గుండె పోటు
గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకొని వెళ్ళే రక్త నాళాలలో కొవ్వు
కాని, రక్తపు గడ్డ వలన కాని రక్త సరఫరాలో ఆటంకము కలిగిన యొడల గుండె పోటు
వస్తుంది.
-
|
గుండె శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని అందించే జీవాధారమైన
అవయవం. గుండె ఆమ్లజని (ఆక్సిజన్) సహిత రక్తమును రక్తనాళాల
ద్వారా గ్రహిస్తుంది. ఈ రక్తనాళాలను (కరోనరీ) హృదయ ధమనులు
అంటారు.
ఈ రక్తనాళాలు పూడ్చుకుపోతే రక్తము గుండె కండరాలకు అందక గుండె
పనిచేయదు. దీనినే గుండె పోటు అంటారు.
గుండెపోటు తీవ్రత, గుండె కండరాలు ఎంతవరకు పాడైపోయినవో దానిపై ఆధారపడి
ఉంటుంది. ఈ చచ్చుబడిపోయిన కండరాలు రక్తాన్ని పంపించే సామర్ధ్యాన్ని
తగ్గించి గుండె పని చేసే తీరుని మార్పు చేస్తుంది. ఇది కన్జెస్టివ్
హార్ట్ ఫెల్యూర్ కి దారితీస్తుంది. దీని వలన శ్వాస తీసుకొనలేకపోవడం
మరియు పాదాలకు చెమట పట్టడం వంటివి జరుగుతాయి.
|
|
-
- ఛాతి మధ్య భాగము లో అకస్మాత్తుగా నొప్పి రావడం గుండె పోటు యొక్క
ప్రధాన లక్షణము
- ఈ నొప్పి ఒక్కో సమయములో ఛాతి మీద బరువు పెట్టినట్లు గాను లేదా నొక్కి
పట్టినట్లు గాను ఉండవచ్చును
- ఈ ఛాతి నొప్పి భుజానికి కాని చేతులకు కాని వెనక వీపు భాగమునకు గాని
దవడకు కాని ప్రాకినట్లుగా ఉండవచ్చును
- ఛాతి నొప్పి వచ్చినప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకున్నా కూడా
తగ్గదు
- శరీరమంతా చల్లబడి చమట పట్టినట్లు ఉండవచ్చును
- ఊపిరి అందకపోవచ్చు
- శరీరము చచ్చుబడినట్లు, బలహీనపడి వాంతి వచ్చినట్లు ఉండవచ్చు
- తల తిరిగినట్లు స్పృహ కోల్పోతునట్లు ఉండవచ్చు
- ఛాతి నొప్పి లేకుండానే పైన తెలియబరిచిన లక్షణాలతో పాటు మాత్రమే కూడ
గుండె పోటు రావచ్చు
|
|
-
|
మనకు వయస్సు పెరిగే కొద్దీ , హృదయధమనులతో పాటు శరీరం యొక్క వివిధ
భాగాలలోని రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది క్రమంగా
రక్తప్రసారానికి అవరోధం కల్గిస్తుంది. ఈ విధంగా రక్త నాళాలు
మూసుకుపోవడాన్ని ఎథిరోస్ల్కిరోసిస్ అంటారు.
పురుషులు, స్త్రీల కన్నా ఎక్కువ గుండెపోటుకి గురయ్యే అవకాశం
ఉంది. స్త్రీలు స్త్రీ సెక్స్ హార్మోనులైన ఈస్ట్రోజన్ మరియు
ప్రొజెస్టిరాన్ ల ప్రభావము చేత రక్షింపబడతారు. ఈ రక్షణ కనీసం
రజోనివృత్తి వరకు ఉంటుంది.
భారతీయులతో సహా ఆసియా దేశం వారు ఎక్కువ అతిప్రమాదభరితమైన గుండెపోటుకి
గురౌతున్నారు.
ఈ అపాయానికి కారణాలుః
- ధూమపానం
- మధుమేహం
- అధిక రక్తపోటు
- అధిక బరువు
- ఎక్కువ కొవ్వు మరియు తక్కువ హెచ్ డి ఎల్ (అధిక సాంద్రత
లిపోప్రొటీన్) విలువలు వర్సెస్ మేలు చేసే కొవ్వు
- భౌతికశ్రమ లేకపోవడం
- గుండెపోటు చరిత్ర గల కుటుంబం
- వత్తిడి, ఎక్కువకోపము మరియు ఆందోళన
- వంశపారంపర్య కారకాలు
|
|
-
- ఎక్కువగా రక్తపోటు ఉన్న వారికి
- రక్తములో ఎక్కువ శాతం కొవ్వు వున్న వాళ్ళకు
- శారీరక శ్రమ లేనివాళ్ళకు
- స్దూల్దకాయులకు
- మధుమేహ వ్యాధి ఉన్నవారికి
- మధ్యపానము ఎక్కువ మోతాదులో సేవించే వారికి
- బీడీ, సిగరెట్ లాంటి పొగాకు సంబంధించినవి వాడే వాళ్ళకి
- వయస్సు మీద పడుతున్న వాళ్ళకు
|
|
-
- వైద్యుడు వైద్యచరిత్ర వివరాలను తీసుకుని గుండె స్పందనలను పరీక్ష చేసి
రక్తపోటును నమోదు చేస్తారు.
- గుండె స్పందనలను నమోదు చేసే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసిజి) ను
తీస్తారు.
- గుండె స్పందన వేగము, అసామాన్యమైన స్పందన నమూనా మొదలైన సమాచారాన్ని
ఈసిజి ఇస్తుంది. గుండెపోటు వల్ల పాడైపోయిన కండరాల ఉనికిని కూడా
ఈసిజి తెలియ జేస్తుంది. మొదటి దశలో నమోదైన మామూలు ఈసిజి, గుండెపోటు
రావడానికి అవకాశాలు లేవనే అవగాహనకు రాకూడదనే విషయం గుర్తుంచుకోవడం
ముఖ్యం.
- గుండె కండరాలు పాడైనదీ లేనిదీ గుర్తించడానికి రక్తపరీక్షలు
ఉపయోగపడతాయి.
- గుండెని ఎక్స్ రే తీయడం మంచిది.
- గుండె పనిచర్యల సమాచారము తెలుసుకోడానికి ఈకోకార్డియోగ్రాఫ్ చేయించడం
మంచిది.
- రక్తనాళాలు మూసుకుపోయాయని నిర్థారించే సాక్ష్యాన్ని కరోనరీ
ఎంజియోగ్రామ్ తెలియ జేస్తుంది.
|
|
-
- గుండె కండరానికి ఎంతమోతాదులో రక్త ప్రసరణ తగ్గినది లేదా పూర్తిగా
ఆగిపోయిన స్దాయిని బట్టి అనర్దాలు వుంటాయి.
- ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ చేసే సామర్ద్యాన్ని కోల్పోయి హార్టు
ఫెయిల్యూర్ రావచ్చు
- గుండె కొట్టుకొనే క్రమబద్దత లో గుండె దడలాంటి మార్పులు
రావచ్చును.
- గుండె పోటు వచ్చిన కొన్నిరోజులు తరువాత గుండె లో కవాటీలకు అనర్దము
రావచ్చు
|
|
-
- పొగాకు సంబంధించినవి బీడీ, సిగరెట్లు త్రాగడం పూర్తిగా మానాలి
- క్రమం తప్పక వ్యాయమం చేయాలి
- రక్తపోటు ను అదుపులో వుంచుకోవాలి
- కూరాగాయలు , పండ్లు ఎక్కువగా ఆహారములో తీసుకోవాలి
- వీలైతే చేప కూరలు, చేప వేపుడు తినాలి
- వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవడం మంచిది
- క్రమం తప్పక డాక్టరును సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది
|
|
-
|
గుండె నొప్పికి సత్వరమైన వైద్య చికిత్సను అందించడం ద్వారా జీవితాలను
రక్షించగలము.
- నైపుణ్యత గల వైద్యసహాయము అందే వరకు రోగిని పడుకోబెట్టి బిగుతుగానున్న
దుస్తులను వదులు చేయాలి.
- ఆక్సిజన్ సిలిండర్ దొరికినట్లైతే రోగికి ఆక్సిజన్ ఇవ్వవలెను.
- ఆ సమయమునకు నైట్రోగ్లిజరిన్ లేదా సోర్బిట్రేట్ మాత్రలు అందుబాటులో
ఉంటే ఒకటి లేదా రెండు మాత్రలు రోగి నాలిక క్రింద ఉంచవచ్చును.
- కరిగిన రూపంలో ఆస్ప్రిన్ మాత్రను కూడా ఇవ్వవలెను.
- అంబులెన్సు, డాక్టరు కు సంబందించిన సమాచారాన్ని అందుబాటులో
ఉంచుకోవడం
- వీలైతే అస్పిరిన్ మాత్ర తీసుకోవడం
- కుటుంబ వ్యక్తిగత డాక్టరుకు వెంటనే సమాచారాన్ని తెలిపి సలహా
తీసుకోవడం
- ప్రమాదాన్ని గురించి ఆలోచించకుండా మనో నిబ్బరంగా ఉండేటట్లు వాతావరణం
కల్పించడం త్వరగా ఆస్పత్రికి తరలించడం
|
|
-
- గుండె నొప్పులకు ఆసుపత్రిలో చేర్చుట మరియు సత్వర వైద్య సదుపాయము
అవసరము.
- మొదటి కొద్ది నిమిషములు మరియు గంటలు కీలకమైనవి. ప్రధమదశలో హృదయ
ధమనులలోని అడ్డంకులు కరగడానికి మందులు ఇవ్వవచ్చును.
- గుండె చప్పుడు (లయ) పర్యవేక్షించబడుతుంది మరియు ఇది అసహజంగా
ఉన్నట్లైతే సత్వర చికిత్స చేయబడుతుంది. నొప్పి ఉపశమనానికి మందులు
ఇవ్వాలి మరియు రోగిని విశ్రాంతి మరియు నిద్రించుటకు
ప్రోత్సహించవలెను.
- ఒకవేళ అధిక రక్తపోటు (పీడనం) ఉన్నట్లైతే రక్త పోటు
తగ్గడానికి మందులు ఇవ్వవలెను.
- నిర్దిష్టమైన చికిత్స ప్రత్యేకించబడి ఉంటుంది. ఇది
రక్తనాళాలలోని అడ్డంకులపరిధి, గుండె జబ్బు పరిధి, నొప్పి తీవ్రత
మరియు రోగి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది.
- చాలాసార్లు అతి నిర్దిష్ట పద్ధతుల ద్వారా రక్తనాళాలలో
అడ్డంకులు తొలగించుట అవసర మౌతుంది. ఇది కరోనరీ
ఎంజియోప్లాస్టీ, బెలూన్ ఉపయోగించి రక్తనాళాలను విస్తరింప జేయుట లేదా
కరోనరీ బైపాస్ సర్జరీ రూపాలలో ఉండవచ్చును.
|
|
-
|
అతి ప్రమాదభరితమైన గుండె జబ్బులున్నవారు – ఈ క్రింది నిరోధక చర్యలను
తీసుకొవలెను.
జీవన శైలి మార్పులో ఎదురయ్యే సవాలు
వారి ఆహారము, తక్కువ కొవ్వు పదార్థములు మరియు ఉప్పు, అధిక
పీచుపదార్థములు మరియు సంక్లిష్ట పిండిపదార్థాలతో ఆరోగ్యవంతంగా
ఉండవలెను.
- ఎవరైతే అధిక బరువును కల్గి ఉన్నారో వారు బరువు తగ్గించుకొనుట
అవసరము.
- క్రమం తప్పకుండా రోజూ భౌతిక వ్యాయామం చెయ్యాలి.
- పూర్తిగా పొగ త్రాగుట మానివేయాలి.
మధుమేహం, అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు తప్పకుండా
మందులు వాడి వారి పరిస్థతిని నియంత్రించుకోవలెను.
|
|