|
గాయాల నివారణ గురించిన సమాచారాన్ని అందరూ పంచుకొని, ఆచరించటం ఎందుకు
ముఖ్యమంటే....
గాయాల కారణంగా ప్రతి ఏటా సుమారు 75 వేల మంది పిల్లలు మరణిస్తున్నారు.
మరో 40 కోట్ల మంది తీవ్రంగా బాధపడుతున్నారు.... అనేక గాయాలు శాశ్వతమైన
అంగవైకల్యానికి, మెదడు దెబ్బ తినడానికి దారి తీస్తాయి. చిన్న పిల్ల
మరణానికి, అంగవైకల్యానికి గాయాలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి.
సాధారణంగా గాయాలు ఎక్కువగా కింద పడటం, కాలటం, నీటిలో మునగటం ఇంకా
రోడ్డు ప్రమాదాల వల్ల అవుతాయి. వీటిలో ఎక్కువగా ఇంట్లోగానీ, ఇంటికి దగ్గర
గానీ సంభవిస్తాయి. దాదాపు వీటన్నింటినీ నిరోధించవచ్చు. గాయం అయిన వెంటనే
ఏం చేయాలి అనేది తల్లిదండ్రులకు తెలిస్తే, అనేక గాయాల తీవ్రతను
తగ్గించవచ్చు.
-
|
గాయాల నివారణ గురుంచి తెలుసుకోవటానికి ప్రతి కుటుంబం / సమాజం ఏయే
హక్కులు కలిగి ఉన్నాయి.
- తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్న పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ,
పరికరాలను సురక్షితంగా ఉంచినట్లయితే, అనేక తీవ్రమైన గాయాలను
నివారించవచ్చు.
- మంట, వంటింటి స్టౌ, దీపాలు, అగ్గి పెట్టెలు, విద్యుత్ పరికరాల నుంచి
చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి.
- చిన్నపిల్లలు ఎక్కటానికి ఇష్టపడతారు. కనుక, మెట్లు, బాల్కనీలు, రూఫ్
(పైకప్పు), కిటికీలు, ఆట ప్రదేశాలను చిన్న పిల్లలు కింద పడకుండా
సురక్షితంగా తీర్చిదిద్దాలి.
- చాకులు, కత్తెరలు, పదునైన లేదా వాడియైన వస్తువులు, పగిలిన గాజు
ముక్కలు గాయాలు చేయగలవు. ఇలాంటి వస్తువులను చిన్న పిల్లలకు అందకుండా,
వారికి దూరంగా ఉంచాలి.
- చిన్న పిల్లలు వస్తువులను నోట్లో పెట్టుకోవటానికి ఇష్టపడతారు. కనుక,
చిన్న సైజు వస్తువులను పిల్లలు మింగకుండా నిరోధించటానికి వాటిని దూరంగా
పెట్టాలి.
- విషము, బ్లీచ్ ద్రవం, ఔషధాలు, యాసిడ్, కిరోసిన్ లాంటి ఇంధనాలను నీటి
బాటిళ్లల్లో నిల్వ చేయరాదు. ఇలాంటి ద్రవాలను, విషపదార్థాలను సూచిస్తూ
స్పష్టంగా ముద్రించి వున్న కంటెయినర్లలోనే ఉంచి, వాటిని చిన్న పిల్లలకు
అందకుండా వారి దృష్టిలో పడకుండా పెట్టాలి.
- చిన్నపిల్లలు రెండు నిముషాల వ్యవధిలోనే అతి కొద్దిగా నీళ్ళు
ఉన్నప్పుటికీ మునిగిపోగలరు. వారు నీటిలో లేదా నీటికి దగ్గరగా ఉన్నప్పుడు
ఒంటరిగా వదలరాదు.
- చిన్నపిల్లలు ముఖ్యంగా ఐదేళ్ల లోపు వారికి రోడ్డుపైన ఉంటే తీవ్ర అపాయం
పొంచి ఉంటుంది. రోడ్డుపైన వారికి తోడుగా ఎల్లవేళలా ఒకరు ఉండాలి.
చిన్నపిల్లలు నడవటం నేర్చుకున్న వెంటనే రోడ్డుపై సురక్షితంగా ఎలా నడవాలో
బోధించాలి.
|
|
ముఖ్య సందేశాలకు సంబంధిత అదనపు సమాచారము: 1
2
3
4
5
6
7
8
|