ఆర్ధిక సంబంధమైన అవగాహన (ఆర్థిక అక్షరాస్యత) హోమ్ పేజి

స్టాక్ ఎక్స్చేంజి/ విశ్వ నగదు సంయోజకాలు / సుసంధిత వడ్డీ గణన సాధనాలు / ఫిర్యాదులు మరియు ఆంబుడ్స్మన్/ భారత దేశం లోని బ్యాంకులు మరియు భీమా కంపెనీలు

భారత దేశం యొక్క కొత్త రూపాయి చిహ్నం
వారికి ఒక్క రూపాయితో బ్యాంకు ఖాతా ఒక వరంగా మారింది

ఆర్ధిక సంబంధమైన అవగాహన - ఆర్థిక అక్షరాస్యత- భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నగేట్ వే అందించే విధి విధానాలు

గత తరంతో పోల్చి చూస్తే ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ యొక్క విధి విధానాలు కొంచెం క్లిష్ట భూయిష్టంగా ఉన్నాయి. 40 ఏళ్లకిందట స్థానిక బ్యాంకులు లేక పొదుపు సంస్థలలో తెరిచే పొదుపు ఖాతాలు, చెక్కుల నిర్వహణ విషయాలు తెలుసు కుంటే సరిపోయేది. ప్రస్తుతం బ్యాంకులు తదితర ఆర్ధిక సంస్థలు విస్తృతంగాఅందించే ఆర్ధిక సేవలు, ఉత్పత్తులను గురించి ముఖ్యంగా గ్రామీణ పౌరులు పూర్తిగా తెలుసుకుని వాటిలో గల భేదాలు, మార్పులను గమనించవలసిన అవసరమేర్పడింది. గతంలో ఆ తరం వారు తాము పొందిన ఋణాలు, వాటిపై వసూలు చేసే చక్రవడ్డీల, ఋణాల ఖాతాలలో జరిగే అవకతవకల గురించి నిర్ధిష్టమైన అవగాహన కలిగి ఉండవలసిన అవసరమేర్పడలేదు.

వినియోగదారులలో ఆర్ధికపరమైన అవగాహన కల్పించవలసిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఆ అవగాహనను వారికి ఎలా కల్పించాలన్నదే ముఖ్యం. ఇది ఒక్క మదుపరులకు మాత్రమే అతి ముఖ్యమైన అంశం కాదు. ప్రతి ఒక్క సగటు కుటుంబంలో తల్లిదండ్రులు తమ పదవీ విరమణ, పిల్లల విద్యాభ్యాసం కోసం పాటించవలసిన పొదుపు జాగ్రత్తలు, తమ ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకోవడం తప్పనిసరి. వినియోగదారులకు వివిధ స్థాయిలలో తమ జీవితంలో ఆర్ధికపరమైన అవగాహన పొంద వలసిన అవసరమేర్పడింది. వారి కొరకు అనేక పథకాలు ప్రారంభింపబడి ఆయా అవసరాలను తీర్చడానికి నిర్దేశించబడ్డాయి.

ఇండియాడెవలప్ మెంట్ గేట్ వే ప్రాజెక్ట్ (భారత ప్రగతి ద్వారం పథకం ) కూడా ఆర్ధికావగాహన, ఆర్థిక అక్షరాస్యత కల్పించే ప్రణాళికను రూపొందించి, ఆ వివరాలను వెబ్ సైట్ లో పొందుపరచి వివిధ ప్రసార, ప్రచార సాధనాల (మల్టీమీడియా సిడి రామ్ ) ద్వారా అందిస్తోంది.


Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: