ముఖ్య సందేశం - 2

 
కాన్పుకు మరో కాన్పుకు మధ్య వ్యవధి
సురక్షితమైన మాతృత్వం (అమ్మతనం)
శిశు అభివృద్ధి, లేత వయస్సులోనే అభ్యాసం
రొమ్ము పాలు (తల్లిపాలు)
పౌష్ఠిక ఆహారం పెరుగుదల
ఇమ్యునైజేషన్ (టీకాలు)
నీళ్ల విరోచనాలు (డయేరియా)
దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు
పరిశుభ్రత
మలేరియా
హెచ్.ఐ.వి. /ఎయిడ్స్
ప్రమాదాల / గాయాల నివారణ
విపత్తు అత్యవసరాలు
సంక్షిప్తంగా

కొన్నిసార్లు జలుబు మరియు దగ్గు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతాలుగా ఉంటాయి. వేగంగా లేదా అతి కష్టం మీద శ్వాస తీసుకునే పిల్లలకు ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిన న్యూమోనియా వ్యాధి వచ్చి ఉండవచ్చు. ఇది ప్రాణాలకు అపాయం కలిగించే వ్యాధి. ఇలాంటి పిల్లలకు వెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించటం అవసరం.

దగ్గు, జలుబు, పులిసిన గొంతు, నీళ్లు కారేముక్కు చాలా వరకు ఎలాంటి ఔషధాలు లేకుండానే తగ్గిపోతాయి. కాని, కొన్నిసార్లు ఈ లక్షణాలు న్యూమోనియాను సంకేతాలుగా ఉంటాయి. ఇందుకు యాంటీ-బయోటిక్స్ మందులు అవసరం.

న్యూమోనియా చికిత్సకు ఆరోగ్య కార్యకర్త యాంటీ-బయోటిక్స్ మందు ఇచ్చినట్లయితే, ఆ సూచనలను తు.చ తప్పక పాటించి, పిల్లలు కోలుకున్నట్లు కనిపించినప్పటికీ, నిర్దేశించిన పూర్తికాలం పాటు మందులు ఇస్తునే ఉండాలి.

చాలా మంది పిల్లలు న్యూమోనియా కారణంగా ఇంటివద్దనే మరణిస్తారు. వారి సంరక్షకులు ఈ వ్యాధి చేయగల హానిని గుర్తించనందుకే ఈ ఘోరం వాటిల్లుతోంది. న్యూమోనియా కారణంగా లక్షలాది మంది పిల్లలకు వాటిల్లే మృత్యువును ఈ క్రింది సూచనలను పాటించి తప్పించవచ్చు.

వేగంగా లేదా అతి కష్టం మీద శ్వాస తీసుకోవటమనేది అపాయానికి సంకేతంగా తల్లిదండ్రులు, సంరక్షకులు గుర్తించి, వెనువెంటనే (అర్జంటుగా) వైద్య సహాయం పొందాలి.

  • ఈ వైద్య సహాయం ఎక్కడ లభించగలదో తల్లిదండ్రులు సంరక్షకులకు తెలిసి ఉండాలి.
  • వైద్యం సహాయం, తక్కువ ధరకే యాంటీ-బయాటిక్ మందులు రెడీగా అందుబాటులో ఉంటాయి.

ఈ క్రింద పేర్కొన్న వాటిల్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా పిల్లలను వెంటనే వైద్యశాలకు గానీ, ఆరోగ్య కార్యకర్త వద్దకు గానీ తీసుకెళ్లాలి.

  • మామూలు కన్నా వేగంగా పిల్లలు శ్వాస తీసుకోవటం 2 నుంచి 12 నెలలు శిశువు నిముషానికి 50 లేదా అంత కన్నా ఎక్కువ సార్లు, ఏడాది నుంచి ఐదేళ్ల పిల్లలు నిముషానికి 40 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు శ్వాస తీసుకోవటం సాధారణం.
  • పిల్లలు అతికష్టం మీద శ్వాస తీసుకోవటం లేదా ఎగ ఊపిరి తీసుకోవటం.
  • ఊపిరి పీల్చినప్పుడు శిశువు ఛాతీ కింద భాగం లోతుకుపోవటం లేదా కడుపు కిందికి - పైకి తన్నుకున్నట్లు కనిపించటం.
  • రెండు వారాల కన్నా ఎక్కువ కాలం పాటు పిల్లలు దగ్గుతుండటం.
  • శిశువు రొమ్ముపాలు గానీ ఇతర పానీయాలు గానీ త్రాగలేకపోవటం.
  • పిల్లలు తరచుగా వాంతులు చేసుకోవటం.

ముఖ్య సందేశాలకు సంబంధిత అదనపు సమాచారము: 1   2   3   4   5

  <<వెనుకకు   ముందుకు>>

Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: