Document Actions


దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు

 
కాన్పుకు మరో కాన్పుకు మధ్య వ్యవధి
సురక్షితమైన మాతృత్వం (అమ్మతనం)
శిశు అభివృద్ధి, లేత వయస్సులోనే అభ్యాసం
రొమ్ము పాలు (తల్లిపాలు)
పౌష్ఠిక ఆహారం పెరుగుదల
ఇమ్యునైజేషన్ (టీకాలు)
నీళ్ల విరోచనాలు (డయేరియా)
దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు
పరిశుభ్రత
మలేరియా
హెచ్.ఐ.వి. /ఎయిడ్స్
ప్రమాదాల / గాయాల నివారణ
విపత్తు అత్యవసరాలు
సంక్షిప్తంగా

దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన (ఆందోళనకరమైన) అనారోగ్యాలు అనే అంశంపై సమాచారాన్ని తెలుసుకొని, పాటించటం ఎందుకు ముఖ్యమంటే--

దగ్గు, జలుబు, గొంతు నొప్పి మరియు నీళ్లుకారే ముక్కు పిల్లల జీవితాల్లో అతి సాధారణంగా సంభవించే వ్యాధులు. వీటివల్ల పెద్ద అపాయమేమి ఉండదు.

కాని, కొన్ని కేసుల్లో, దగ్గు, జలుబు అనేవి న్యూమోనియా లేదా ట్యూబర్ క్యులేసిస్ (టి.బి) లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు ముందస్తు హెచ్చరిక సంకేతాలుగా ఉంటాయి. శ్వాస సంబంధమైన ఇన్ ఫెక్షన్లు 2000 వ సంవత్సరంలో ఐదేళ్లలోపు వయస్సు పిల్లలను సుమారు 20 లక్షల మంది పొట్టన బెట్టుకున్నాయి.

ముఖ్య సందేశాలు :

దగ్గు, జలుబు, ఇంకా తీవ్రమైన అనారోగ్యాల గురించి ప్రతి కుటుంబం, సమాజం, ఏమేం తెలుసుకొనే హక్కు కలిగి ఉన్నాయి.

  1. దగ్గు, జలుబుతో ఉన్న పిల్లలను వెచ్చగా ఉంచాలి. వారు ఎంత వీలైతే అంత ఎక్కువగా తినడానికి, త్రాగటానికి ప్రోత్సహించాలి.
  2. కొన్నిసార్లు, జలుబు మరియు దగ్గు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతాలుగా ఉంటాయి. వేగంగా లేదా అతి కష్టం మీద శ్వాస తీసుకునే పిల్లలకు ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిన న్యూమోనియా వ్యాధి వచ్చి ఉండవచ్చు. ఇది ప్రాణాలకు అపాయం కలిగించే వ్యాధి. ఇలాంటి పిల్లలకు వెంటనే ఆస్పత్రిలో చికిత్స చేయించటం చాలా అవసరం.
  3. న్యూమోనియా వ్యాధిని నివారించటానికి శిశువుకు మొదటి ఆరునెలలు పాటు కేవలం రొమ్ముపాలు మాత్రమే ఇవ్వాలి. పిల్లలందరినీ పుష్టికరంగా ఉంచటంతో పాటు అన్ని రకాల టీకా మందులు ఇవ్వటం ద్వారా కుటుంబ పెద్దలు న్యూమోనియా వ్యాధి రాకుండా సహాయపడవచ్చు.
  4. గరుకుగా దగ్గే పిల్లలకు వెంటనే వైద్య సహాయం అవసరం. ఇలాంటి పిల్లలకు ట్యూబర్ క్యులోసిస్ (టి.బి.) వ్యాధి ఉండవచ్చు. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ కలగటం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
  5. పొగాకు లేదా వంటింటి నుంచి వచ్చే పొగకు దగ్గరగా ఉన్న పిల్లలు, గర్భవతులకు ఎక్కువగా అపాయం పొంచి ఉంటుంది.


ముఖ్య సందేశాలకు సంబంధిత అదనపు సమాచారము1   2   3   4   5

  <<వెనుకకు   ముందుకు>>

Powered by Plone CMS, the Open Source Content Management System

ఈ సైట్ ప్రమాణాలకు తగినట్లుగా ఉంది