మలేరియా

 
కాన్పుకు మరో కాన్పుకు మధ్య వ్యవధి
సురక్షితమైన మాతృత్వం (అమ్మతనం)
శిశు అభివృద్ధి, లేత వయస్సులోనే అభ్యాసం
రొమ్ము పాలు (తల్లిపాలు)
పౌష్ఠిక ఆహారం పెరుగుదల
ఇమ్యునైజేషన్ (టీకాలు)
నీళ్ల విరోచనాలు (డయేరియా)
దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు
పరిశుభ్రత
మలేరియా
హెచ్.ఐ.వి. /ఎయిడ్స్
ప్రమాదాల / గాయాల నివారణ
విపత్తు అత్యవసరాలు
సంక్షిప్తంగా

మలేరియా గురించిన సమాచారాన్ని తెలుసుకొని, పాటించటం ఎందుకు ముఖ్యం అంటే..........

దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే మలేరియా వ్యాధి చాలా తీవ్రమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 30 కోట్లు నుంచి 50 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. వీరిలో పది లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. మలేరియా అనేది సామాన్యమైన ప్రాంతాల్లో అక్కడ సంభవించే మరణాల్లో అత్యధిక వాటికి మూల కారణం ఈ వ్యాధే కావటం గమనార్హం. అంతేగాక, చిన్న పిల్లల పెరుగుదల ను కూడా ఈ వ్యాధి దెబ్బతీస్తుంది.

మలేరియా ముఖ్యంగా గర్భణీ మహిళలకు చాలా ప్రమాదకరం. ఇది రక్తహీనత, గర్భస్రావం, మృత శిశు జననం, పుట్టుకతో శిశువు బరువు లోపం, మాతృ మరణాలకు దారి తీస్తుంది. మలేరియాను నివారించటం మరియు సకాలంలో చికిత్స చేయటం వల్ల అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చు.

ముఖ్య సందేశాలు :

మలేరియా గురించి ప్రతి కుటుంబం, సమాజం ఏమేం తెలుసుకొనే హక్కు కలిగి ఉన్నాయి.

  1. దోమకాటు ద్వారా మలేరియా ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది. కీటక సంహారిణి మందు రుద్దిన, దోమ తెర కింద నిద్రించడం ద్వారా దోమ కాట్లను నివారించవచ్చు.
  2. మలేరియా సాధారణంగా మారిన ప్రాంతాల్లో, పిల్లలకు చాలా అపాయం ఉంటుంది. జ్వరంతో ఉన్న పిల్లలను శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త చేత పరీక్షింప జేసి వెంటనే యాంటీ- మలేరియా చికిత్సను ప్రారంభించాలి.
  3. గర్భిణీ స్త్రీలకు మలేరియా చాలా ప్రమాదకరం. మలేరియా సాధారణంగా మారిపోయిన ప్రాంతాల్లో గర్భిణీ మహిళలు ఆరోగ్య కార్యకర్త సూచన మేరకు యాంటీ- మలేరియల్ మాత్రలు మింగాలి.
  4. మలేరియాతో బాధపడుతున్న లేదా ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న పిల్లలకు పుష్కలమైన ద్రవ పదార్ధాలు, ఆహారం ఇవ్వటం అవసరం.
  5. కుటుంబాలు, ఊరు - వాడు అంతా కలిసి దోమలు గుడ్లు పెట్టకుండా తగిన చర్యలు తీసుకుంటే మలేరియాను నివారించవచ్చు.


ముఖ్య సందేశాలకు సంబంధిత అదనపు సమాచారము:  2   3   4   5

  <<వెనుకకు   ముందుకు>>

Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: