|
“డయేరియా ” గురించిన సమాచారాన్ని తెలుసుకొని, దాన్ని ఆచరించటం
ఎందుకు ముఖ్యమంటే ..............
డీహైడ్రేషన్ (శరీరంలోని నీరు తొలగిపోవటం) మరియు కుపోషణ కలిగించే
డయేరియా ప్రతి ఏడాది పది లక్షల కన్నా ఎక్కువ మంది పిల్లలను చంపివేస్తోంది.
డయేరియా తో పెద్దల కన్నా పిల్లలు తొందరగా మరణించే అవకాశం ఉంది. ఎందుకంటే,
వారు తొందరగా డీహైడ్రేట్ అవుతారు. డయేరియా కు గురైన ప్రతి 200 మంది
పిల్లల్లో ఒకరు మరణిస్తారు.
కీటకాలను, ముఖ్యంగా మలం నుంచి వచ్చే కీటకాలను మింగటం వల్ల డయేరియా కు
గురవుతారు. విసర్జించిన మలాన్ని సురక్షితంగా తొలగించకపోవటం వల్ల,
అపరిశుభ్రమైన అలవాట్లతో, పరిశుద్ధమైన మంచినీరు లేకపోవటం లేదా శిశువులకు
రొమ్ముపాలు ఇవ్వకపోవటం వల్ల ఎక్కువగా (తరచూ) డయేరియా వస్తుంది. కేవలం
రొమ్ముపాలు మాత్రమే తాగే పిల్లలకు చాలా అరుదుగా డయేరియా వస్తుంది.
ప్రభుత్వ సహాయంతో సంఘము - ప్రతి కుటుంబమూ స్వచ్ఛంద సంస్థలు కలిసి
పనిచేయటం ద్వారా డయేరియా కలిగించే పరిస్థితులను నివారించవచ్చు.
-
|
డయేరియా (నీళ్ల విరేచనాలు) గురించి ప్రతి కుటుంబం, సమాజం ఏమేం
తెలుసుకోవలసిన హక్కు కలిగి ఉంది.
- డయేరియా పిల్లల శరీరంలోని నీటినంతా తోడివేసి (అంటే డీ-హైడ్రేట్ చేసి)
పిల్లలను చంపుతుంది. విరేచనాలు మొదలైన వెంటనే పిల్లలకు అదనంగా వీలైనంత
ఎక్కువగా పిల్లలకు ద్రవ పదార్థాలు ఇవ్వాలి.
- పిల్లల విరేచనాలు నీళ్లలాగా ఉంటే లేదా వారి మలంలో రక్తం పడితే ఆ
పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఉన్నట్లు భావించాలి. శిక్షణ పొందిన ఆరోగ్య
కార్యకర్త సహాయాన్ని వెంటనే తీసుకోవాలి.
- శిశువుకు రొమ్ముపాలు మాత్రమే ఇస్తున్నట్లయితే, డయేరియా తీవ్రతను
తగ్గించవచ్చు. మాటిమాటికీ రాకుండా చూడొచ్చు.
- డయేరియా గురైన పిల్లలు ఆహారం తినటాన్ని క్రమం తప్పకుండా కొనసాగించాలి.
నీళ్ల విరేచనాల నుంచి కోలుకుంటున్నప్పుడు, పిల్లలకు రెండు వారాల వరకైనా
ప్రతి రోజు కనీసం ఒక పూట భోజనం ఎక్కువగా (అదనంగా) తినిపించాలి.
- డయేరియా తో పిల్లలు ఒకవేళ తీవ్రంగా లేదా నిరంతరంగా డీహైడ్రైట్
అయినట్లయితే, కేవలం నోటి ద్వారా ఇచ్చే రీ-డీహైడ్రేట్ ద్రవాన్ని గానీ,
ఆరోగ్య కార్యకర్త సూచించిన ఔషధాలను గానీ ఇవ్వాలి. డయేరియా కు సంబంధించిన
ఇతర మందులు సాధారణంగా ప్రభావం చూపవు. పైగా పిల్లలకు హాని చేస్తాయి.
- డయేరియా ను నివారించాలంటే, మల పదార్థాలను మరుగుదొడ్డి (లెట్రిన్)
ద్వారా తొలగించాలి లేదా పూడ్చి పెట్టాలి.
- చక్కని పరిశుభ్రమైన అనవాట్లు డయేరియా ను నుంచి కాపాడతాయి. మల విసర్జన
తర్వాత, వాటిని తాకిన తర్వాత చేతులను సబ్బు / బూడిద తో శుభ్రంగా నీటితో
కడుక్కోవాలి. ఆహార పదార్దాలను శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఆహార
పదార్థాలను ముట్టుకొనే ముందు లేదా పిల్లలకు తినిపించే ముందు కూడా చేతులను
శుభ్రంగా కడుక్కోవాలి.
|
|
ముఖ్య సందేశాలకు సంబంధిత అదనపు సమాచారము:
1
2
3
4
5
6
7
|