Document Actions


దీర్ఝకాలికంగా మూత్రపిండాలు పనిచేయకపోవడం

మూత్రపిండాలు నిర్వహించే విధులను క్రమేణా, దీర్ఝకాలికంగా నిర్వహించ లేక పోవడాన్ని దీర్ఝకాలికంగా  మూత్రపిండాలు పనిచేయకపోవడం అంటారు. దీనినే కిడ్నీఫెల్యూర్ అని, సి.ఆర్.ఎఫ్ అని కూడా అంటారు.

రక్తములోని వ్యర్ధ పదార్ధాలను వడకట్టలేక పోయినపుడు, మూత్రం ద్వారా సరిగా విసర్జించ లేక పోయినపుడు, శరీరంలో ఉప్పును మరియు నీటిని తగు పాళ్ళలో సమం చేయలేకపోయినప్పుడు, శరీరంలో రక్త పోటును క్రమబద్దీకరించ లేకపోయినప్పుడు, మూత్రపిండాలు పనిచేయడం లేదని - దీనినే మూత్రపిండాలు పనిచేయకపోవడం - కిడ్నీఫెల్యూర్ అని అంటారు. కిడ్నీలు సాధారణ స్ధితికి రాలేనంతగా చెడిపోతాయి.

కారణాలు

1.మూత్రపిండాలకు వచ్చే దీర్ఝకాలిక వ్యాధుల వలన క్రమేణా మూత్రపిండాలు పనిచేయకుంటే
    చెడిపోతాయి.
2. దీర్ఝకాలిక అధిక రక్త పోటు
3. మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవారు
4. మూత్రపిండాలలో రాళ్ళు, గడ్డలు,  ప్రోస్టేట్ గ్రంధి పెద్దది కావడం వలన  మూత్ర ప్రవాహానికి ఆటంకం
    కలిగించి దీర్ఝకాలిక వ్యాధులు  కలుగుతాయి. వీటి వలన కూడా మూత్రపిండాలు  పనిచేయ
    లేకపోతాయి.
5. అనేక సంవత్సరాలుగా నొప్పి తగ్గించే మందులు వాడుతున్నా,ఆయుర్వేదం, యునానీ మందులలో
    ఉపయోగించే లోహ సంబంధ భస్మాలను ఎక్కువగా తీసుకొంటున్నా, డాక్టరు సలహా లేకుండా   
   యాంటిబయాటిక్స్ ని వాడటం లాంటివి చేస్తున్నా కూడా  కిడ్నీఫెల్యూర్ సంభవించడానికి అవకాశం
   ఉంది.  



లక్షణాలు
  1. కారణము తెలియకుండా బరువు తగ్గడం, ఆకలి మందగించడం,
  2. వాంతులు వచ్చునట్లు అనుభూతి
  3. వాంతులు రావడం
  4. తలనొప్పి, నీరసం, మాటిమాటికి ఎక్కిళ్ళు రావడం,
  5. కాళ్ళు, ముఖం వాపు
  6. మూత్రం ద్వారా ఆల్బుమిన్ అనే ప్రోటీన్ విసర్జించబడి, రక్తంలో ప్రోటీన్ల శాతం తగ్గిపోతుంది.
  7. రక్త పోటు పెరుగుతుంది
  8. మాటిమాటికి మూత్ర సంబంధ ఇన్ ఫెక్షన్ కు గురికావడం
  9. నీళ్లు త్రాగినా మూత్రం రాకపోవడం
  10. శ్వాస చెడువాసన రావడం
  11. చర్మము విపరీతంగా దురద పుట్టడం పై లక్షణాలు తొలిదశలో వున్నప్పుడే డాక్టరును సంప్రదించి వైద్యసలహా పొందాలి. అశ్రద్ద చేస్తే క్రమేణా కోమాలోకి వెళ్ళి మరణం సంభవించవచ్చును.


కిడ్నీఫెల్యూర్ మూలంగా వచ్చే అనర్ధాలు
  1. తీవ్ర రక్తపోటు
  2. రక్త హీనత
  3. నరాల అస్వస్ధత
  4. కండరాల అస్వస్ధత


వ్యాధి నిర్ధార పరీక్షలు
  1. మూత్రంలో అల్బుమిన్ శాతం అధికంగా వుండటం. ఈ సాధారణ  విలువలు సుమారు 6 నెలలు నుండి 10 నెలలు ముందుగా డాక్టర్లు గుర్తించ గలుగుతారు.
  2. రక్తంలో యూరియా, క్రియాటినిన్, పొటాషియం లాంటి మలిన పదార్ధాల శాతాన్ని తెలుసుకోవడానికి డాక్టరును సంప్రదించి సలహా తీసుకోవాలి.
  3. కడుపు ‘X’రే, CT స్కాన్


నివారణ

మూత్రపిండాలు పనిచేయలేక పోవడానికి ముందే మూలకారణాలు తెలుసుకొని వైద్యసలహా పొందితే కిడ్నీఫెల్యూర్ ను నివారించవచ్చు. మధుమేహ, రక్తపోటు వ్యాధులకు క్రమంతప్పక, సరియైన వైద్యం చేయించుకుంటూ ఉండాలి.






Powered by Plone CMS, the Open Source Content Management System

ఈ సైట్ ప్రమాణాలకు తగినట్లుగా ఉంది