పరిశుభ్రత
|
|
పరిశుభ్రత అనే అంశంపై సమాచారం తెలుసుకొని, పాటించటం ఎందుకు ముఖ్యమంటే------- చిన్నపిల్లలకు వచ్చే అనారోగ్యాలు, మరణాల్లో సగానికి పైగా వారు క్రిమి కీటకాలను మింగటం వల్లనే వస్తున్నాయి. ఈ క్రిమి కీటకాలు వారి నోటి నుంచి ఆహారం లేదా నీరు లేదా మురికి చేతుల ద్వారా వారి కడుపులోకి వెళతాయి. ఈ క్రిమికీటకాల్లో ఎక్కువ శాతం మానవ, జంతు మలం నుంచి వస్తాయి. చాలా అనారోగ్యానికి, ముఖ్యంగా డయేరియా (నీళ్ల విరేచనాలు) ను చక్కని పరిశుభ్రమైన అలవాట్లతో నివారించవచ్చు. మలాన్ని మరుగుదొడ్డి (టాయిలెట్ / ల్యాట్రిన్) లోనే వేయటం, మల విసర్జన తర్వాత లేదా పిల్లల మలాన్ని తాకిన తర్వాత తర్వాత చేతులను సబ్బుగానీ బూడిదతో గానీ బాగా రుద్ది నీటితో శుభ్రంగా కడుక్కోవటం. పిల్లలకు ఆహారం తినిపించే ముందు లేదా ఆహారాన్ని ముట్టుకునే ముందు కూడా ఇదే విధంగా చేతులను బాగా కడుక్కోవటం. జంతువుల మలాన్ని ఇంటికి దూరంగా నడిచే బాటకు, బావులు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలకు దూరంగా తొలగించాలి. ఊరు, వాడలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసే మరుగుదొడ్లు నిర్మించి , ఉపయోగించాలి. నీటి వనరులను కాపాడుకోవాలి. వృధా నీటిని, చెత్తా చెదారాన్ని సురక్షితంగా తొలగించాలి. ప్రజలు తక్కువ ఖర్చుతో మరుగుదొడ్లు నిర్మించుకొనే సౌకర్యాల గురించి తెలియజెప్పటం ప్రభుత్వ బాధ్యత. పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, మెరుగైన మంచి నీటి సరఫరా, చెత్తను పోగుచేయటం లాంటి పనులకు ప్రభుత్వ సహాయం అవసరం.
|
||
| <<వెనుకకు ముందుకు>> |


