ఇమ్యునైజేషన్ (టీకాలు)

 
కాన్పుకు మరో కాన్పుకు మధ్య వ్యవధి
సురక్షితమైన మాతృత్వం (అమ్మతనం)
శిశు అభివృద్ధి, లేత వయస్సులోనే అభ్యాసం
రొమ్ము పాలు (తల్లిపాలు)
పౌష్ఠిక ఆహారం పెరుగుదల
ఇమ్యునైజేషన్ (టీకాలు)
నీళ్ల విరోచనాలు (డయేరియా)
దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు
పరిశుభ్రత
మలేరియా
హెచ్.ఐ.వి. /ఎయిడ్స్
ప్రమాదాల / గాయాల నివారణ
విపత్తు అత్యవసరాలు
సంక్షిప్తంగా

ఇమ్యూనైజేషన్ (రోగ నిరోధక టీకా మందులు) అనే అంశంపై సమాచారాన్ని తెలుసుకొని, పాటించటం ఎందుకు ముఖ్యమంటే .......................

అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లతో నివారించదగిన వ్యాధుల కారణంగా, ప్రతి సంవత్సరం 1.7 మిలియన్ల మంది పిల్లలు మరణిస్తున్నారు. అంగవైకల్యానికి, కొన్నిసార్లు, మరణానికి సైతం దారితీసే ప్రమాదకరమైన ఈ వ్యాధుల నుండి వ్యాక్సిన్ లు తీసుకొన్న పిల్లలు మాత్రం రక్షణ పొందుతున్నారు. ఈ రక్షణ పొందటానికి ప్రతి బాలుడు / బాలిక హక్కు కలిగి ఉన్నారు.

ప్రతి బాలిక, బాలుడు ఇమ్యూనైజ్ కావలసిన అవసరం ఉంది. గర్భవతి అయిన ప్రతి మహిళ కూడా తనకు, పుట్టబోయే తన శిశువును టెటనస్ వ్యాధి నుంచి రక్షించుకోవటానికి ఇమ్యూనైజ్ కావాలి.

ప్రతి తల్లిదండ్రులకు తమ శిశువుకు ఏయే రకాల ఇమ్యూనైజేషన్ ఇవ్వాలి. వాటిని ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఎన్నిసార్లు ఇవ్వాలి. అనే విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండటం చాలా అవసరం. అంతేగాక, తమ బిడ్డ అనారోగ్యంతో లేదా అంగవైకల్యంతో ఉన్నా లేదా పోషక లోపంతో బాధపడుతున్నా ఇమ్యూనైజ్ చేయటం చాలా సురక్షితమనే విషయం కూడా ప్రతి తల్లిదండ్రులకు తెలిసి ఉండటం అవసరం.

ముఖ్య సందేశాలు

ఇమ్యూనైజేషన్ గురించి తెలుసుకోవటం ప్రతి కుటుంబం, సమాజం ఏయే హక్కులు కలిగి ఉన్నాయి.

  1. ఇమ్యూనైజేషన్ అనేది వెంటనే (అర్జెంట్ గా) చేయవలసిన పని. ప్రతి శిశువుకు మొదటి ఏడాదిలో వరుసగా ఇమ్యూనైజేషన్ (టీకా మందులు) ఇవ్వాల్సిన అవసరం ఉంది.
  2. పలు రకాల ప్రమాదకరమైన వ్యాధుల నుంచి ఇమ్యూనైజేషన్ రక్షిస్తుంది. ఇమ్యూనైజ్ చేయని పిల్లలు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక, శాశ్వత, అంగవైకల్యం లేదా లోపపోషణకు గురై మరణించే ప్రమాదం కూడా ఉంది.
  3. స్వల్ప అస్వస్థత, అంగవైకల్యం లేదా లోపపోషణతో ఉన్న పిల్లలను ఇమ్యూనైజ్ చేయటం సురక్షితం.
  4. గర్భిణీ మహిళలందరూ టెటనస్ వ్యాధి నుంచి రక్షణ పొందటం అవసరం. ఈ వ్యాధికి మహిళ, గతంలో ఇమ్యూనైజ్ చేయించినప్పటికీ, గర్భం ధరించిన తర్వాత అదనంగా మరోసారి టెట్నస్ టాక్సైడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనిపై సలహా పొందటానికి లేదా టెట్నస్ టాక్సైడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలి.
  5. టీకా మందు తీసుకోవటానికి ప్రతి ఒక్కరూ సరికొత్త సూది (నీడిల్) లేదా స్టెరైల్ (నీటిలో మరగబెట్టిన) సూదిని మరియు సరికొత్త సిరంజీని తప్పకుండా ఉపయోగించాలి. దీనిపై ప్రజలు ఖచ్చితంగా ఉండాలి.
  6. ప్రజలు గుంపుగా చేరిన సందర్భంలో వ్యాధి తొందరగా వ్యాపిస్తుంది. ఇరుకైన పరిసరాల్లో నివసించే పిల్లలు ముఖ్యంగా శరణార్థులు, విపత్తు బాధితుల శిబిరాల్లో ఉండేవారు వెంటనే టీకా మందులు తీసుకోవాలి. ముఖ్యంగా మీజిల్స్ వ్యాధి నుంచి రక్షణకు ఇమ్యూనైజ్ చేయించాలి.


ముఖ్య సందేశాలకు సంబంధిత అదనపు సమాచారము: 1    2   3   4   5   6

  <<వెనుకకు   ముందుకు>>

Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: