బహిష్టు నొప్పి.

ప్రైమరీ డిస్మెనోరియ దాదాపు 90% మంది స్త్రీలలో కనిపిస్తూ వుంటుంది. ఈ నొప్పితీవ్రంగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి: చిన్న వయస్సులోనే రజస్వల అవ్వడం. ఎక్కువరోజులు బహిష్టు కావడం, పొగత్రాగడం, ఊబకాయం మరియు మద్యం సేవించడం. బహిష్టు నొప్పి అధికంగా ఉండడానికి బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు కూడా ఒక కారణం. పని పాటలకూ నొప్పికీ అంత సంబంధంలేదు. చాలా మంది అనుకొనేటట్లు పిల్లలు పుట్టాక బహిష్టు నొప్పి తగ్గుతుందనడం పూర్తిగా నిజంకాదు ఈ విషయాన్ని ఏ అధ్యయనాలు సమర్ధించలేదు.
సెకండరీ డిస్మెనొరియా ప్రోస్టగ్లాండిన్స్ అధికమ్వడం వలన, గర్భాశయం ఎక్కువగా ముడుచుకోవడంవలన లేక ఇతర వ్యాధుల వలన కానీ సంభవించవచ్చు.



ఎమెనోరియ (బహిష్టు రాకపోవడం)

ఎమెనోరియ (బహిష్టు రాకపోవడం) రెండు రకాలు. ప్రైమరి ఎమెనోరియ మరియు సెకండరీ ఎమెనోరియ ప్రైమరరీ ఎమెనోరియ అంటే స్త్రీలలో ఒక్కసారి కూడా బహిష్టు రాకపోవదం. సెకండరీ ఎమెనోరియ అంటే కనీసం ఆరు నెలల పాటు బహిష్టు రాకపోవదం. ఇది సాధారణంగా గర్భధారణ వల్ల వస్తుంది.



మెనోర్రాజియా (అధిక ఋతుస్రావం)

మెనోర్రాజియా అంటే అధికంగా లేక ఎక్కువ కాలం ఋతుస్రావం జరగడం. మెనోర్రాజియా ను హైపర్మెనోరియా అని కూడా అంటారు. చాలా అధికంగా అయ్యే రక్తస్రావాన్ని. లేక ఏడు రోజులు దాటి ఉండే రక్తస్రావాన్ని మాత్రమే మెనోర్రాజియా అంటారు. ఒక్కోసారి ఈ ఋతుస్రావం పెద్ద రక్తపు గడ్డలను కూడా కలిగి ఉండవచ్చు. సర్వ సాధారణంగా ఇది హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వలన కానీ గర్భసంచిలో ఏర్పడిన ఫైబ్రాయిడ్ల వలన కానీ సంభవిస్తుంది.



ఎండోమెట్రియల్ కాన్సర్

గర్భాశయపు లోపలి పొరకు వచ్చే కాన్సర్ ను ఎండోమెట్రియల్ కాన్సర్ అంటారు. సాధారణంగా ఎండోమెట్రియల్ కాన్సర్ ఉన్నప్పుడు యోని నుండి అసాధారణ రక్త స్రావం జరుగుతుంది. ఇది ప్రమాదకరమైనదే కానీ ప్రారంభ దశలో కనుగొన్నట్లైతే చాలా వరకు నయంచేయవచ్చు. యాభై ఏళ్ళు పైబడిన స్త్రీలలోనూ, प्रोప్రోజెస్టరోన్ స్థాయిలు అధికంగా గల స్త్రీలల్లోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది.



ఫైబ్రాయిడ్లు (గర్భాశయంలో గడ్డలు)

గర్భాశయపు కండరాలలో వచ్చే గడ్డలను ఫైబ్రాయిడ్లు అంటారు. ఇవి వివిధ పరిమాణాల్లో ఉంటాయి. చాలా చిన్నవిగా కానీ లేక చాలా పెద్దవి గా కానీ ఉండచ్చు . కొంతమంది స్త్రీలలో ఫైబ్రాయిడ్లు ఉన్నప్పటికీ పైకి ఏ విధమైన లక్షణాలూ కనిపించవు. తక్కిన మహిళల్లో రక్త స్రావం అధికంగానూ మామూలు కన్నా ఎక్కువ రోజులు ఉంటుంది. ఫైబ్రాయిడ్ల వలన పొత్తి కడుపు లోనూ, సంభోగ సమయంలోనూ నొప్పిగా ఉంటుంది. తరుచుగ మూత్రం వస్తున్నట్లంటుంది . పేగుల్లో ఒత్తిడి మరియు మలబధ్ధకం కలుగుతుంది. ముఫైఐదేళ్ళ వయస్సు పైబడిన స్త్రీలకు, ఎక్కువ కాన్పులు అయిన స్త్రీలకు ఫైబ్రాయిడ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.



పెల్విక్ ఇన్ఫ్లమ్మేటరీ డిసీజ్ (కటివలయ వాపు వ్యాధి)

స్త్రీ జననేంద్రియాలలో ఏదో ఒకభాగంలొ ఇన్ఫెక్షన్ రావడాన్ని పెల్విక్ ఇన్ఫ్లమ్మేటరీ డిసీజ్ (పి.ఐ.డి) అంటారు. యోని నుండి దుర్వాసనతో కూడిన ద్రవం స్రవించడంఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం. దీనితోబాటు నెలసరి క్రమంగా రాకపోవడం , సంభోగ సమయంలో నొప్పి కలగడం కూడా ఉంటాయి. సుఖ వ్యాధులు సోకడం పి.ఐ.డి. కి ప్రధానమైన కారణం. ఈ వ్యాధి ప్రమాదకరమైనది. ఫల్లోపియన్ ట్యూబులకు హాని చేసి ముందు ముందు గర్భధారణకి అవరోధం కలిగించ వచ్చు.



ప్రీమెనుస్ట్రల్ సిండ్రోమ్ ( ఋతు సమయం ముందు కనిపించే లక్షణాలు)

నెలసరి కి ఏడు నుంచి పధ్నాలుగు రోజులు ముందు నుంచీ కనిపించే లక్షణాలను ప్రీమెనుస్ట్రల్ సిండ్రోమ్ అంటారు. ఒక్కోసారి నెలసరి మొదలయ్యాక కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది స్త్రీలలో ఇది కనిపించినప్పటికీ దీని తీవ్రత కొంత మంది లో ఎక్కువగానూ, కొంత మందిలో తక్కువగానూ ఉంటుంది. ఈ ఋతు సమయంలో కొంతమంది స్త్రీలకి తీవ్రమైన కడుపు నొప్పి, ఉద్రేకం కలుగుతాయి.



ఋతు సంబంధ వ్యాధుల శీఘ్ర నిర్ధారణ

ఋతు సంబంధ వ్యాధులను నిర్ధారించడానికి డాక్టర్లు వరుసగా కొన్ని పరీక్ష లు జరిపించ వలసి ఉంటుంది - కటి వలయ పరీక్ష, రక్త పరీక్ష, అల్ట్రా సౌండ్ పరీక్షలు. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కనిపించిన లేక చాలా కాలం కనిపించని ఋతు సంబంధ సమస్యలు, తరువాత ఎప్పుడో కానీ, దీర్ఘ కాల సమస్యలుగా మారే వరకూ గుర్తించలేక పోవడానికి ఆస్కారం ఉంది.



ఋతు సంబంధ వ్యాధులను ఎలా నివారించాలి

ఋతు సంబంధ వ్యాధుల చికిత్స ఆ యా సమస్యలను బట్టి, ఎన్నాళ్ళుగా అది సమస్యగా ఉందో దాన్ని బట్టి ఉంటంది. చిన్న చిన్న సమస్యలకూ, ఆరు నెలల లోపుగా బాధిస్తున్న సమస్యలకు కూ డాక్ట ర్లు జీవన విధానంలో మార్పులను కానీ కొన్ని చిట్కాలను కానీ సూచిస్తారు.


  • క్రమం తప్పని వ్యాయామం
  • సమతుల్యమైన ఆహారం
  • ఆహారంలో ఇనుము, కాల్షియం, విటమిన్ బి అధికంగా ఉండేటట్లు చూసుకోవడం లేదా మందుల రూపం లో తీసుకోవడం
  • నొప్పి తగ్గడానికి పారాసిట్మాల్ మాత్ర పుచ్చుకోవడం
  • వేడి నీళ్ళ కాపడం

ఋతు సంబంధ సమస్యలు తీవ్రతరంగా ఉన్నా, దీర్ఘ కాలంగా బాధిస్తున్నా, డాక్టర్లు సమస్యను నయం చేయడానికి ఈ మందులను ఇస్తారు:

  • నొప్పి నయం చేయడానికి వాపును తగ్గించే మందులు
  • హార్మోన్లను తిరిగి తిరిగి సమకూర్చే చికిత్స
  • బహిష్టులను క్రమపరచడానికి బిళ్ళలు వాడడం

ఫైబ్రాయిడ్లు లేక కాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులున్నట్లు నిర్ధారణ ఐతే శస్త్రచిక్త్స అవసరం. ఐతే చాలావరకూ ఋతు సంబంధమైన సమస్యలు సాధారణంగా ఉండేవే. వాటి గురించి అంత ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఋతు చక్రాన్ని అనేకమైన విషయాలు ప్రభావితం చేయవచ్చు. బహిష్టు
అయిన కొత్తల్లో కనిపించే సమస్యలు కూడా శరీరం ఈ కొత్త మార్పులకు అలవాటు పడడం లో భాగమే. అయినప్పటికీ ఏదైనా సమస్య ఉంటే , అనగా ఎక్కువ రోజులు రక్త స్రావం జరుగుతున్నా, అధికంగా ఉన్నా, లేదా రక్తం గడ్డలుగా పడుతున్నా డాక్టర్ను సంప్రదించాలి.





Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: