ముఖ్య సందేశం - 3

 
కాన్పుకు మరో కాన్పుకు మధ్య వ్యవధి
సురక్షితమైన మాతృత్వం (అమ్మతనం)
శిశు అభివృద్ధి, లేత వయస్సులోనే అభ్యాసం
రొమ్ము పాలు (తల్లిపాలు)
పౌష్ఠిక ఆహారం పెరుగుదల
ఇమ్యునైజేషన్ (టీకాలు)
నీళ్ల విరోచనాలు (డయేరియా)
దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు
పరిశుభ్రత
మలేరియా
హెచ్.ఐ.వి. /ఎయిడ్స్
ప్రమాదాల / గాయాల నివారణ
విపత్తు అత్యవసరాలు
సంక్షిప్తంగా

న్యూమోనియా వ్యాధిని నివారించటానికి శిశువుకు మొదటి 6 నెలలు పాటు రొమ్ముపాలు మాత్రమే ఇవ్వాలి. పిల్లలందరికీ పుష్ఠికరంగా ఉండడంతోపాటు అన్ని రకాల టీకా మందులను ఇవ్వటం ద్వారా కుటుంబ పెద్దలు న్యూమోనియా వ్యాధి రాకుండా సహాయ పడవచ్చు. న్యూమోనియా, ఇంకా ఇతర వ్యాధులు రాకుండా తల్లి రొమ్ముపాలు శిశువును కాపాడతాయి. శిశువుకు మొదటి ఆరునెలలు పాటు కేవలం రొమ్ముపాలు మాత్రమే ఇవ్వాలనేది చాలా ముఖ్యం.

రొమ్ముపాలు చక్కగా తాగిన పిల్లలు ఏ వయస్సులో నైనా సరే తీవ్రమైన అనారోగ్యానికి గానీ మృత్యువుకు గానీ, గురయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.

తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, ఇతర అనారోగ్యాల నుంచి కాపాడి, త్వరగా కోలుకోవటానికి విటమిన్-ఎ తోడ్పడుతుంది. రొమ్ముపాలు, కార్జము (కలేజా), ఎర్ర పామాయిల్, చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, నారింజ మరియు పసుపు రంగు పండ్లు, కూరగాయలు ఇంకా ఆకుకూరల్లో విటమిన్ -ఎ ఉంటుంది. విటమిన్ -ఎ ద్రవం ఆరోగ్య కార్యకర్త వద్ద అందుబాటులో ఉంటుంది. శిశువు ఏడాది వయస్సు పూర్తి చేయకముందే టీకా మందులు ఇప్పించాలి. అప్పుడే ఆ శిశువు మీజిల్స్ నుంచి రక్షణ పొందుతారు. మీజిల్స్ వ్యాధి న్యూమోనియా సహా ఇతర శ్వాస కోశ వ్యాదులకు, కోరింత దగ్గు, టి.బి.కి. దారితీయగలదు.

ముఖ్య సందేశాలకు సంబంధిత అదనపు సమాచారము: 1   2   3   4   5

  <<వెనుకకు   ముందుకు>>

Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: