|
|
హెచ్.ఐ.వి. / ఎయిడ్స్
-
- హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ సోకిన వ్యక్తితో, లైంగిక సంబంధం వలన ఈ వ్యాధి
ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో, నూటికి 85 మంది లైంగిక
సంబంధం ద్వారా తెచ్చుకున్న వారే.
- హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ సోకిన వ్యక్తి రక్తం ఇంకొకరికి ఎక్కిస్తే ఈ
వ్యాధి వారికి సోకుతుంది.
- హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ సోకిన తల్లి నుండి పుట్టే బిడ్డకు కూడా ఈ వ్యాధి
సోకే అవకాశం ఉంది.
- ఈ విధంగానే కాక హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ సోకిన వ్యక్తికి వాడిన సూది
సరిగా మరగ బెట్టకుండా ఇతరులకు వాడితే, వారికి కూడా ఈ వ్యాధి
సోకుతుంది.
|
|
-
- తినే ఆహారం ద్వారా, తాగే నీటి ద్వారా లేదా పీల్చే గాలి ద్వారా ఈ
వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి రాదు.
- కలసి భోజనం చేయడం, కలసి నివాసం ఉండడం వలన ఈ వ్యాధి ఒకరి నుంచి
మరొకరికి రాదు.
- దోమ కాటు ద్వారా వ్యాపించదు.
|
|
-
- కలిసి జీవించడం వల్ల
- కలిసి పనిచేయడం వల్ల
- కలిసి కూర్చోవడం వల్ల
- కలిసి ఆడడం వల్ల
- కలిసి తినడం వల్ల
- కరచాలనం (షేక్ హ్యాండ్) వల్ల
- ఒకే – మూత్రశాలలను (టాయిలెట్లను) ఉపయోగించడం వల్ల హెచ్.ఐ.వి.
సంక్రమణం జరుగదు.
|
|
-
- జీవిత భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం పరిమితం చేసుకోవాలి.
- వివాహానికి ముందుగాని, వివాహం తర్వాతగాని విచ్చల విడి శృంగారం అత్యంత
ప్రమాదం, సుఖవ్యాధులకు దారి తీయవచ్చును.
- ఎప్పుడైనా రక్తం ఎక్కించాల్సి వస్తే, గుర్తించబడిన బ్లడ్ బ్యాంకులలో
నుంచి మాత్రమే రక్తం తీసుకోవాలి.
- క్షౌరశాలలో ప్రతి ఒక్కరికి కొత్త బ్లేడు వాడటం మంచిది.
- సుఖవ్యాధులు ఉన్నవారు హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ కు గురి అయ్యే
అవకాశం పదిరెట్లు ఎక్కువ అని తెలుసుకోండి
|
|
-
- యోని లేక అంగం నుండి రసికారుట, అంగంపై పుండ్లు, గజ్జలలో వాపు మరియు
మూత్రం పోయునప్పుడు మంట ఉన్నచో సుఖవ్యాధి అని అనుమానించి డాక్టరును
సంప్రదించండి.
- ఆడవాళ్లలో పొత్తికడుపు నొప్పి ఉన్నచో అశ్రద్ధ చేయకుండా పరీక్ష
చేయించుకొనవలెను.
- సుఖవ్యాధులను మందులతో నయం చేయవచ్చును మరియు నిరోధ్
తో నివారించవచ్చునని తెలుసుకోండి.
|
|
-
- హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ వ్యాధి మన శరీరంలోని రోగాలను నిరోధించే
శక్తిని నాశనం చేస్తుంది.
- శరీరంలో, రోగాలను నిరోధించే శక్తి (వ్యాధి నిరోధక శక్తి) బాగా
తగ్గినప్పుడు. మామూలుగా వచ్చే వ్యాధులు కూడా తగ్గకుండా, బాగా ముదిరి
ప్రాణాపాయం కలుగుతుంది.
|
|
-
- ఈ వ్యాధి సోకిన వారు కొన్ని ఖచ్చితమైన జాగ్రత్తలు, అలవాట్లు పాటిస్తే
వ్యాధి వేగంగా ముదరకుండా చూసుకోవచ్చు.
- ఆందోళన పడకుండా, ప్రశాంతంగా ఉండడం, ధ్యానం, యోగాసనాలు చేయడం.
- వేళకు మంచి ఆహారం తీసుకోవడం.
- కనీస శారీరక వ్యాయామం చేయడం.
- క్షయ, సుఖ వ్యాధులు రాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం.
- సారా, మత్తు పదార్థాలు పూర్తిగా మానివేయడం.
- ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండడానికి తప్పనిసరి అయితే, సంభోగ సమయంలో
(వ్యాధి సోకినది స్త్రీకైనా, పురుషునికైనా) మగవారు నిరోధ్ ధరించడం
చేయాలి.
|
|
-
|
అవగాహనే అసలైన
అస్త్రం
డా|| రాజా ప్రసన్నకుమార్
అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్
-
|
ఇది వ్యక్తులనూ, కుటుంబాలనే కాదు.. ఏకంగా దేశాలనే కబళించేస్తోంది.
ఎన్నో జీవితాలు కావికలమైపోతున్నాయి. దీనిపై అవగాహన పెంచుకోవటం ఒక్కటే
దీనికి సరైన, అసలైన పరిష్కారం.
|
|
-
|
మన రాష్ట్రంలో ప్రధానంగా హెచ్‌ఐవీ వ్యాప్తి ఈ అరక్షిత లైంగిక సంబంధాల
ద్వారానే జరుగుతోంది. నిజానికి ఈ మార్గంలో హెచ్‌ఐవీ సంక్రమిచే రిస్కు
0.1-0.3% మాత్రమే. అయినా అదే మన దగ్గర పెను శాపంగా పరిణమిస్తోందంటే సమస్య
తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అరక్షిత శృంగారంలో ఇది పురుషుల నుంచి
స్త్రీలకు సంక్రమించే అవకాశాలు ఎక్కువ. కారణం: స్త్రీలలో యోని మార్గం అతి
పల్చటి జిగురు పొరతో కప్పి ఉండటం, స్త్రీ జననాగంలో హెచ్‌ఐవీకి అనువైన
కణాలు ఎక్కువగా ఉండటం, లైంగిక చర్య సమయంలో స్త్రీ జననాంగాల్లో సూక్ష్మమైన
గాయాలవుతుండటం, వీర్యం స్త్రీశరీరంలో ఎక్కువసేపు నిల్వ ఉండటం.. వీటన్నింటి
వల్లా స్త్రీలకు హెచ్‌ఐవీ ముప్పు మరింత ఎక్కువ. వీటికి జననాంగ,
సుఖవ్యాధులు కూడా తోడైతే హెచ్‌ఐవీ రిస్కు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
జననాంగాల్లో పుండ్లు, స్రావాలు, తెల్లమైల, పొత్తికడుపు నొప్పి, గజ్జల్లో
గడ్డలు, పులిపిరులు ఇలాంటివి ఉన్నప్పుడు అరక్షిత శృంగారం ద్వారా హెచ్‌ఐవీ
సోకే అవకాశాలు మరింత పెరుగుతాయి. అందుకే సుఖవ్యాధులకు చికిత్స తీసుకోవటం,
భాగస్వామిని కూడా చికిత్సలో భాగం చెయ్యటం చాలా అవసరం. వీటికి చికిత్స
అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా కూడా లభిస్తుంది. కండోమ్ వాడకం,
వ్యక్తి అలవాట్లు, ప్రవర్తనల్లో మార్పుతేవటం.. ఈ రెండూ ముఖ్యమైన నివారణ
చర్యలు!
|
|
-
|
తల్లిదండ్రుల నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ మూడు రకాలుగా సంక్రమించవచ్చు. 1.
బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు 2. ప్రసవ సమయంలో 3. తల్లిపాల ద్వారా.
వాస్తవానికి 100 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ తల్లులకు 70 మంది బిడ్డలు
హెచ్‌ఐవీ లేకుండానే పుడుతున్నారు. 30 మందికి మాత్రం హెచ్‌ఐవీ సంక్రమించే
అవకాశం ఉంటోంది. ఈ ముప్పును మరింతగా తగ్గించేందుకు గర్భిణులకు 'నివిరపిన్
ప్రొఫైలాక్సిస్' విధానం మరింత మేలు చేస్తుంది. హెచ్‌ఐవీ పాజిటివ్
గర్భిణులకు ప్రసవ సమయంలో నివిరపిన్ 200 ఎంజీ మాత్ర ఒకటి ఇస్తారు. పుట్టిన
బిడ్డకు 72 గంటల్లోపు నివిరపిన్ టానిక్ ఒక్కసారి తాగిస్తారు. ఇలా చేస్తే
హెచ్‌ఐవీ సంక్రమించే అవకాశం 30 శాతం నుంచి 9-11 శాతానికి పడిపోతుంది. ఇక
తల్లిపాలు ఇవ్వవచ్చా? లేదా? అన్నది చాలా వరకూ తల్లిదండ్రుల నిర్ణయానికే
వదిలేస్తారు.
|
|
-
|
మన రాష్ట్రంలో కలుషిత సూదులు, సిరంజీల ద్వారా హెచ్‌ఐవీ సోకటమన్నది 0.32
శాతం వరకూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకూ సూదులు/సూదిమందులు
కాకుండా వీలైనంత వరకూ వైద్యుల పర్యవేక్షణలో మాత్రలు వాడుకోవటం ఉత్తమం.
ఇంజక్షన్లు తప్పనిసరి అయినట్లయితే.. కొత్త సూదులే వాడటం,
వాడిపారెయ్యటానికి వీలైన సిరంజీలను ఎంచుకోవటం అవసరం. రక్తపరీక్షలకు
వెళ్లినప్పుడు కూడా కొత్త సూదులే వాడేలా చూసుకోవటం మంచిది.
|
|
-
|
హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తి రక్తాన్ని పరీక్ష చెయ్యకుండా ఆపద సమయంలో
మరొక వ్యక్తికి మార్పిడి చేసిన పక్షంలో వారికి హెచ్‌ఐవీ సోకే అవకాశం నూరు
శాతం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కట్టుదిట్టమైన
చర్యలు, లైసెన్సింగ్ విధానం, తప్పనిసరి హెచ్‌ఐవీ+ పరీక్షల వల్ల ఈ మార్గం
ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తి చెందే అవకాశం బాగా తగ్గింది. రక్తం దానం చేసే
ప్రతి దాత రక్తాన్నీ ముందుగా- హెచ్‌ఐవీ, హెచ్‌బీవీ, మలేరియా, సిఫిలిస్,
హిమోగ్లోబిన్ శాతం పరీక్షలు చేసిన తర్వాతే మార్పిడి చెయ్యాలి.
|
|
-
|
హెచ్‌ఐవీ క్రిమి ఒంట్లో చేరగానే జరిగే పరిణామాలు చాలా కీలకం. మన
శరీరంలో రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైనవి 'సీడీ4' అనే కణాలు! హెచ్‌ఐవీ
ఒంట్లో చేరగానే ముందుగా ఈ కణాలను లోబరుచుకుంటుంది. ఆ తర్వాత.. ప్రతి సీడీ4
కణం నుంచీ దాదాపు 250-500 వరకూ కొత్త వైరస్‌లను తయారుచేస్తుంది.. ఈ
క్రమంలో సీడీ4 కణం చనిపోతుంది. ఇలా సుమారు 10-15 సంవత్సరాల కాలంలో సీడీ4
కణాలు తీవ్రంగా దెబ్బతిని, వాటి సంఖ్య తగ్గిపోయి, వైరస్ పెరిగిపోయి..
హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తి.. ఎయిడ్స్ దశలోకి వెళ్లిపోతారు.
తొలిదశలో హెచ్‌ఐవీ యాంటీబోడీ పరీక్షలు చెయ్యటం ద్వారా దీన్ని
గుర్తించవచ్చు. అయితే ఈ పరీక్షలో కచ్చితంగా ఫలితం తెలియాలంటే 6 వారాల
నుంచి 6 నెలల 'విండో పీరియడ్' కాలం ఆగాల్సి ఉంటుంది. 'పీసీఆర్' పరీక్ష
ద్వారా హెచ్‌ఐవీ ఉనికి ఇంకా ముందే గుర్తించవచ్చు.
|
|
-
- పదిశాతం బరువు తగ్గిపోవటం
- తరచూ విరేచనాలు కావటం
- తరచూ జ్వరం రావటం ముఖ్య లక్షణాలు!
ఇవే కాకుండా ఇంకా రకరకాల 'అవకాశ వ్యాధులు' వచ్చే ముప్పు కూడా ఎక్కువే
ఉంటుంది. ముఖ్యంగా మనదేశంలో ఊపిరితిత్తుల్లో క్షయ వ్యాధి చాలా ఎక్కువగా
వస్తుంది. కాబట్టి హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తులంతా తరచూ కళ్లె పరీక్ష
చేయించుకోవటం ద్వారా క్షయ రాకుండావెంటనే జాగ్రత్తలు తీసుకునే వీలుంటుంది.
అలాగే క్షయ వ్యాధిగ్రస్తులు కూడా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవటం వల్ల ఈ
వ్యాధులు ముదరకుండా చూసుకోవచ్చు.
- హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తులు 6 నెలలకు ఒకసారి సీడీ4 పరీక్ష
చేయించుకోవటం ద్వారా సమస్య ఎయిడ్స్‌కు దారితీస్తోందేమో తెలుసుకోవచ్చు.
సాధారణ ఆరోగ్యవంతుల్లో సీడీ4 కణాల సంఖ్య 800-1500 వరకూ ఉంటుంది. హెచ్‌ఐవీ
పాజిటివ్ వ్యక్తిలో ఈ సంఖ్య 250 కన్నా తగ్గినట్లయితే ఎయిడ్స్ దశలోకి
వెళుతున్నట్టుగా గుర్తించాలి.
- ఎయిడ్స్ దశలోని వ్యక్తి ఆయుర్దాయాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం
అన్ని జిల్లాల్లో 'ఏఆర్‌టీ సెంటర్ల' ద్వారా ఉచితంగా మందులు అందజేస్తోంది.
వీటిని ఎయిడ్స్ బాధితులు కచ్చితంగా వాడటం ద్వారా ఆయుర్దాయాన్ని
పెంపొందించుకోవచ్చు.
|
|
-
- హెచ్‌ఐవీ క్రిమి గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా, స్పర్శ
ద్వారా, వస్తువుల ద్వారా, దోమల ద్వారా వ్యాప్తి చెందదు!
- చాలామంది దోమల ద్వారా హెచ్‌ఐవీ ఎందుకు వ్యాపించదని ప్రశ్నిస్తుంటారు.
హెచ్‌ఐవీ క్రిమి మనుషుల్లోనూ, చింపాంజీల్లోనూ తప్పించి మరే జీవిలోనూ
బతకలేదు. కాబట్టి ఇది దోమల ద్వారా వ్యాపించే అవకాశం లేదు.
- హెచ్‌ఐవీ ఉన్న శారీరక ద్రవం ఏదైనా- బయటి వాతావరణంలో
ఎండిపోయినట్త్లెతే.. ఆ ద్రవంలో ఉన్న హెచ్‌ఐవీ కూడా చనిపోతుంది
|
|
-
|
ఎయిడ్స్ కారక వైరస్.. ప్రధానంగా 'హెచ్‌ఐవీ పాజిటివ్' వ్యక్తుల
శారీరక ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ శారీరక ద్రవాల్లో ప్రధానంగా
చెప్పుకోవాల్సింది- 1. పురుషుల వీర్యం 2. స్త్రీల యోని ద్రవాలు 3. రక్తం
4. ఉమ్మనీరు 5. మస్తిష్క నీరు 6. తల్లిపాలు 7. ఊపిరితిత్తుల నీరు 8. పొట్ట
నీరు. కాబట్టి పాజిటివ్ వ్యక్తుల శారీరక ద్రవాలు తమకుసోకకుండా, తగలకుండా
చూసుకోవటం ముఖ్యం. సాధారణంగా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా
సోకుతోందంటే:
- అరక్షిత లైంగిక సంబంధాలు (94.69%)
- తల్లిదండ్రుల నుంచి బిడ్డకు (4.13%)
- కలుషిత సూదులు/సిరంజిలు (0.32%)
- కలుషిత రక్త మార్పిడి (0.3%)
|
|
ఆధారం : ఈనాడు
|
|
|
|