భారతావనిలో గ్రామీణ ఆరోగ్య భద్రత
స్త్రీల అనారోగ్యం మరియు శిశు మరణాల భారాన్ని తగ్గించడానికి దేశంలో ఎన్నో సంవత్సరాలనుండి అభివృద్ధి ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఎంతో కాలంగా చాలా ప్రజారోగ్య పధకాలు మరియు అభివృద్ధి సేవలు (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్ ICDS) ఈ దిశగా ప్రవేశపెట్టడం జరిగింది. మాతా శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యత నివ్వడంలో భారత దేశం శతాబ్ధి అభివృద్ధి లక్ష్యాలను ( మిలీనియం డెవలప్ మెంట్ గోల్స్ ) సాధించడానికి అంకిత భావంతో కృషిచేస్తోంది. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక రకాల ప్రజారోగ్య పధకాలపై అవగాహన కలుగజేయడం, వాటి వినియోగం అనేది ముఖ్యమైన ప్రాధమిక అంశం.
గ్రామీణ భారతదేశ ప్రజలకు ఆరోగ్య భద్రత పైన ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యానికి గల ప్రాధాన్యత పై అవగాహన కల్పించడం, దానికి కావలసిన ముఖ్యమైన సమాచారాన్ని అందజేయడం ఈ బహు బాషా పోర్టల్ యొక్క లక్ష్యం. ఈ పోర్టల్ లో దీనికి సంభందించిన ఇతర అతి ముఖ్యమైన అంశాలు పౌష్టికాహారం, పరిశుభ్రత, ప్రాథమిక చికిత్స మరియు వ్యాధులు.
Expression of Thanks
- Pawan Kumar B N, Andhra Pradesh






108