కొబ్బరి తోటలు - ఎరువులు
Back to వ్యవసాయంCurrently 2 replie(s)
This discussion is threaded
Re: కొబ్బరి తోటలు - ఎరువులు
గోదావరి జిల్లాలో సాగునీటి వసతి సాధారణ పరిస్థితులలో ఉంటుంది. దీనికి పళ్ళెం పద్దతి చాలా మంచిది. డ్రీప్ ఇరిగేషన్ ఉపయోగించే చోట గుంటల పద్దతి మంచిది. మొక్కకి రెండు మీటర్ల దూరంగా మొక్క చుట్టూ గుండ్రంగా చానల్ త్రవ్వాలి. ఆ ఛానల్ లోతు 0.5 మీటరు ఉండాలి ( 1.5 అడుగులు ) వెడల్పు రెండు అడుగులు ఉండాలి. మీరు ఛానల్ త్రవ్వేటప్పుడు చెట్టు వ్రేళ్ళు తెగుతాయి. అవి తెగితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మళ్లీ చెట్టుకు 15 దినాలలో క్రొత్త వ్రేళ్ళు వస్తాయి. ఛానల్ త్రవ్విన తరువాత అందులో మొట్టమొదటిగా కొబ్బరి డొక్కను వేయండి. డొక్కలో పీచు పైకి ఉండే విధముగా చూడండి.
ఈ క్రింది చూపిన విధంగా ఎరువులు కలిపి కొబ్బరి డొక్క పైన వేయండి. అంటే క్రింద లేయర్ లో కొబ్బరి డొక్క పై లేయర్ లో ఎరువు ఉంటుంది. దీని వల్ల ఎరువును చెట్టు వ్రేళ్ళు దీర్ఘ కాలం పోందగలుగతాయి. ఈ ఎరువును జూన్ –జులై నెలలో మరియు రెండవ విడత అక్టోబర్ –నవంబర్ లో అంటే సంవత్సరానికి రెండు సార్లు ఎరువులు వేయాలి.
ప్రతిసారి ఈ క్రింది చూపిన మోతాదులో ఎరువులు ఉండాలి. ఇది ఒక చెట్టు ఇచ్చిన మోతాదు మాత్రమే.
ఎరువు
అమోనియం ఫాస్పేట్ -1.5 కేజిలు
యూరియా-0.75 కేజిలు
సూపర్ ఫాస్ఫేట్ -1.0 కేజిలు
మ్యరియేట్ పోటాష్ -1.2 కేజిలు
వేప పిండి -250 కేజిలు
సేంద్రియ ఎరువు (వానపాములు, గేదెల పెంట ) -20 కేజిలు
(మరచిపోవద్దు ఈ మిశ్రమం కేవలం ఆరు మాసాలకు మాత్రమే )
ఈ మిశ్రమాన్ని సమానంగా చెట్టూ చుట్టూ ఉన్న ఛానల్ వేయండి. దాని పైన హస్క్ , మట్టి మరియు వాటర్ పోయండి.
చెట్టుకు రెండు మీటర్ల దూరంగా మరియు అర్థ మీటర్ లోతు లో ఛానల్ ఎందుకు ఏర్పాటు చేయాలి.
ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్ల వ్రేళ్ళు ఉంటాయి. ఇవి త్వరితంగా ఎరువులను గ్రహించి మొక్కకు అందించగలుగుతాయి.
ఛానల్ అడుగున కొబ్బరి డొక్కను ఎందుకు ఏర్పాటు చేయాలి.
ఈ కొబ్బరి డొక్క నీటిని మరియు ఎరువులను వృధా కాకుండా నిల్వ ఉంచుతాయి. ఇలా చేయడం ద్వారా ఐదు సంవత్సరాల పాటు పంట దిగుబడి బాగా చూడవచ్చు.
*********
Re: Re: కొబ్బరి తోటలు - ఎరువులు
ఇచ్చిన సిఫార్సు మంచిది కాదు. అమ్మోనియా యూరియా రెండు ఇచ్చారు. రెండు కూడా నత్రజని ఉంది. ఒకటి ఇస్తే బాగుంటుంది.
జైరామ్ అమలాపురం




అదిగినవారు : M.S.N.Murthy ( GVS Member )
ఫ్రశ్న
పెద్ద కొబ్బరి చెత్లు
ఎకరానికి ఇది వరకు డి.టి.పి.50
కేజీలు యూరియా 50
కేజీలు పొటాష్ 50 కె లు గోతులు
తీసి పెట్టారు
అయితే దిగుబడి తక్కువగా ఉంది.
దిగుబడి పెరగాలంటే పళ్ళెం
చేసి పెట్టాలా లేకపొతే ఇది
వరకటిలా గోతులు తీసి
పెట్టాలా? ఇదివరకు చెట్టుకు 2
గోతులు తీసి 2.5కేజీలు పెట్టారు.