పౌష్ఠిక ఆహారం పెరుగుదల

 
కాన్పుకు మరో కాన్పుకు మధ్య వ్యవధి
సురక్షితమైన మాతృత్వం (అమ్మతనం)
శిశు అభివృద్ధి, లేత వయస్సులోనే అభ్యాసం
రొమ్ము పాలు (తల్లిపాలు)
పౌష్ఠిక ఆహారం పెరుగుదల
ఇమ్యునైజేషన్ (టీకాలు)
నీళ్ల విరోచనాలు (డయేరియా)
దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు
పరిశుభ్రత
మలేరియా
హెచ్.ఐ.వి. /ఎయిడ్స్
ప్రమాదాల / గాయాల నివారణ
విపత్తు అత్యవసరాలు
సంక్షిప్తంగా

పౌష్టిక ఆహారం మరియు పెరుగుదల గురించిన సమాచారం తెలుసుకొని పాఠించటం ఎందుకు ముఖ్యమంటే-----

ప్రస్తుతం శిశు మరణాల్లో సగానికి పైగా పోషకాహారం లోపం వల్లనే సంభవిస్తున్నాయి. పోషక లోపం (కుపోషణ) వల్ల శరీరంలో ప్రతిఘటన శక్తి నశిస్తుంది. తగిన ఆహారం లేక పోవటం, తరచూ అస్వస్థతకు గురవటం, శిశువు సంరక్షణను పట్టించుకోకపోవటం కుపోషణకి దారి తీస్తుంది.

మహిళ గర్భవతిగా ఉన్నపుడు కుపోషణకి గురైనా, రెండేళ్ల వయస్సు వరకు శిశువుకు పోషకాహారం లోపించినా, ఆ శిశువు శారీరక, మానసిక పెరుగుదల నెమ్మదిస్తుంది. ఆ శిశువు పెద్ద అయిన తర్వాత కూడా దీన్ని సరిచేయలేరు. కుపోషణ ప్రభావం ఆ శిశువు భవిష్యత్ జీవితం పై ఉంటుంది.

అనారోగ్యం నుంచి రక్షణపొంది , శారీరక మానసిక పెరుగుదలకు అవసరమైన సంరక్షణా పూరితమైన వాతావరణం, వసతులు పొందటానికి శిశువులకు అన్ని రకాల హక్కులున్నాయి.

ముఖ్య సందేశాలు :

పౌష్టికాహారం మరియు పెరుగుదలకు సంబంధించి ప్రతి కుటుంబం, సమాజం, ఏయే అంశాలను తెలుసుకొనే హక్కుకలిగి ఉంది.

  • నవ శిశువు రోజురోజుకీ బరువు పెంచుకుంటూ చక్కగా ఎదగాలి. పుట్టినప్పుటి నుంచి రెండేళ్ల వయస్సు దాకా శిశువు బరువును ప్రతినెలా చూడాలి. వరుసగా రెండు నెలల పాటు శిశువు బరువులో పెరుగుదల లేకపోతే, ఏదో లోపం ఉన్నట్లు భావించాలి.
  • ఆరునెలల వయస్సు వచ్చే వరకు శిశువుకు ఆహారమైనా పానీయమైనా కేవలం తల్లి రొమ్ము పాలు మాత్రమే అవసరమవుతాయి. ఆరునెలల నిండాక, తల్లి పాలతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలు శిశువుకు అవసరం.
  • ఆరునెలల నుంచి రెండేళ్ల వయస్సు వరకూ తల్లి పాలు కొనసాగిస్తూనే రోజుకు కనీసం ఐదుసార్లు శిశవుకు ఆహారం తినిపించాలి.
  • అనారోగ్యాన్ని ప్రతిఘటించటానికి, దృష్టిదోషాలను నివారించటానికి పిల్లలకు విటమిన్ - ఎ చాలా అవసరం. పండ్లు, కూరగాయలు, నూనెలు, గుడ్లు పాల ఉత్పత్తులు, తల్లిపాలు, బలపరచిన ఆహార పదార్థాలు, విటమిన్ - ఎ సప్లిమెంట్లలో విటమిన్ - ఎ సమృద్ధిగా ఉంటుంది.
  • పిల్లల శారీరక, మానసిక సామర్ధ్యాన్ని పరిరక్షించడానికి ఇనుము (ఐరన్) ధాతువు సమృద్ధిగా వున్న ఆహార పదార్థాలు అవసరం. కలేజా (కార్జము/లివరు) , లేత మాంసము, చేపలు, గుడ్లు, ఇనుముతో బలపరిచిన ఆహార పదార్ధాలు / సప్లిమెంట్లలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.
  • పిల్లల్లో నేర్చుకొనే సామర్ధ్యంలో పెరుగుదలలో జాప్యాలను నివారించటానికి అయొడైజ్ ఉప్పు అత్యంత అవసరం.
  • అస్వస్థత కాలంలో పిల్లలు క్రమం తప్పకుండా ఆహారాన్ని భుజిస్తుండాలి. అనారోగ్యం నుంచి కోలుకున్నాక కనీసం వారం రోజుల పాటు పిల్లలకు అధనంగా ఒక పూట భోజనం ఎక్కువగా పెట్టాలి.


ముఖ్య సందేశాలకు సంబంధిత అదనపు సమాచారము:
1    2   3   4   5   6   7

  <<వెనుకకు   ముందుకు>>

Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: