సురక్షిత మైన మాతృత్వం.

 
కాన్పుకు మరో కాన్పుకు మధ్య వ్యవధి
సురక్షితమైన మాతృత్వం (అమ్మతనం)
శిశు అభివృద్ధి, లేత వయస్సులోనే అభ్యాసం
రొమ్ము పాలు (తల్లిపాలు)
పౌష్ఠిక ఆహారం పెరుగుదల
ఇమ్యునైజేషన్ (టీకాలు)
నీళ్ల విరోచనాలు (డయేరియా)
దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు
పరిశుభ్రత
మలేరియా
హెచ్.ఐ.వి. /ఎయిడ్స్
ప్రమాదాల / గాయాల నివారణ
విపత్తు అత్యవసరాలు
సంక్షిప్తంగా

సురక్షితమైన మాతృత్వం గురించి అందరూ తెలుసుకొని పాటించటం చాలా ముఖ్యం.

ఎందుకంటే గర్భధారణ, ప్రసవం కారణంగా తలెత్తిన సమస్యలతో రోజుకు కనీసం 1400 మంది మహిళలు మరణిస్తున్నారు. ఇంకా వేలాది మంది స్త్రీలు గర్భిణులుగా వున్నప్పుడు తలెత్తే సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు ఎక్కువగా ప్రాణాలకు ముప్పు తెచ్చేవి గానీ, తీవ్రమైన వైకల్యం కలిగించేవి గానీ అయి ఉంటున్నాయి.

గర్భధారణకు ముందే మహిళ చక్కని పోషకాహారం అలవాట్లు కలిగి, ఆరోగ్యంగా ఉన్నట్లయితే కడుపున శిశువును మోయటం వల్ల తలెత్తే ఆరోగ్య ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు. అయితే, ఆ మహిళ గర్భిణిగా ఉన్న ప్రతిసారి కనీసం 4 సార్లు శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త చేత పరీక్ష చేయించుకోవాలి. కాన్పులు చేయటం లో నైపుణ్యం గల వైద్యులు , నర్సులు సమీక్షంలోనే ప్రసవం జరగాలి. కాన్పు అయిన 12 గంటల లోపు ఆ మహిళ ను పరీక్షించాలి. శిశు జననం తర్వాత ఆరు నెలలకు మరోసారి ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించాలి.

మహిళలకు కాన్పు ముందు, ఆ తర్వాత అవసరమయ్యే ఆరోగ్య సేవా సదుపాయాలను అందుబాటులో ఉంచటం ప్రభుత్వానిదే బాధ్యత. ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి మహిళలకు ప్రసవం సమయంలో వారు సహాయపడేలా చూడొచ్చు.గర్భస్థ దశ, కాన్పు సమయాల్లో తీవ్రమైన సమస్య తలెత్తే అవకాశంగల మహిళలకు ప్రత్యేకమైన సంరక్షణతో పాటు పెద్దాస్పత్రిలో వైద్యం లభించేలా ఆరోగ్య కార్యకర్తలు చూడాలి.

మహిళలపై అన్ని రకాల వివక్షలను రూపు మాపే అంశంపై జరిగిన సదస్సులో అత్యధిక దేశాల ప్రబుత్వాలు ఒక అంతర్జాతీయ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. ఆ ఒప్పందంలో భాగంగా, గర్భిణీ మహిళలకు అవసరమైన అన్ని రకాల ఆరోగ్య సేవలను కల్పించటానికి ప్రభుత్వాలు చట్టబద్దంగా కట్టుబడి ఉండాలని ప్రకటించాయి.

ముఖ్య సందేశాలు

సురక్షిత మైన మాతృత్వం గురించి ప్రతి కుటుంబం సమాజం ఏయే అంశాలను తెలుసుకొనే హక్కు కలిగి ఉంటారు.

1.గర్భస్థ దశ, శిశు జననం కు సంబంధించి ఎదురుకో గల సమస్యల పై హెచ్చరిక సంకేతాలను అన్నీ కుంటుంబాలు గుర్తించ గలిగి ఉండటం చాలా ముఖ్యం సమస్య తలెత్తితే వెంటనే నిపుణుల సహాయం తీసుకోవటానికి తగిన ప్రణాళిక, వనరులతో సిద్ధంగా ఉండాలి.

2.కాన్పులు చేయటంలో నైపుణ్యంగల వైద్యులు, నర్సులు, లాంటి వారు గర్భస్ధ దశ మొత్తంలో ఆ మహిళను కనీసం నాలుగుసార్లు అయినా పరీక్ష చేయాలి. కాన్పు సురక్షితంగా జరగడానికి సహాయపడాలి.

3. గర్భిణీ స్త్రీలందరికీ మామూలు రోజుల్లో కన్నా ఎక్కువగా పోషకాహారం, విశ్రాంతి, ఎక్కువగా అవసరం.

4. పొగత్రాగటం, మద్యం, డ్రగ్స్, విషం, కలుషిత పదార్ధాలు గర్భిణీ స్త్రీలకు, శిశువులకు ఎక్కువగా హాని చేస్తాయి.

5. మహిళలను, పిల్లలను, శారీరకంగా బాధపెట్టడమనేది చాలా సమాజాల్లో తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. గర్భిణిగా వున్న మహిళను శారీరకంగా హింసపెడితే, అది ఆ మహిళకు, ఆమె కడుపులో ఉన్న పిండానికి చాలా ప్రమాదకరం.

6.బాల్యము, కౌమార దశలో చక్కని ఆహారం తీసుకొని ఆరోగ్యంతో ఉన్న చదువుకున్న అమ్మాయిలకు గర్భిణీ దశ, శిశు జనన సమయంలో సమస్యలు తక్కువగా ఉంటాయి.

7. ఆరోగ్య సంరక్షణ పై ప్రతి మహిళకూ, ముఖ్యంగా గర్భధారణ, శిశు జనన, అంశంలో హక్కు ఉంది. వీరికి ఆరోగ్య సేవలు అందించే వారు సాంకేతిక సామర్థ్యం కలిగి ఉండాలి. మహిళలను గౌరవ ప్రదంగా చూడాలి.



ముఖ్య సందేశాలకు సంబంధిత అదనపు సమాచారము:
1     3   4   5   6  7

  << వెనుకకు   ముందుకు >>

Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: