Document Actions


ఆహార భద్రతా ప్రమాణాలు సూచికలు

అనేక దశాబ్దాలకు పూర్వం నుండి ఆహారోత్పత్తి, ఎగుమతి మరియు ఆరోగ్య విభాగాలలో భారతదేశపు ప్రాముఖ్యతాముద్రలున్నాయి. పాలు, చెరకు, జీడిపప్పు, సుగంధద్రవ్యాల ఉత్పత్తిలొ ప్రథమ స్థానాన్ని, బియ్యం, గోధుమ, అపరాలు, పండ్లు(బ్రెజిల్‌తర్వాత) మరియు కాయగూరల లో (చైనా తర్వాత) రెండవ ప్రధాన ఉత్పాదక దేశము. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతిలో మూడుశాతంకన్నా తక్కువ భాగస్వామ్యం ఉంది. చాలా కీలక అంశాలను పరిగణలోనికి తీసుకోవలసిన అవసరముంది. సంస్థాగతసమన్వయం, సాంకేతిక నైపుణ్యం లేకపోవడం, పరికరాల కొరత, ఎప్పటికప్పుడు ప్రమాణాలు పెంచలేకపోవడం, ప్రతిస్పందించే నియంత్రణా విధానం లేకపోవడంతో బాటు వ్యవస్థీకరింపబడిన, వ్యవస్థీకరింపబడని విభాగాలతో కూడిన పరిశ్రమలో ఆహారాన్ని భద్రపరచే చోట నాణ్యతా ప్రమాణాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడంలో అవగాహనలోపం వలన, ఆహారంతో వచ్చే జబ్బులు ఎక్కువవుతాయి. రోగకారక సూక్ష్మ జీవుల పుట్టుక ఎక్కువ వేగవంతమౌతుంది. ప్రపంచ వాణిజ్య సంస్థననుసరించి జన్యుపరంగా మార్పుచెందిన ఆహారం, ఆహారోత్పత్తులలో దిగుమతి పెరుగుదల ఉంటుంది. పరిశోధన, అభివృద్ధి, అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇచ్చే తాజా సమాచారవ్యవస్థలలో బలహీనంగా ఉండడంవలన తోడ్పాటు కావాలి . ఇంకను కేంద్రం నుండి రాష్ట్రానికి అదేవిధంగా రాష్ట్రం నుంచి కేంద్రానికి వేగవంతంగా సమాచారం అందాలి.

ఆహార భద్రతా ప్రమాణాలు ఎందుకు అవసరం?

అంతర్జాతీయ ఆహారవాణిజ్యం అతి సంక్లిష్టతతో, సాంకేతికత, పరిపాలన ప్రక్రియలతో ప్రపంచీకరణ పురోగతితో కూడి ఉంటుంది. అధికమొత్తంలో వైవిధ్యమైన ఆహారోత్పత్తిఉంటుంది.  ఆహారోత్పతి శాస్త్రీయపద్దతిలో చేయ వలసి వుంటుంది.  ఆహారాన్ని ఆరోగ్యకరమైన స్థితిలో చెప్పుకోదగ్గంత నాణ్యతాలోపం లేకుండా ఎంత దూర ప్రదేశానికైన రవాణా చేయవచ్చును. గతంలోలాగాకాక, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు, బహుళ వైవిధ్యంతో, అధికనాణ్యతతో, ఎక్కువ పరిమాణంలో గల ఆహారం అందుబాటులోఉంటున్నది. అంతర్జాతీయ వాణిజ్యంలో గుర్తించదగిన పరిమాణం, వైవిధ్యంలో పెంపుదల అనే రెండు అభివృద్ధులు సంచలనం కల్గించాయి. మొదటిది, అనేక దేశాలలో ముఖ్యంగా అభివృద్ధిచెందుతున్న దేశాలు నాటకీయంగా పరిమాణపరంగా ఆహార ఎగుమతులను చేపట్టాయి. రెండవది అంతర్జాతీ యపరంగా రుచులు, అలవాట్లు. మొదటిది ఆర్ధికాభివృద్ధి, వాణిజ్యసరళి, విదేశీద్రవ్యమారకాన్ని కలిసి సంపాదించుకోవడం. రెండవది వివిధ దేశాల ప్రజలు ఒకరి ఆహారపు రుచులు వేరొకరు ఇష్టప డడం.

సఫలీకృత ఎగుమతిదారులు ఎవరంటే, దిగుమతి చేసుకునే దేశాల వినియోగదారులకు ఆమోదకరమైన ఆహారాన్ని, దిగుమతి దేశం శాసనాలకనుగుణంగా పాటించి ఎగుమతి చేసేవారు. దిగుమతి దేశం విధించిన తప్పని సరి అవసరాలను  షరతులను ముందుగానే  పాటించి ఆహారాన్ని ఎగుమతి చేయడం లాభదాయకం. అయినప్పటికి ఆహార భద్రత విషయంలో ప్రపంచ జనాభా యావత్తు అవసరాలను  షరతులను పాటించాల్సిందిగా కోరుతోంది. దీనితో బాటు దిగుమతి చేసుకొనే దేశాల సంఖ్య పెరిగిన కొద్దీ వారు ఆమోదించిన ఉత్పత్తులపై తనిఖీ, పరీక్ష విధానాలతో బాటు, ఆహార నాణ్యత, భద్రతలపై ఎగుమతి దేశాల ప్రభుత్వాల ధృవీకరణ కావాలి.



పౌష్టికాహార సంస్థ నియమం అంటే ఏమిటి?

ఆహారఉత్పత్తిని  పొందడం లోసూత్రీకరణ  ప్రమాణాలు  మార్గదర్శక సూత్రాలు ఇతర సూచనలు పౌష్టికాహార సూత్రాలు (అనగా లేటిన్‌ భాషలో ఆహార నియమం లేదా ఆహార సూత్రం) అంటే ఆహార ప్రమాణముల సముదాయం. ఒకేరీతిలో ఉండే నియమాల ఆచరణ మరియు ఇతర సూచనలు. నియమాల ప్రమాణాలు, మార్గదర్శకాలు మరియు ఇతర సూచనల పాటించడం వల్ల ఆహారోత్పత్తులు వినియోగదారులకు హానికల్గించవని దీనివల్ల దేశాలమధ్య వాణిజ్యభద్రత ఉంటుంది.

1940 మరియు 1950 సం||ల ప్రపంచ యుద్ధాల తర్వాత  ఎగుమతిదారులకు ప్రభుత్వాలకు మద్య సామరస్య విధానంలో జాతీయ ఆహార సూత్రాలు, నియమాలను అనుసరించి అన్నిదేశాలు స్వేచ్చా వాణిజ్యం సాగించే వీలు ఏర్పడింది. అనేక అపజయాల అనంతరం ప్రామాణికత కల్గిన  అంతర్జాతీయ ఆహారనియమాలు మరియు దీనితో బాటు ప్రపంచ వ్యాప్తంగా ఆహార అవసరాలు నియమబద్ధంగా ఏర్పడడం జరిగింది. చివరికి ఇంతకృషి ఫలితంగా పౌష్టికాహార సంస్థ (CAC)నియామకం 1962 సం||లో జరిగి ఆహార వ్యవసాయ సంస్థ, యునైటెడ్‌ నేషన్స్‌ (FAO)  మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థలు (WHO)  కలిసి (FAO)/ (WHO) ఆహార ప్రమాణాల కార్యక్రమం అమలు చేసింది. ఈకార్యక్రమ ఉద్ధేశం క్లుప్తంగా, వినియోదారుల ఆరోగ్యాన్ని కాపాడడం, అనుకూల వ్యవహారాలతో ఆహార వాణిజ్యంలోను మరియు అంతర్జాతీయ ఆహార ప్రమాణాల  పై సమన్వయంతో కృషిచేయడం. 168 ప్రభుత్వాల సభ్యులతో కలిసిన అంతర్గత ప్రభుత్వకూటమిగా  (CAC) ఉన్నది .



నియామాల సాధారణ పరిశీలన

  ఈ  పౌష్టికాహార సంస్థ (CAC) ఆహార అమ్మకాలలో, ఉత్పత్తి వ్యవహారాలలో,  వినియోగదారుల రక్షణకు సంబంధించి ప్రమాణలను, నిపుణుల స్పష్టమైన అభిప్రాయాలను సమన్వయ పరచి ఆహారంలోని ప్రతీ   అంశానికి  విశ్వవ్యాప్త నాయకత్వం వహిస్తుంది. ఈ విషయంలో నియమాల సరళి(కోడెక్స్‌)ఏంచేస్తుంది? అనే ప్రశ్నతో ప్రతీచోట వర్తకులు, వినియోగదారులు, శాస్త్రవేత్తలు, నియంత్రణాధికారులు, శాసన సభ్యులు, ప్రతి ఒక్క ఖాతాదారుడు నేడు అడుగుతున్నాడు.
 ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO’s) ఒప్పందంలోని ఆహార రక్షిత ప్రమాణాల నిర్వచనంలో పారిశుద్ధ్యం, మొక్కల    ఆరోగ్య పరిరక్షణ ప్రమాణాల (SPS) నియోజనంలో  స ంబంధిత ఆహారంతో చేర్చబడిన పదార్ధాలు, జంతువుల మందులు, మరియు తెగుళ్ల నివారణ మందుల అవశేషాలు, కలుషితాలు, విశ్లేషణ మాదిరి విధానాలు, సరుకుల వివరాలను తెల్పే లేబుల్స్‌, సంకేతాలు, ఆరోగ్యసాధనకు మార్గదర్శకాలు  ఉంటాయి. ప్రపంచ వాణిజ్య సంస్థలో నిర్ధేశిత అంశంగా ఆహార భద్రతా ప్రమాణ నియమాల వినియోగం ఉంటుంది.

ఆహార పరిశుభ్రత అనేది  సంఘం ఏర్పడినప్పటినుంచి CAC లోని ప్రధాన కార్యక్రమ విభాగం. యునైటెడ్‌ నేషన్స్‌ ప్రభుత్వం 1963లో ఏర్పరచినప్పుడే ఆహార పరిశుభ్రతపై సంఘ నియమాలు ఏర్పడ్డాయి.  ఎగుమతి చేసే దేశాలకు ఉత్తమ క్రమబద్ధమైన ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి, ప్రక్రియ దశలోను, సంఘానికి     ఆరోగ్య సాధనా నియమాలతో తయారై న ఉత్పత్తి ప్రమాణాలు సూక్ష్మ జీవ ప్రమాణాలకన్నా  ప్రధానమైనది. విపత్తు విశ్లేషణ,  క్లిష్టమైన నియంత్రణా అంశ (HACCP) విధాన నియోజన మార్గదర్శకాలను ఆరోగ్యకరమైన ఆహార విషయంలో CAC స్వీకరిస్తుంది.  ఇలా చేయడం ద్వారా  HACCP పనిముట్టుగా విపత్తును అంచనావేసి నియంత్రణ విధానాన్ని ఏర్పరచి, తయారైన ఉత్పత్తి పరీక్షలపై ప్రాథమికంగా ఆధారపడకుండా నివారణ చర్యలపై దృష్టిసారించడం.


జాతీయ నియమాల స్మృతి పరిచయ కేంద్రం (NCCP)

ఈ జాతీయ నియమాల స్మృతి పరిచయ కేంద్రం (NCCP) కేంద్ర స్థానంగా ఉండి దేశాల అధికార సభ్యుల జాతీయ అధికార స్మృతి (కోడెక్స్‌) కి ఆహార, వ్యవసాయ సంస్థ FAO ప్రధాన కార్యస్థానం గల సచివాలయ స్మృతికి అనుసంధానంగా ఉంటుంది. స్మృతి ప్రతులను ప్రచురణలు, ఇతర సమాచరాలను ప్రారంభక గ్రహీతగా అందుకుంటుంది. స్మృతి ప్రమాణములతో గ్రంధాలయాన్ని నిర్వహిస్తూ, నియమాల సాధన మరియు మార్గదర్శకాలను కలుపుకొని ప్రతులతో సహా సానుకూల చర్యతో ప్రారంభ#కంగా CAC దాని ఉపసంఘాల గురించి, ఉద్దేశాలు, లక్ష్యాలు, వాటి పనిపై# అవసరమగు చోట్ల ప్రేరణను కల్గించడం.



జాతీయ స్మృతి సంఘాలు (NCC)

చాలా దేశాల స్మృతి సభ్యులకు వేదికను ఏర్పరచి, స్మృతి విషయాలు, ముసాయిదా ప్రమాణాలు , స్మృతి, ఇతర వ్రాతప్రతుల పై చర్చ మరియు స్మృతికి లోబడి జాతీయ స్థితిలో గల అన్ని విషయాలను చర్చించడం. NCCP లో ప్రభుత్వ సంస్థలను, విద్యా కేంద్రాలను, పరిశ్రమలను మరియు వినియోగదారు సంస్థలను అదనముగా కలుపుకోవడం.



ఎఫ్ ఎ ఓ, (FAO) తోడ్పాటు

యునైటెడ్‌ నేషన్స్‌ ఆహార, ఆరోగ్యసంస్థ (FAO) యొక్క ప్రధానమైన, ప్రత్యేకమైన కార్యక్ర మం ఆహార ఆరోగ్య విషయాలన్నింటి పైన పనిచేయడం. ఆహార నాణ్యత, ప్రమాణాలసేవ, సామర్ధ్యతా నిపుణత మరియు విధానసలహాలను అందించడంలో సాంకేతిక తొడ్పాటుతో   ఆహారం, పోషణ  విభాగం పనిచేస్తుంది. ఆహారపరిశ్రమ కొరకు ఆహార నాణ్యత నియంత్రణ, ఆహార ప్రమాణాల అభివృద్ధి మరియు సాంకేతికతా నిబంధనలు, ఆహారనాణ్యత భద్రతనివ్వడంలో జరిగే కార్యక్రమాలను కలుపుకొని ఆహారనాణ్యతా నియంత్రణ మరియు భద్రతా అభివృద్ధి పథకాలను  అమలుపరచడం. జాతీయ ఆహారఎగుమతి ధృవీకరణ కార్యక్రమాలు, పర్యవేక్షక కార్యక్రమాలను, కలుషితమైన ఆహారం తెలుసుకోవడం కొరకు ఏర్పరచింది. ఇది  ఆహార నియంత్రణాం శాలపై ప్రాంతీయ, జాతీయ చర్చా వేదికలను నిర్వహించడం, కృత్యశాలలను  ఆహార, వ్యవసాయ సంస్థలోగల వివిధ దేశ సభ్యుల తోడ్పాటుతో అన్ని కార్యక్రమాలను తీసుకొని సామర్ధ్యతానిపుణత కొరకు ఆహారనియంత్రణా సామర్ధ్యతా నిపుణత కొరకు ఆహార నియంత్రణా కార్యక్రమాలను, కార్యకలాపాలను బలోపేతం చేయడం.
దీనిలోనిఅంశాలుః

  • ప్రత్యేక అంశాల పై విధాన సలహాలు
  • సంస్థాగత అభివృద్ధి లేదా సంస్థలను బలోపేతంచేయడంలో; సమీక్షలు, ఆహారంలో తాజా శాసనాలు
  • స్మృతి  మరియు ఇతర అంతర్జాతీయ నియమ, నిబంధనలతో ఆహార నిబంధనలను, ప్రమాణాలను పొందడం
  • సాంకేతిక, నిర్వాహక సిబ్బందికి వివిధ ఆహార భద్రతా సంబంధించిన విషయాలపై శిక్షణనివ్వడం.
  • ప్రత్యేక ఆహార సంబంధిత విషయాలపై అధ్యయనాలు, అనువర్తిత పరిశోధనలను చేయడం.

సామర్ధ్యతా నిపుణత కొరకు ప్రాంతీయ, జాతీయ కృత్యశాలలు నిర్వహించడం. ఆహార భద్రతా సంబంధిత అంశాలపై చర్చా వేదికలను నియమ సంపుటీలను, మార్గదర్శకాలను సమాచారం కొరకు అందివ్వడం. ఇతరసాధనాలతో ఆహార నియంత్రణ, ఆహారభద్రతాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం.
వ్యక్తిగతంగా ఆహార నియంత్రణ సమర్ధతను పెంచడవే FAO యొ క్క ప్రధానాంశం. దీనికి ప్రభుత్వ అధినేతలు,  ఆహారపరిశ్రమసిబ్బంది లో ఎవరైతే ఆహారాన్ని అందిస్తారో వారికి ఆహార నాణ్యత, భద్రతను పొందడంలో కార్యక్రమాలను నిర్వహిస్తారు. FAO లోభాగంగా అభివృద్ధి చెందుతున్నదేశాల కొరకు సాంకేతిక సహకార కార్యక్రమం చేయడం. ఈపథకం TCP/ IND/0067- జాతీయ స్మృతి సంఘాన్ని బలోపేతం చేయడంలో భారతదేశంలోగల FAO  మరియు ఆరోగ్య, కుటుంబ  సంక్షేమ మంత్రిత్వశాఖ, NCCP లు అమలుచేస్తాయి. ఈపథకం క్రింద  ఆరోగ్య మంత్రిత్వశాఖ యొక్క ఆహర విభాగంలొ జాతీయ స్మృతి వనరుల కేంద్రం ఏర్పాటైంది. అత్యాధునికమైన సమాచార వ్యవస్థతో అధనాతన సౌకర్యాలతో పరస్పర చర్చలకు ఆహారనాణ్యత, భద్రతాంశాలపై పని చేసే ప్రతీ మౌలిక వ్యక్తికి అవకాశాన్ని ఇవ్వడం.



ఇంకను అధిక సమాచారం కొరకు యూజర్‌ మేన్యువల్‌ ఆన్‌ కోడెక్స్‌ (ఇంగ్లీష్‌) ను చూడండి.


Powered by Plone CMS, the Open Source Content Management System

ఈ సైట్ ప్రమాణాలకు తగినట్లుగా ఉంది