మేము బాధ్యులం కాము (డిస్ క్లైమర్)

భారత ప్రగతి ద్వారం ( ఇన్ డీజి ) వెబ్ పోర్టల్ సాధ్యమైనంతవరకు అందుబాటులో ఉండే నమ్మకమైన డేటా, సమాచారాలను ఇచ్చే ఉద్దేశంతో ఆరంభించబడింది. ఐతే ఈ డేటా మూలం / ఆధారం పై సిడాక్ సంస్థకు కానీ 'ఇన్ డీజి'కు  కానీ ఎలాంటి అధికారం లేదు. ఈ డేటాను వివిధ వెబ్సైట్లనించి, కన్సార్షియంలనుంచి సేకరించడం జరిగింది. సమాచార ఆధారితడేటా నమ్మకంగా ఉండేలా చూడటం జరిగింది. ఈ ఇన్ డీజి లో ఇచ్చిన సమాచారంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, అవలోకనాలు ఆయా మూలాధారాలైన వెబ్సైట్లకు, ఆయా పథకాలు, పాలసీలు వగైరాలకు చెందుతాయే తప్ప వాటితో సిడాక్ సంస్థకు కానీ 'ఇన్ డీజి'కి కానీ ఎలాంటి సంబంధమూ లేదు.

  1. 'ఇన్ డీజి' వెబ్సైట్లో ఉండే డేటా లేదా సమాచారానికి సంబంధించిన సంతృప్తికరమైన నాణ్యతకి, అమ్మకపు పరిమితి వంటి ఎలాంటి దానికీ సిడాక్ సంస్థ కానీ 'ఇన్ డీజి'  కానీ ఎలాంటి పూచీ   ఇవ్వడంగానీ, ఉల్లంఘించడంగానీ జరగడం లేదు.

2. ఈ వెబ్సైటులో ఉంచిన  సమాచారాన్ని వాడటంవల్ల ఎవరికైనా సరే ఎలాంటి కష్టం, నష్టంవచ్చినా, వ్యాపార లావాదేవీలలో ఆటంకం కలిగినా అందుకు సిడాక్ సంస్థ కానీ 'ఇన్ డీజీ' కానీ బాధ్యత వహించవు.

3. ఈ వెబ్సైటులో ఉంచిన  సమాచారం తప్పులు లేకుండా, నిరాటంకంగా అందించే హామీ ఏదీ ఇవ్వడం లేదు.  ఈ వెబ్సైటు లేదా  సర్వర్లలో వైరస్ ఫ్రీగానే డేటా ఉంచడం జరిగినా ఈ వెబ్సైటు సమాచారాన్ని వాడి ఒకవేళ మీ కంప్యూటర్కి ఎలాంటి నష్టం జరిగినా దానికి సిడాక్ సంస్థ కానీ 'ఇన్ డీజి'  కానీ బాధ్యత వహించవు.

4. ఈ వెబ్సైటులో ఉంచిన  సమాచారం డౌన్లోడ్ చేసుకొంటే  దానివల్ల మీ కంప్యూటర్కి ఎలాంటి నష్టం జరిగినా దానికి సిడాక్ సంస్థ కానీ 'ఇన్ డీజి'  కానీ బాధ్యత వహించవు.

5. ఈ వెబ్సైటు ద్వారా జరిగే వస్తువు కొనుగోలు వంటి ఎలాంటి లావాదేవీ వల్ల మీకెలాంటి నష్టం జరిగినా దానికి సిడాక్ సంస్థ కానీ 'ఇన్ డీజి' కానీ బాధ్యత వహించవు.

5. క్రింద ఇవ్వబడిన లావాదేవీల ఫలితంగా   ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, యాదృచ్ఛికంగా కానీ,   దండనార్హంగా కానీ, ప్రత్యేకంగా లేదా పర్యవసానంగా కానీ మీకెలాంటి నష్టం జరిగినా దానికి సిడాక్ సంస్థ కానీ 'ఇన్ డీజి'  కానీ  ఎట్టి పరిస్థితిలోనూ బాధ్యత వహించవు.

అ) సైటును వాడటం లేదా వాడలేక పోవడం;

ఆ) ఈ వెబ్సైటు ద్వారా జరిగే వస్తువు కొనుగోలు వంటి ఎలాంటి లావాదేవీకైనా అయ్యే వ్యయం లేదా మెసేజీలందుకోవడం, లేదా ఎలాంటి లావాదేవీలోనైనా పాలుపంచుకోవడం;

ఇ) ఈ సైటులోని సమాచారం;

ఈ) ఈ సైటుకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా సరే, దానిని వాడితే రాగల నష్టాలగూర్చి సిడాక్ హెచ్చరించినా కూడా వాడటం;

ఎందుకంటే కొన్ని న్యాయపరిపాలనలు మినహాయింపులను, పర్యవసానాలకు లేదా ఘటనాపరమైన నష్టాలకు సంబంధించి పరిమితమైన బాధ్యతలను  నిషేధించాయి. అందువల్ల పైన చెప్పిన కొన్ని పరిమితులు మీకు అన్వయంకాకపోవచ్చు.  సిడాక్ తన అంతర్జాతీయపరమైన డేటాని మీకు అందించవచ్చు, ఇంకా అందువల్ల ఈ సైటులో అలాంటి విషయ సంబంధ ఉత్పత్తులకు, సేవలకు లింకుని ఈ సైటులో అందించవచ్చు. అలాంటి సేవలు మీ దేశంలో లభ్యంకాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పైన చెప్పిన సేవలు మీ దేశంలో సిడాక్ అందిస్తుందని అర్థం కాదు.

 


Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: